ఆలోచింపజేసిన ‘సీతాకోకచిలుక’ | seethakokachiluka is cause to thingking | Sakshi
Sakshi News home page

ఆలోచింపజేసిన ‘సీతాకోకచిలుక’

Published Sun, Aug 28 2016 9:04 PM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM

ఆలోచింపజేసిన ‘సీతాకోకచిలుక’ - Sakshi

ఆలోచింపజేసిన ‘సీతాకోకచిలుక’

– కనుల పండువగా మినీ నంది నాటకోత్సవాలు
 
నంద్యాల:  పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ప్రభావం చూపుతోందో వివరించిన సీతాకోక చిలుక బాలల సాంఘిక నాటకం ఆలోచింజేసింది. రాష్ట్ర చలన చిత్ర, టీవీ నాటకరంగ సంస్థ కళారాధన, రోటరీ క్లబ్, లయన్స్‌ క్లబ్, ఐఎంఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న మినీ నంది నాటకోత్సలు ఆదివారం కనుల పండువగా జరిగాయి. గురురాజ కాన్సెప్ట్‌ స్కూల్, కళారాధన సంస్థ రూపొందించిన సీతాకోకచిలుక నాటకానికి రాష్ట్ర ప్రభుత్వ బంగారునంది అవార్డు వచ్చింది. రెండు కుటుంబాలను ఆధారంగా తల్లిదండ్రుల ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో చిన్నారులపై పడే మంచి, చెడు ప్రభావాలను దర్శకుడు డాక్టర్‌ రవికష్ణ స్పష్టంగా వివరించారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రామచంద్రయ్య, జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో లయన్స్, రోటరీ క్లబ్‌ అధ్యక్షులు భవనాశి నాగమహేష్, రమేస్, కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రవికష్ణ డాక్టర్‌ లక్ష్మణ్‌కిశోర్, పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. బాల గాయకుడు సాయివల్లభ్‌ పాటలతో అలరించారు. చిన్మయ స్కూల్, శాంతినికేతన్, గురురాజ స్కూల్‌ విద్యార్థులు అద్భుతమైన నత్యాలతో ఆకట్టుకున్నారు. గురురాజ స్కూల్‌ విద్యార్థుల యోగ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.  అలాగే నవజీవన్‌ బధిరుల దేశభక్తి మైదాన నత్యం ప్రేక్షకుల హదయాలను కదిలించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement