అవార్డులను విమర్శించాలంటే ఆధార్ కావాలా ? | Posani krishna murali Responds on Nandi Awards Controversy | Sakshi
Sakshi News home page

ఈ నంది అవార్డు నాకొద్దు : పోసాని

Published Tue, Nov 21 2017 2:06 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

‘నంది అవార్డుల వివాదం మరింత పెద్దది అయితే అవార్డులను రద్దు చేస్తాం’.. ‘ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నరు’ అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేష్ వ్యాఖ్యల వల్ల తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి హైదరాబాద్‌లో మంగళవారం ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌పై పోసాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement