
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
హైదరాబాద్ : నంది అవార్డులు తీసుకోలేదు.. పంచుకున్నారని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. నంది అవార్డులు తీసుకున్నపుడు గొడవ చేశామన్నారు కదా.. ఆ నంది అవార్డు కమిటీలు వేసింది కూడా మీరే(చంద్రబాబు నాయుడు)కదా అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. తమరు పంచిన నంది అవార్డులు తీసుకున్న వారు ఈ విషయంపై ఎందుకు స్పందించరని అడిగారు. ఆడవాళ్ల అందాలతో సినిమా తీసేవాళ్లు తమరి పక్కనే ఉన్నారు కదా వారెందుకు హోదా కోసం పోరాడరు అని ప్రశ్నించారు. తాము ఏసీల్లో కులుకుతున్నామా..? మీరే (టీడీపీ నాయకులనుద్దేశించి) లంచాలు తిని ఏసీల్లో కులుకుతున్నారని ధ్వజమెత్తారు.
తాము రాత్రి, పగలు కష్టపడితే పది మందికి అన్నం దొరుకుతున్నదని తెలియజేశారు. తమరికి ప్రత్యేక హోదా విషయం కంటే జగన్, మోదీ, పవన్ ఎక్కడ కలుస్తారనే విషయం భయంగా ఉందని, అందుకే సినిమా వాళ్ల మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు కానీ అప్పటి నుంచీ మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని సూటిగా అడిగారు. సినిమా వాళ్ల భార్యల గురించి అసభ్యంగా మాట్లాడినపుడు మాట్లాడని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని గట్టిగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment