
నంది అవార్డుల వివాదాన్ని తెరమీదకు వచ్చింది బన్నీ వాసు ఫేస్ బుక్ పోస్ట్ తోనే.. ఇటీవల ప్రకటించిన అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిదంటూ బన్నీ వాసు స్పందించిన తరువాతే ఇంత వివాదం రాజుకుంది. నంది అవార్డుల వివాదం మరింత ముదిరితే అవార్డులను రద్దు చేస్తామంటూ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించటంపై పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. తాజాగా బన్నీవాసు మరోసారి ఈ వివాదం పై స్పందించారు. పోసాని వ్యాఖ్యలు మద్దతు పలుకుతూ 'మనం ఏపీలో పుట్టాం.. ఏపీలో పెరిగాం.. ఏపీలోనే చదువుకున్నాం.. అమెరికాలో కాదు. మనం ఏపీ వాళ్లమని రుజువు చేసువాల్సిన అవసరం లేదు' అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment