సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తరపున సినీ అవార్డులను వచ్చే ఏడాది నుంచి ప్రకటిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం దివంగత దాసరి నారాయణరావు 76వ జయంతిని పురస్కరించు కుని మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఆయన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ సినీరంగానికి దాసరి చేసిన సేవలను కొని యా డారు. దర్శకుడిగా 150 సినిమాలను తెరకెక్కించి గిన్నిస్‌బుక్ రికార్డును స్వంతం చేసుకున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దాసరి వంటి దర్శక దిగ్గజం మన తెలుగు సినీ పరి శ్రమలో ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు.
మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నంది అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదని కార్యక్రమంలో విలేకరు లు మంత్రి తలసానిని అడిగారు. అవార్డులు ఇవ్వాలని సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వాన్ని ఎవరూ సంప్రదించలేదని మంత్రి బదులిచ్చా రు. కార్యక్రమంలో చిత్రపురి హౌసింగ్ సొసై టీ, 24 క్రాఫ్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్, సినీ ప్రముఖులు సి.కల్యాణ్, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, దర్శ కులు ఎన్.శంకర్, రేలంగి నర్సింహారావు, దాసరి అరుణ్‌కుమార్, ఫిలించాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్తా మీనన్!
Comments
Please login to add a commentAdd a comment