ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన అవి నంది అవార్డులు కావని, కాపు,కమ్మ అవార్డులంటూ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'గ్రూపులు, కులాలుగా విడిపోయి నంది అవార్డులను పంచుకున్నారు.చంద్రబాబు హయాంలో కులాలను బట్టే పంపకాలు జరిగేవి.
టెంపర్ సినిమాకు నాకు నంది అవార్డు ఇచ్చారు. అంటే తప్పని పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేక నాకు ఇచ్చారు. నేను కూడా వెళ్లి తీసుకున్నా. అసలు ఎవరెవరికి ఏయే అవార్డులు ఇచ్చారో చూశా. అప్పుడు అవార్డుల కమిటీలో 12 మంది సభ్యులు ఉంటే, అందులో 11 మంది కమ్మ కులస్తులే ఉన్నారు.
అవార్డులు ఒక కులానికే పంచేసుకుంటారని అప్పుడు అర్థమైంది. నాకు వచ్చిన అవార్డు కమ్మనందిలా కనిపించింది. అందుకే నంది అవార్డును తిరస్కరించాను. అవార్డులు అనేవి కులాలు, మతాలకు సంబంధం లేకుండా ఇవ్వాలి' అంటూ పోసానీ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment