nandi award
-
బిగ్ బాస్ అశ్విని శ్రీకి ఇంత గొప్ప అవార్డా? (ఫోటోలు)
-
కాలంతో పాటు కనుమరుగవుతున్న నాటకాలకు పునరుజ్జివనం
-
నంది అవార్డులపై పోసాని కామెంట్స్
-
ప్రతిభ ఆధారంగా అవార్డులకు ఎంపిక
-
నంది అవార్డు ప్రతి ఆర్టిస్ట్ కల
‘‘1964 నుండి నంది అవార్డ్స్ ఇస్తున్నారు. ఆ అవార్డు అందుకోవాలనేది ప్రతి ఆర్టిస్ట్ కల. 7 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నంది అవార్డ్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్‌గారికి థ్యాంక్స్. అలాగే సీనియర్ నటుల పేరుతో స్మారక అవార్డ్స్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం’’ అని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ అన్నారు. ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో ఆగస్టు 12న దుబాయ్‌లో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్‌ను అలీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘దాదాపు ఆరేడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో నంది అవార్డ్స్ పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వేడుకకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు’’ అన్నారు. -
నంది పురస్కారం లేక ఆరేళ్లు.. ఎక్కువ అవార్డులు ఏ హీరోకో తెలుసా?
మీరు సినిమా బాగా చేశారండి.. పెదాలపై చిన్న చిరునవ్వు.. మీ నటనకు నంది అవార్డు వచ్చిందండి.. గుండె నిండా సంతోషం.. ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలన్న తన్మయత్వం.. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు నంది అవార్డులు ఎవరిస్తున్నారని! ఈ అవార్డులు ప్రకటించక ఆరేడేళ్లవుతోంది. నంది పురస్కారాలను ఎవరూ పట్టించుకోవట్లేదని ఇటీవలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నిర్మాత ఆది శేషగిరి రావు. నంది అవార్డులకు ప్రాముఖ్యతే లేకుండా పోయిందని బాధపడ్డారు. ఈ క్రమంలో నిర్మాత అశ్వినీదత్ నోరు జారుతూ ఇస్తారులే.. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులు అంటూ వెటకారంగా మాట్లాడారు. దీంతో చిర్రెత్తిపోయిన ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి ఉత్తమ మోసగాడు అవార్డులు మీకే ఇస్తాంలే అని కౌంటరిచ్చాడు. అయినా బాబు హయాంలో కులాలాను బట్టి నంది అవార్డులు ప్రకటించేవారని, నిజాయితీగా అవార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. నిజమే., టీడీపీ హయాంలో నీది ఏ కులం? ఏ ప్రాంతం? నీకు అవార్డు ఇస్తాను.. మరి నాకేటిస్తావు? ఇలా అన్నీ చర్చించుకున్న తర్వాతే నంది ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారికే ఇచ్చేవారట. ఈ క్రమంలో కొన్ని అద్భుతం అనిపించిన చిత్రాలను సైతం నిర్దాక్షిణ్యంగా పక్కన పడేసేవారు. దీంతో ఎంతోమంది చిన్నబుచ్చుకునేవారు. వారిలో కొందరే ఆక్రోశం అణుచుకోలేక బయటపడేవారు. అలా రుద్రమదేవి తీసిన గుణశేఖర్, రేసుగుర్రం నిర్మించిన బన్నీ వాసు, డైరెక్టర్ మారుతి సోషల్ మీడియాలో తమ అసహనాన్ని ప్రదర్శించారు కూడా! తెలుగు ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా నంది పురస్కారానికి పేరుంది. అలాంటి నంది పురస్కారాల వేడుక మళ్లీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాబట్టి ఓసారి ఈ అవార్డుకు సంబంధించిన విశేషాలను గుర్తు చేసుకుందాం.. ► 1964లో నంది అవార్డుల ప్రదానం మొదలైంది. దాదాపు 50 సంవత్సరాలు ఈ పరంపర కొనసాగింది. 2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ 2017లో నంది అవార్డులు ప్రకటించారు. ఆ తర్వాత నంది అవార్డుల ప్రదానంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ► 1964లో ఉత్తమ ఫీచర్ ఫిలింగా డాక్టర్ చక్రవర్తి సినిమా ఎంపికైంది. అప్పుడు కేవలం ఉత్తమ చిత్రం కేటగిరీ మాత్రమే ఉండేది. ► 1977 నుంచి నటీనటులు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు పురస్కారం ఇచ్చే పరంపర మొదలైంది. ► ఎక్కువ నంది అవార్డులు అందుకున్న హీరో నాగార్జున. నటుడిగా నాలుగు, నిర్మాతగా ఐదు నందులు గెలుపొందారు. ► 8 నంది పురస్కారాలతో మహేశ్‌బాబు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. ►వెంకటేశ్, జగపతి బాబు 7 సార్లు, చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ మూడేసి చొప్పున నందులు పొందారు. ► 2016లో చివరగా జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్‌గా(నాన్నకు ప్రేమతో) అవార్డు అందుకున్నారు. ► ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి 11సార్లు నంది అవార్డు అందుకున్నారు. చదవండి: చిన్నవయసులోనే పెళ్లి, కొంతకాలానికే విడాకులు: నటుడు -
ఆ అవార్డ్ అంటే చంద్రబాబుకు తొక్కతో సమానం
-
మై డియర్ పవన్ కళ్యాణ్.. ఆ కుటుంబమే రోడ్డున పడింది..
-
బాబుకి జై కొడితేనే నంది అవార్డుల జాబితాలో పేరు
-
నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసానీ
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన అవి నంది అవార్డులు కావని, కాపు,కమ్మ అవార్డులంటూ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'గ్రూపులు, కులాలుగా విడిపోయి నంది అవార్డులను పంచుకున్నారు.చంద్రబాబు హయాంలో కులాలను బట్టే పంపకాలు జరిగేవి. టెంపర్ సినిమాకు నాకు నంది అవార్డు ఇచ్చారు. అంటే తప్పని పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేక నాకు ఇచ్చారు. నేను కూడా వెళ్లి తీసుకున్నా. అసలు ఎవరెవరికి ఏయే అవార్డులు ఇచ్చారో చూశా. అప్పుడు అవార్డుల కమిటీలో 12 మంది సభ్యులు ఉంటే, అందులో 11 మంది కమ్మ కులస్తులే ఉన్నారు. అవార్డులు ఒక కులానికే పంచేసుకుంటారని అప్పుడు అర్థమైంది. నాకు వచ్చిన అవార్డు కమ్మనందిలా కనిపించింది. అందుకే నంది అవార్డును తిరస్కరించాను. అవార్డులు అనేవి కులాలు, మతాలకు సంబంధం లేకుండా ఇవ్వాలి' అంటూ పోసానీ ధ్వజమెత్తారు. -
ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత
ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు (87) మంగళవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడకు చెందిన జీజీ కృష్ణారావు చెన్నై నుంచి సినీ ప్రయాణాన్నిప్రారంభించారు. ఎడిటర్‌గానే కాదు.. అసోసియేట్ డైరెక్టర్,ప్రొడక్షన్ డిజైనర్‌గానూ పని చేశారాయన. బాపు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్, దాసరి నారాయణరావు, జంధ్యాల వంటి ఎందరో ప్రముఖ దర్శకుల చిత్రాలకు ఎడిటర్‌గా చేశారాయన. ‘శంకరాభరణం, వేటగాడు, బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభలేఖ’ వంటి దాదాపు 300 సినిమాలకు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు కృష్ణారావు. డైరెక్టర్ కె. విశ్వనాథ్‌తో కృష్ణారావుకు మంచి అనుబంధం ఉండేది. అందుకే ఆయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలకు కృష్ణారావు పని చేశారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సప్తపది’కి కృష్ణారావు తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమా నుంచే ఎడిటింగ్ విభాగంలో నంది అవార్డు ఇవ్వడంప్రారంభమైంది. అనంతరం ‘సాగర సంగమం, శుభ సంకల్పం’ చిత్రాలకు కూడా నంది అవార్డులు సొంతం చేసుకున్నారాయన. కృష్ణారావుకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బెంగళూరులోని తన కుమార్తె వద్ద ఉంటున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. జీజీ కృష్ణారావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘ఎడిటింగ్ శాఖకు గౌరవాన్ని తెచ్చిన వారిలో కృష్ణారావుగారు ఒకరు. ఆయన మరణంతో తెలుగు ఫిలిం ఎడిటర్స్ ఒక పెద్ద దిక్కును కోల్పోయారు’’ అని తెలుగు ఫిలిం ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మార్తాండ్ కె. వెంకటేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
తెలుగమ్మాయిగా గర్వపడుతున్నా!
నటిగా, టీవీ వ్యాఖ్యాతగా, నిర్మాతగా తెలుగు చలన చిత్రపరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. ఈ నెలలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డును గెలుచు కున్నారు. గతంలో కూడా ఆమె నంది అందుకున్నారు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో విడుదలైన ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో ప్రతినాయకురాలి పాత్రలో ఉత్తమ నటనను కనబరచినందుకు మంచు లక్ష్మికి తొలిసారి నంది అవార్డు వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 2014లో విడుదలైన ‘చందమామ కథలు’ సినిమాలో లీసా స్మిత్ పాత్రలో ఆమె అద్భుతంగా నటించారని, ఏపీ ప్రభుత్వం ఆమెకు ఉత్తమ సహాయనటి విభాగంలో నంది అవార్డును అనౌన్స్ చేసింది. మంచి లక్ష్మికి అవార్డు రావడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ‘‘అవార్డు ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలుగు అమ్మాయిగా నాకెంతో గర్వంగా ఉంది’’ అన్నారు మంచు లక్ష్మి. -
‘నంది’ బాధ్యత పెంచింది
భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో 2014కి ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా సుధాకర్ గౌడ్ ఎంపికయ్యారు. ‘‘సాధారణంగా బాలల చిత్రాలకు అవార్డులు ఇస్తుంటారు. కానీ, బాలల చిత్రదర్శకుడిగా నాకు పురస్కారం దక్కడం మరింత ఆనందంగా ఉంది. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో పురస్కారం గెల్చుకున్న ఏకైక చిత్రం మాదే. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఇండీవుడ్ చిత్రోత్సవంలోనూ అవార్డు వచ్చింది. నంది అవార్డు నా బాధ్యతను పెంచింది. భవిష్యత్‌లో మరిన్ని బాలల చిత్రాలు తీస్తా’’ అన్నారు. -
నంది అవార్డు రావటం ఆనందంగా ఉంది : బాలకృష్ణ
2014 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులలో లెజెండ్ సినిమా ఎక్కువ అవార్డులు సాధించటంపై హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. లెజెండ్ సినిమాకు ఉత్తమ చిత్రంతో పాటు హీరో, దర్శకుడు, విలన్, మాటల రచయిత, ఎడిటర్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఫైట్ మాస్టర్ కేటగిరీల్లో నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్యతో తనతో పాటు 2015, 16 సంవత్సరాలకు నంది అవార్డులు అందుకోనున్న నటీనటులు సాంకేతికనిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ అంశాలపై కూడా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ, చెరువున్ని జలకళ సంతరించుకోవటం ఆనందంగా ఉందన్నారు. వర్షాలు బాగా కురవటంతో చెరువులన్ని నిండాయని తెలిపారు. ఫిబ్రవరి 24,25 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
స్క్రీన్ టెస్ట్
► 2010లో ‘లీడర్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన రానా 2006లో నంది అవార్డు అందుకున్నారు. ఆ అవార్డు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎ) విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ బి) విజువల్ ఎఫెక్ట్స్ స్పెషలిస్ట్ సి) విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ డి) విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ ► మురుగదాస్ డైరెక్షన్లో బొమ్మాళి అనుష్క స్పెషల్ అప్పియరన్స్ చేశారు. ఆ చిత్రంలో నటించిన హీరో ఎవరో తెలుసా..? ఎ) విజయ్ బి) విజయ్‌కాంత్ సి) చిరంజీవి డి) సూర్య ► ఫ్రెండ్షిప్కి వేల్యూ ఇస్తూ ప్రభాస్ హిందీ చిత్రం ‘యాక్షన్ జాక్సన్’లో గెస్ట్ అప్పియరన్స్ చేశారు. ఆ ఫ్రెండ్ ఎవరు? ఎ) సోనాక్షీ సిన్హా‡ బి) ప్రభుదేవా సి) అజయ్ దేవగన్ డి) సల్మాన్ ఖాన్ ► ‘ఠాగూర్’ (తమిళంలో ‘రమణ’) హిందీ రీమేక్ ‘గబ్బర్’ దర్శకుడు ఎవరు? ఎ) ఏ.ఆర్ మురుగదాస్ బి) క్రిష్ సి) శేఖర్ కమ్ముల డి) ఎన్.శంకర్ ► మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌కు శిల్పా శిరోద్కర్ ఏమవుతారు? ఎ) వదిన బి) పిన్ని సి) చెల్లెలు డి) అక్క ► ‘ఠాగూర్’లో ముందు చిరంజీవి హీరో కాదు. వేరే హీరో చేయాలనుకున్నారు. అతనెవరో తెలుసా? ఎ) బాలకృష్ణ బి) నాగార్జున సి) వెంకటేశ్ డి) రాజశేఖర్ ► నందమూరి తారకరామారావు 1959లో చేసిన ‘దైవబలం’ చిత్రం ద్వారా ఒక నటుణ్ణి పరిచయం చేశారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలసి ఇరవై పై చిలుకు చిత్రాల్లో నటించారు. ఆ హీరో ఎవరు? చిన్న క్లూ: అతనికి ఫ్యామిలీ హీరో అనే పేరుంది. ఎ) రామకృష్ణ బి) కాంతారావు సి) హరనాథ్ డి) శోభన్‌బాబు ► 1991లో విడుదలైన ‘నిర్ణయం’లో ‘హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం....’ అంటూ హుషారెత్తించిన పాటకు ట్యూన్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎ)ఇళయరాజా బి) కేవీ మహదేవన్ సి) ఎమ్.ఎస్ విశ్వనాథన్ డి) చక్రవర్తి ► ‘బాయ్స్’లో ‘ఆలే...ఆలే...’ సాంగ్ టేకింగ్ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. 62 స్టిల్ కెమెరాలతో ఒక కొత్త టెక్నాలజీతో దర్శకుడు శంకర్ ఆ పాట తీశారు. ఆ టెక్నాలజీ పేరు చెప్పగలరా..? ఎ) స్టిల్ టెక్నాలజీ బి) మూమెంట్ టెక్నాలజీ సి) ఫ్రీజ్ టెక్నాలజీ డి) క్యాప్చర్ టెక్నాలజీ ► యూఎస్‌లో కలెక్షన్స్ వైజ్‌గా సంచలనం సృష్టించిన హీరో నాని మొదటి సినిమా ఏది? ఎ) ఎవడే సుబ్రమణ్యం బి) భలేభలే మగాడివోయ్ సి) జెంటిల్మెన్ డి) మజ్ను ► పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రంలో మలయాళీ భామ కీర్తీ సురేశ్ ఓ కథానాయిక. మరో కథానాయిక కూడా మలయాళీనే. ఆమె ఎవరు? ఎ) మంజిమా మోహన్ బి) అనుపమా పరమేశ్వరన్ సి) అను ఇమ్మాన్యుయేల్ డి) సాయిపల్లవి ► ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో చిన్న ఎన్టీఆర్ ఓ కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించారు. ఆ స్టైల్ చేసిన హెయిర్ స్టైలిస్ట్ ఎవరో తెలుసా? ఎ) జావేద్ హబీబ్బి) హకీమ్ అలీ సి) అలీ డి) మహబూబ్ ► ఈ కింది దర్శకుల్లో ఒక దర్శకుడు సెట్‌కు ప్రాధాన్యం ఉండేలా స్క్రిప్ట్‌ను తయారు చేసుకుంటారు. ఆ దర్శకుడు ఎవరై ఉంటారు? ఎ) వీవీ వినాయక్ బి) శేఖర్ కమ్ముల సి) గుణశేఖర్ డి) సురేందర్ రెడ్డి ► మహేశ్‌బాబు ట్విట్టర్ ఐడీ కనుక్కోండి చూద్దాం. ఎ) యువర్స్ ట్రూలీ మహేశ్ బి) ఐయామ్ మహేశ్ సి) యువర్స్ మహేశ్ డి) మీ మహేశ్ ► మలయాళ ‘ప్రేమమ్’ నటి సాయిపల్లవికి మంచి మార్కులు తెచ్చిపెట్టింది. తెలుగు రీమేక్‌లో ఆ క్యారెక్టర్ చేసిన నటి ఎవరు? ఎ) కాజల్ అగర్వాల్ బి) శ్రుతీహాసన్ సి) లావణ్యా త్రిపాఠి డి) కీర్తీ సురేశ్ ► ‘అరటిపండు లంబా లంబా’ అంటూ ‘చంటబ్బాయి’ చిత్రంలో తన కవిత్వంతో హాస్యాన్ని పండించిన నటి ఎవరు? ఎ) శ్రీలక్ష్మి బి) రజిత సి) కోవై సరళ డి) జయలలిత ► అల్లు అర్జున్ సుకుమార్ కలసి సెక్యూరిటీ సిస్టమ్ మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి చేసిన షార్ట్ ఫిల్మ్ పేరు? ఎ) ది బ్లైండ్ డేట్ బి) షేర్ ది స్పిరిట్ ఆఫ్ దివాలి సి) అతిథి డి) ఐయామ్ ది ఛేంజ్ ► గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్’ సినిమాలో ‘నరికేస్తా.. నిలువునా నరికేస్తా..’ అంటూ మహేశ్‌బాబు రౌద్రం ప్రదర్శించిన ఫైట్‌ని డిజైన్ చేసిన ఫైట్‌మాస్టర్ ఎవరో తెలుసా? ఎ) అణల్ అరసు బి) విజయన్ సి) రామ్–లక్ష్మణ్ డి) పీటర్ హెయిన్ ► ఈ ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్న ఈ బుడతడు ఇప్పుడు లోక నాయకుడు... ఊహించేశారు కదూ! ఎ) అజిత్ బి) సూర్య సి) కమల్‌హాసన్ డి) రజనీకాంత్ ► ఎస్వీ రంగారావు పౌరాణిక గెటప్‌లో ఉన్న ఈ స్టిల్ ఏ సినిమాలోది? ఎ) ఇంద్రజిత్ బి) మాయాబజార్ సి) భూకైలాస్ డి) పాతాళ భైరవి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే...మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) సి 3) బి 4) బి5) డి 6) డి 7) డి 8) ఎ 9) సి 10) బి 11) సి 12) బి 13) సి 14) ఎ 15) బి 16) ఎ17) డి 18) బి 19) సి 20) ఎ. -
కర్నూలు వాసికి ఉత్తమ మేకప్‌మెన్ అవార్డు
కర్నూలు (అగ్రికల్చర్) : కర్నూలు వాసికి ఉత్తమ మేకప్‌మెన్‌గా అవార్డు లభించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో నంది నాటకోత్సవాలు జరిగాయి. పద్య, నాటక విభాగంలో శ్రీకృష్ణ భీమసేనం నాటకానికి సంబంధించి కర్నూలుకు చెందిన చింత శ్రీనివాసులుకు ఉత్తమ మేకప్‌మెన్‌గా నంది అవార్డు లభించింది. కర్నూలు అభిఆర్ట్స్కు చెందిన చింతా శ్రీనివాసులు ఇదివరకే ఐదు అవార్డులు దక్కించుకున్నారు. తాజాగా మరో అవార్డు దక్కడం విశేషం. కర్నూలు వాసికి అత్యుత్తమమైన అవార్డు దక్కడంపై కళాకారులు అభినందనలు తెలిపారు. -
పిల్లల దాకా వెళ్లని సినిమాలు తీసి ప్రయోజనం ఏంటి?
భద్రం కొడుకో, తోడు, పాత నగరంలో పసివాడు, గులాబీలు, అమూల్య... దర్శక–నిర్మాత అక్కినేని కుటుంబరావు తీసిన బాలల చిత్రాలివి. పిల్లల కోసం సినిమాలు తీశాననే అత్మసంతృప్తి మాత్రమే మిగిలింది. అందుకే ఇప్పుడాయన ‘బాలల చిత్రా’ల జోలికి వెళ్లడం లేదంటున్నారు. 2012, 2013 ‘నంది అవార్డు’ల జాబితాలో ‘ఉత్తమ బాలల చిత్రం’ విభాగంలో ఒక్క చిత్రం కూడా ఎంపిక కాలేదు. బాలల చిత్రాల నిర్మాణ సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది? అవి పెరగాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఈ సందర్భంగా కుటుంబరావుతో ‘సాక్షి’ జరిపిన ‘స్పెషల్ ఇంటర్వ్యూ’... ఉత్తమ బాలల చిత్రం కేటగిరీలో ఒక్క సినిమా కూడా లేకపోవడం ఎలా అనిపిస్తోంది? ఇది చాలా బాధపడాల్సిన విషయం. పిల్లల కోసం ప్రత్యేకంగా సినిమాలు తీయడం, వాళ్లకు చూపించడం చాలా ముఖ్యమైన విషయం. అందులో మనం వెనకపడ్డాం. దానికి కారణం థియేటర్లు దొరక్కపోవడం, ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోవడం. అందువల్ల నాలాంటివాళ్లు పిల్లల సినిమాలు తీయలేకపోతున్నారు. మీరు తీసిన ఐదు సినిమాల్లో ఏ సినిమాకైనా సబ్సిడీ వచ్చిందా? నా ‘పాత నగరంలో పసివాడు’ సినిమా ‘కైరో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’కి సెలక్ట్ అయింది. అక్కడ ప్రదర్శిస్తే మంచి స్పందన లభించింది. ఇక్కడ ‘స్వర్ణ నంది’ గెలుచుకుంది. ఇక.. సబ్సిడీ రాకపోవడానికి కారణాలు కొన్ని నియమాలు. పదకొండు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాకు సబ్సిడీ వస్తుందంటారు. అన్ని థియేటర్లు దొరకాలిగా. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుని, బాలల సినిమాలకు థియేటర్లు దొరికేలా చేయాలి. పిల్లల కోసం ప్రత్యేకంగా సినిమాలు తీయడంలో పిల్లలకు కలిగే ప్రయోజనాల గురించి చెబుతారా? ఇప్పుడు హింస నేర్పించే సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. ఆ సినిమాలు చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు? తల్లిదండ్రులు కూడా వాటినే చూపిస్తున్నారు. భావితరం అని లెక్చరర్లు ఇస్తుంటాం. భావితరాలకు చూపించాల్సిన సినిమాలు ఇవేనా? ఇటు తల్లిదండ్రులు, అటు ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉన్నారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ‘మంచి’ నేర్పించే సినిమాలు చూపించడంవల్ల పిల్లలు మంచి మార్గం వైపు వెళతారు. ఇప్పుడు చిల్డ్రన్ మూవీ తీయమని మిమ్మల్ని అడగడంలేదా? కొంతమంది నిర్మాతలు వస్తున్నారు. ‘థియేటర్లు దొరకవు. సబ్సిడీ రాదు’ అని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాను. దాంతో వెనక్కి తగ్గుతారు. నాకు తీయాలనే ఉంటుంది. కానీ, వచ్చే నిర్మాతల గురించి ఆలోచించాలి కదా. పెద్ద నిర్మాతలెవరినైనా పిల్లల సినిమాలు తీయమని అడిగారా? పెద్ద బడ్జెట్‌తో సినిమాలు తీసే నిర్మాతలను అడిగాను. ‘ఓ పదీ పదిహేను లక్షలు చాలు. మీకది పెద్ద విషయం కాదు. మంచి సినిమా తీద్దాం’ అని అడిగాను కానీ, ఎవరూ ఆసక్తి కనబర్చలేదు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మీరు చెప్పదలచుకున్నదేంటి? ప్రతి మండలానికి కనీసం ఒక థియేటర్ అయినా నిర్మించాలి. ప్రతి శని, ఆదివారాల్లో అయినా బాలల సినిమా ప్రదర్శించుకునే వీలు కల్పించాలి. అదీ కాకపోతే ఒక స్పెషల్ షో వేసుకునే అవకాశం అయినా ఇవ్వాలి. పిల్లల దాకా వెళ్లని సినిమాలు తీసి ప్రయోజనం ఏంటి? -
కర్నూలు నాటకానికి ఏడు నందులు
రికార్డు సృష్టించిన ప్రమీలార్జున పరిణయం – నంది నాటకోత్సవ చరిత్రలోనే అరుదైన రికార్డు కర్నూలు(కల్చరల్): రాష్ట్రస్థాయి నంది నాటక పోటీల్లో కర్నూలు లలిత కళాసమితి కళాకారులు ప్రదర్శించిన ‘ప్రమీలార్జున పరిణయం’ పద్యనాటకం ఏడు నంది అవార్డులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నాటకానికి ఉత్తమ ద్వితీయ ప్రదర్శన(వెండి నంది), ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచన, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ హాస్యనటి, ఉత్తమ సంగీత దర్శకత్వం అవార్డులు లభించాయి. నాటకానికి దర్శకత్వం వహించిన పత్తి ఓబులయ్యకు ఉత్తమ దర్శకుడు, రచన చేసిన ప్రముఖ నాటక రచయిత పల్లేటి కులశేఖర్‌కు ఉత్తమ రచయిత, నాటకంలో అర్జున పాత్ర పోషించిన బాల వెంకటేశ్వర్లుకు ఉత్తమ నటుడు అవార్డులు లభించాయి. నారద పాత్ర పోషించిన శామ్యూల్‌కు ఉత్తమ సహాయ నటుడు, కుతూహలం పాత్ర పోషించిన విజయకు ఉత్తమ హాస్యనటి, సంగీత దర్శకత్వం వహించిన రామలింగంకు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వరించింది. నంది నాటక పోటీల్లోనే తొలిసారిగా ఏడు నందులు సాధించి అరుదైన రికార్డు సృష్టించి కర్నూలు కళారంగ ఖ్యాతిని ఇనుమడింపజేసిన లలిత కళాసమితిని పలువురు నాటకరంగ మేధావులు అభినందించారు. లలిత కళాసమితి రాష్ట్రస్థాయి నంది నాటక పోటీల్లో ఏడు నందులు సాధించడం పట్ల తెలుగు కళాస్రవంతి అధ్యక్షులు డాక్టర్ ఎం.పి.ఎం.రెడ్డి, ప్రముఖ నవలా నాటక రచయిత ఎస్.డి.వి.అజీజ్, ప్రముఖ జానపద కవి డాక్టర్ వి.పోతన ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. -
నంది అవార్డుల ఎంపికకు కమిటీలు
సాక్షి, అమరావతి: చలనచిత్ర రంగంలో విశేష ప్రతిభ చూపిన కళాకారులను అవార్డులకు ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. 2012, 2013 సంవత్సరాలకు సంబంధించి ఎన్టీఆర్ స్మారక జాతీయ చలనచిత్ర అవార్డు, పలువురు ప్రముఖుల స్మారక రాష్ట్రస్థాయి అవార్డులు, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర,, టీవీ నంది అవార్డులకు ప్రతిభావంతులను ఎంపిక చేయడం కోసం వేర్వేరు కమిటీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జీవిత సత్యాల్ని తెలిపేదే సాహిత్యం
కామారెడ్డి: జీవిత సత్యాల్ని తెలిపేది.. ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని పెంపొందించేది సాహిత్యమేనని ప్రముఖ కవి, నంది అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మొదట గుర్తించింది సాహిత్యకారులేనని, సాహిత్య అధ్యయనంతో వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చునని తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంఏ తెలుగు విద్యార్థులకు ‘ఎంఏ తెలుగు–అధ్యయనం–అవగాహన’ అంశంపై సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏ కోర్సు అయినా శ్రద్ధగా చదివితే బతుకుబాట చూపుతుందని నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా అవతరిస్తున్న నేపథ్యంలో ఎంఏ తెలుగు కోర్సును ఆరంభించడం శుభ సూచకమన్నారు. వ్యక్తిగత జీవితాల్లోని ఒడిదుడుకులను సరిచేసుకునేలా జీవితాన్ని మలచుకోవచ్చునని, సమాజంలో వేలాది మంది జీవితాల్ని సాహిత్యం ద్వారా చదివే అవకాశం కలుగుతుందన్నారు. ఉద్యోగులుగా, రచయితలుగా, జర్నలిస్టులుగా ఎదగడానికి సాహిత్య అధ్యయనం తోడ్పడుతుందని, విద్యార్థులు తెలుగు సాహిత్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలని సూచించారు. అందమైన అచ్చ తెలుగు పదాలు తెలంగాణ పలుకుబడుల్లోనే అత్యధికం అని, వాటిని పరిశోధించడానికి నిరంతరం కృషి చేయాలని డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ విద్యార్థులకు సూచించారు. ప్రిన్సిపల్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పీవీ నర్సింహం, లక్ష్మయ్య, డాక్టర్ వి.శంకర్, కో–ఆర్డినేటర్ అశోక్‌కుమార్, రవికిరణ్, రంజిత్‌మోహన్, డాక్టర్ ఏ.సుధాకర్, కిష్టయ్య, తౌహుస్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
పన్ను ఎగవేతదారులను వదలొద్దు
వాణిజ్య శాఖ అధికారులకు మంత్రి తలసాని స్పష్టీకరణ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి ట్రాన్స్‌పోర్టు కంపెనీలు, గోడౌన్లపై నిఘా పెంచండి డిప్యూటీ కమిషనర్లు కార్యక్షేత్రంలోకి దిగాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు స్పష్టం చేశారు. సక్రమంగా పన్నులు చెల్లించే వ్యాపారులకు సహకరిస్తూనే ఎగవేతదారులు, జీరో వ్యాపారం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడి జిల్లాల్లో సాగుతున్న అక్రమ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించి పన్నులు వసూలు చేయాలని సూచించారు. సోమవారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో మంత్రి తలసాని సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్‌తో పాటు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ పన్నుల వసూళ్ల పరిధిని పెంచాలని ఈ సందర్భంగా సూచించారు. ‘‘రోజుకు రూ.2 లక్షల టర్నోవర్‌తో వ్యాపారం చేస్తూ పన్ను చెల్లించని వారు గ్రేటర్ పరిధిలో కనీసం లక్ష మంది ఉన్నారు. అంటే రోజుకు రూ. 2 వేల కోట్లు. నెలకు రూ.60 వేల కోట్లు. వారిని మనం పన్నుల పరిధిలోకి తీసుకోలేదు. నాకున్న సమాచారం ప్రకారం 13 ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా ప్రతిరోజూ కోట్ల రూపాయల వస్తు సామగ్రి హైదరాబాద్‌కు దిగుమతి అవుతుంది. చెక్‌పోస్టుల వద్ద నామ్‌కే వాస్తేగా వే బిల్లులు, సీ బిల్లులు చూసి వారిచ్చే డబ్బులు పుచ్చుకొని వదిలేస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు గోడౌన్లను తనిఖీ చేస్తే దొంగ సరుకు ఎంతుంతో తెలుస్తుంది. కోట్ల రూపాయల బంగారం వ్యాపారం చేసేవారు బిల్లులు చూప రు. పాన్ మసాలా, గుట్కా అక్రమంగా నగరానికి వస్తోంది. చెన్నై, ముంబై, ఢిల్లీ, చైనా నుంచి స్టీల్, ఫర్నిచర్ దిగుమతి చేసుకుంటూ అతి తక్కువ పన్ను చెల్లిస్తున్నారు. రూ. కోట్లలో సిగరెట్ వ్యాపారం సాగుతుంటే దానికి చెల్లించే పన్నులు అతి తక్కువ. కిరాణా, డ్రైఫ్రూట్స్, చక్కెర, పప్పులు, మైదా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ స్పేర్‌పార్ట్స్, వాయినల్ ఫిల్మ్స్, ఫ్లెక్సీ బ్యానర్ రోల్స్ దేశ విదేశాల నుంచి నగరానికి తరలివస్తున్నాయి. కోట్లలో టర్నోవర్ సాగుతున్నా పన్నులు వేలల్లో కడుతున్నారు. ఏసీటీవో నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి వరకు కార్యక్షేత్రంలోకి దిగితే తప్ప పరిస్థితి చక్కబడదు’’ అని వాణిజ్య పన్నుల శాఖలో జరుగుతున్న అక్రమాలను మంత్రి పూసగుచ్చినట్లు వివరించారు. 15 కేటగిరీల్లో పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బంగారం మొదలు ఆన్లైన్ వ్యాపారం వరకు దే న్నీ వదలొద్దని ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలి రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద నిఘాను పెంచాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే అనుమతించేలా సాఫ్ట్వేర్ రూపొందించాల్సిన అవసరం ఉందని తలసాని అధికారులకు సూచించినట్లు సమాచారం. చెక్‌పోస్టుల అక్రమాలను నియంత్రించేందుకు ట్రాన్స్‌పోర్టు, పోలీస్, అటవీ శాఖల సహకారం తీసుకోవాలని, టోల్గేట్ల వద్ద రికార్డయిన డేటాతో వాణిజ్యశాఖ చెక్‌పోస్టు వద్ద నమోదైన డేటాతో పోల్చి చూసుకొని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాటు చేసుకుంటే అవకతవకలు తగ్గుతాయన్నారు. అవసరమైన చోట్ల కొత్త చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలుకు సంబంధించి వినియోగదారులు బిల్లులు తీసుకునేలా వినియోగదారుల కౌన్సిల్‌లను ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా, కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘నంది’ అవార్డు పేరు మార్చుతాం చలనచిత్ర రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందజేస్తున్న నంది అవార్డు పేరు మార్చి తెలంగాణ ప్రభుత్వం తరఫున కొత్త అవార్డును అందజేస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలి పారు. ముఖ్యమంత్రి వద్ద మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయని, పేరు ఖరారైన తర్వాత అవార్డు వివరాలు ప్రకటిస్తామన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి అండదండలు అందజేస్తుందన్నారు. టాలీవుడ్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చిత్ర పరిశ్రమ ప్రముఖులతో చర్చించి విధానాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. -
తనకు తానే పాటగా పల్లవించింది
యా కుందేందు తుషార హార ధవళా... యా శుభ్రవస్త్రాన్వితా... యా వీణా వరదండ మండిత కరా... యా శ్వేత పద్మాసనా.... ‘హ్యాపీడేస్’ సాంగ్. పాడింది ప్రణవి! శుద్ధబ్రహ్మ పరాత్పర రామా... కాలాత్మక పరమేశ్వర రామా... శేషతల్ప సుఖ నిద్రిత రామా...బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా... ‘శ్రీరామదాసు’ సాంగ్ పాడింది ప్రణవి! చాలు... నంది అవార్డు, ఇంకా అందిన అవార్డులు అన్నీ తర్వాత! శుభ్రగాత్రి, శుద్ధగాత్రి, మొత్తానికే ప్రణవి... ఓ దివ్యగాత్రి. ఇంత పవిత్రతని శ్రావ్యంగా పలికించిన, సరిగమలొలికించినఅమ్మానాన్నల ‘లాలిపాఠం’ గురించి కూడా తెలుసుకుంటేనే... ప్రణవి పాటను పూర్తిగా విన్నట్టు, స్వరమూర్తిని కొలిచినట్టు!! శ్రీరామదాసు సినిమా... ప్రేక్షకులు సినిమాలో లీనమై ఉండగా గోపన్న భార్య కమల ‘శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా...’ అంటూ భక్తిపారవశ్యంతో పాడుతుంది. తెరమీద స్నేహ ముఖంలో కనిపిస్తున్న భక్తితత్పరతకు దీటుగా పలుకుతోంది పాటలో గాయని స్వరం. పరిణతి చెందిన గాయనీమణి పాడినట్లుగా అనిపించిన ఆ లేత గొంతు ప్రణవిది. పాటే ప్రాణంగా పెరిగిన అమ్మాయి ప్రణవి. ఈ గాయనిని తీర్చిదిద్దడంలో తమకు ఎదురైన అనుభవాలను ఆమె తల్లిదండ్రులు రజని, విజయకుమార్ ఇలా చెప్పారు. ‘నేను వంట చేసుకుంటూ నేర్పిన పాటలే పిల్లలకు ‘స్వరాక్షరాల’య్యాయన్నారు రజని. ‘‘మా అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములందరికీ సంగీతం వచ్చు. పాటలు రాసి, వాటికి మ్యూజిక్ కంపోజ్ చేసి పాడుతాం. అలా... సంగీతం మా జీవితాల్లో ఒక భాగమైంది. అలాగే మా ముగ్గురమ్మాయిలకూ సంగీతం నేర్పించాం. అయితే పెద్దమ్మాయి గానాన్ని కెరీర్‌గా మలుచుకోలేదు, చిన్నమ్మాయి ఒక ఆల్బమ్‌లో పాడింది. పాటను కెరీర్‌గా తీసుకున్నది మాత్రం మధ్య అమ్మాయి ప్రణవి ఒక్కతే’’ అన్నారామె. పాటలో... పాత్రలో ఇమిడిపోతుంది! పాటను చిలుకపలుకుల్లా పలకకుండా స్వరాన్ని పాత్రకు, సన్నివేశానికి అనుగుణంగా పలికించే నేర్పు గురించి చెబుతూ ‘‘ప్రణవి బాల్యం ఎక్కువ భాగం కెమెరా ముందు, ఆడియో రికార్డింగ్ మైక్ ముందు గడిచింది, తాను చేయాల్సిన పనిని పూర్తిచేయడం అలవాటైంది. చుట్టూ ఎంత మంది ఉన్నా పరీక్ష రాసినట్లే ఇది కూడ’’ అంటారు ప్రణవి తండ్రి. ‘‘మాది కోనసీమ కొత్తలంకలో వ్యవసాయ కుటుంబం. పద్దెనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ వచ్చాను, మా బావగారింట్లో ఉండి చదువుకుని స్కూల్ టీచర్నయ్యాను. ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత నా ప్రవృత్తిని కొనసాగించడానికి రెక్కలు వచ్చినట్లు భావించాను. స్టేజీ నాటకాల్లో నటించాను. దూరదర్శన్‌లో క్యాజువల్ అనౌన్సర్‌గా చేశాను. టెలిస్కూల్కి స్క్రిప్టు రాశాను. ఎఫ్డిసి (ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) డాక్యుమెంటరీలు రాసి, నటించాను. ఒక నేషనల్యాడ్లో పిల్లలు ముగ్గురూ నటించారు. టెలిస్కూల్ ప్రోగ్రామ్‌లో ఒక ఎపిసోడ్లో కుటుంబమంతా నటించాం. అలా ప్రణవికి చిన్నప్పటి నుంచి పాత్రలో ఇమిడిపోవడం వచ్చేసింది’’ అన్నారు విజయ్‌కుమార్. పిల్లలకు తోడుగా! పిల్లలను విద్యేతర కార్యక్రమాలకు తీసుకెళ్లడం తల్లిదండ్రులకు అదనపు బాధ్యతే. కానీ తన విషయంలో అది కలిసొచ్చింది అంటారాయన. ‘‘తెలుగు టీచర్‌గా సాంస్కృతిక కార్యక్రమాలకు స్కూలు పిల్లలందరినీ తీసుకెళ్లే బాధ్యత నాదే. పదకొండు మంది పిల్లలను మద్రాసుకి తీసుకెళ్లి వాయిస్ టెస్ట్ చేయించాను కూడ. అలా నా పిల్లలను కూడ వాళ్లు ఆసక్తి చూపించిన అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనేటట్లు చూసేవాడిని. దాంతో ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులు కావాలన్నా, చైల్డ్ ఆర్టిస్టులకు డబ్బింగ్ సహకారం కావాలన్నా ముందు నాకే కబురు వచ్చేది. బాలరామాయణం సినిమాకి వందమంది పిల్లల చేత డబ్బింగ్ చెప్పించాను. గుహుడి భార్య పాత్రకి ప్రణవి చేత స్వరసహకారం ఇప్పించాను. ప్రణవి టెన్త్‌క్లాస్ నుంచి డబ్బింగ్ మీద సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఒకసారి దర్శకులు ఆదిత్య గారు ప్రణవి పాట పాడుతుందని తెలిసి కీరవాణిగారికి పరిచయం చేశారు. అలా శ్రీరామదాసు సినిమాకి పాడింది’’ అన్నారు విజయకుమార్. ఇంతలో రజని మాట్లాడుతూ ‘‘తొలిప్రయత్నంలోనే తన పాట ఓకే కావడంతో ప్రణవి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ సంగతి నాకొక్కదానికే చెప్పాలని నా వెంటే తిరిగింది. ఇంటినిండా బంధువులు ఉండడంతో ఆ పగలంతా నేను తనతో మాట్లాడటమే కుదర లేదు. రాత్రి పడుకునే ముందు నేను డైరీ రాస్తున్నప్పుడు వచ్చి నా ఒళ్లో తలపెట్టుకుని పడుకుని ‘కీరవాణి సార్ నా పాట ఓకే చేశారమ్మా’ అని చెబుతూ ‘ఈ హ్యాపీన్యూస్ మొదట నీకు ఒక్కదానికే చెప్పాలనుకుంటే నువ్వు నాతో మాట్లాడనే లేదు’ అంటూ బుంగమూతి పెట్టింది. తర్వాత ప్రణవి ఎన్ని పాటలు పాడినా, ఆఖరికి తను నంది అవార్డు అందుకున్నప్పటికీ నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సంఘటన మాత్రం అదే’’ అన్నారామె మెరుస్తున్న కళ్లతో. తండ్రిగా ఎక్కువ ఆనందపడిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ‘‘శాంతాబయోటెక్ వరప్రసాద్‌రెడ్డిగారు ప్రణవి పాడిన ‘శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా...’ పాటను కాలర్ ట్యూన్‌గా పెట్టుకున్నారు. ఇటీవల కలిసినప్పుడు ఆ ట్యూన్ వినిపించారు. ఆ సంతోషాన్ని మర్చిపోలేను’’ అన్నారు కుమార్. తండ్రిగా సూచన! గాయనిగా కెరీర్‌ను కొనసాగించే క్రమంలో ప్రణవికి ఇచ్చిన సలహాలు, సూచనల గురించి చెబుతూ... ‘‘స్టేజ్ షోలను ఒప్పుకోవద్దని చెప్పాను. రికార్డింగ్ స్టూడియోలో మైక్ ముందు పాడడానికి, స్టేజ్‌మీద ఓపెన్‌గా పాడడానికి చాలా తేడా. స్టేజి మీద గొంతు పెంచి పాడాలి. తరచూ ఇలా పాడితే గొంతు సున్నితత్వాన్ని కోల్పోతుంది. ఎక్కువకాలం పాడలేరు. అవకాశాలు వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలని తొందరపడితే దీర్ఘకాలం కొనసాగలేరు. జీవితానికి డబ్బు కావాలి, కానీ డబ్బే ప్రధానం కాదు అని కూడా చెబుతాను. సెలబ్రిటీ హోదా ఉన్నంత మాత్రాన విలాసవంతమైన జీవితాన్ని ఆశించరాదని పిల్లలందరికీ చెప్తుంటాం. పిల్లలకు సాధారణ జీవితానికి సంబంధించిన పునాది బలంగా ఉండాలనే ఆలోచనతోనే మేము గతంలో ఎలాంటి ఇళ్లలో జీవించామో ఇప్పుడూ అలాగే ఉన్నాం’’ అన్నారు విజయ్‌కుమార్. ఎల్లప్పుడూ సంతోషంగా..! వృత్తిపరమైన బాధ్యతలు, క్రమశిక్షణ విషయానికొస్తే... ‘‘పిల్లలు ముగ్గురూ ఎవరికి నచ్చిన ఫీల్డులో వారు నిమగ్నమైపోయారు. ప్రణవికి దయ, కరుణ ఎక్కువ. ఒకసారి రికార్డింగ్‌కి వెళ్తూ, దారిలో ఎవరికో యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసి 108కి ఫోన్ చేసి, వారిని హాస్పిటల్‌కి పంపించింది. దాంతో స్టూడియోకి ఆలస్యంగా వెళ్లి చివాట్లు వేయించుకుంది కూడ. అప్పుడు తనేమైనా చిన్నబుచ్చుకున్నదేమో సర్ది చెబుదాం అనుకునేలోపుగా తనే ‘వాళ్ల షెడ్యూల్‌కి ఇబ్బంది కలిగితే అనరా మరి’ అనేసింది’’ అంటూ... ఒక్కోరోజు తెల్లవారు జామున మూడింటి నుంచి అర్ధరాత్రి పన్నెండు వరకు కూడా పనిచేయాల్సి వస్తుంది. ఒక్కో వృత్తిలో ఒక్కోరకమైన ఒత్తిడి ఉంటుంది. దానికి సిద్ధం కావాలని చెప్తుంటాం. ముగ్గురు పిల్లల్లో తన ప్రత్యేకత ఏంటంటే... ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఎప్పుడైనా నేను కాస్త ముభావంగా కనిపిస్తే ‘ఎందుకమ్మా! అలా ఉన్నావు, ఎప్పుడూ సంతోషంగా ఉండాల’ంటుంది’’ అన్నారు రజని. పిల్లల కోసం చేసుకున్న రాజీలను గుర్తుచేసుకుంటూ... ‘‘నా వ్యాపకాలను తగ్గించుకున్నాను. రజని అయితే తనకు వీణ వచ్చన్న సంగతే మర్చిపోయినట్లుంది’’ అన్నారు విజయ్‌కుమార్. పిల్లల అల్లరిని తలచుకుంటూ ‘ఆడపిల్లలు, మా ఇంట్లో ఎన్నిరోజులుంటారు. ఎంత అల్లరి చేసినా ఈ వయసులోనే కదా’ అని నేను కేకలేసిందే లేదు, రజని కేకలేసినా నాకు నచ్చేది కాదు’ అంటున్నప్పుడు విజయకుమార్ ముఖంలో బాధ వ్యక్తమైంది. దేవుడు ఆడపిల్లలను ఇస్తే ఇలాంటి తండ్రికే ఇవ్వాలి అనిపించింది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి ప్రణవి కుటుంబం: అమ్మ: రజని. గృహిణి, కథారచయిత. నాన్న: విజయ్‌కుమార్. విశ్రాంత ఉపాధ్యాయులు. టీవీ, రంగస్థల, సినిమా నటులు. అక్క : వైష్ణవి... ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసింది, ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టులు చేస్తోంది, పర్యావరణం మీద ఆమె రాసిన వ్యాసాలు మలేసియా యూనివర్శిటీ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. చదువు, సోషల్ వర్క్ ఆమె ఇష్టాలు. చెల్లి : తేజస్వి... డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. ఇప్పుడు బెంగళూరులో ఎన్ఐసిసిలో ఫొటోగ్రఫీలో డిప్లమో కోర్సు చేస్తోంది. ప్రణవికి అందిన పురస్కారాలు: = 2012లో భరతముని అవార్డు (2007, 2008లలో కూడా) = 2011, 2009 లలో టిఎస్ఆర్ అవార్డు 2011, 2009లలో ఆలాపన అవార్డు =2010 లో నందిఅవార్డు (స్నేహగీతం సినిమాలో ‘సరిగమపదని’ పాటకు) =2008లో టీవీ నంది అవార్డు (తూర్పు వెళ్లే రైలు సీరియల్‌కి పాడిన ‘మొన్న ఎదురు చూశా’ పాటకి) =రాష్ట్రస్థాయి కర్ణాటక సంగీతం పోటీల్లో ప్రథమస్థానం (మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేతుల మీదుగా) = నవ్యనాటక సమితి నిర్వహించిన లలితగీతాల పోటీల్లో వరుసగా మూడేళ్లు విజేత =2009లో మాటీవీ సూపర్ సింగర్స్ బెస్ట్ మెంటర్ అవార్డు ‘ఛోటా చాలెంజర్స్’ =2005లో ఘంటసాల స్టేట్ అవార్డు (ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ చేతుల మీదుగా) =2005 లో గరుడ అవార్డు.