‘నంది’ బాధ్యత పెంచింది | Director Bheemagani Sudhakar About Nandi Award For Aditya Creative Genius Movie | Sakshi
Sakshi News home page

‘నంది’ బాధ్యత పెంచింది

Published Fri, Nov 17 2017 12:38 AM | Last Updated on Fri, Nov 17 2017 12:38 AM

Director Bheemagani Sudhakar About Nandi Award For Aditya Creative Genius Movie - Sakshi

భీమగాని సుధాకర్‌ గౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ‘ఆదిత్య.. క్రియేటివ్‌ జీనియస్‌’. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో 2014కి ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా సుధాకర్‌ గౌడ్‌ ఎంపికయ్యారు. ‘‘సాధారణంగా బాలల చిత్రాలకు అవార్డులు ఇస్తుంటారు. కానీ, బాలల చిత్రదర్శకుడిగా నాకు పురస్కారం దక్కడం మరింత ఆనందంగా ఉంది.

19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో పురస్కారం గెల్చుకున్న ఏకైక చిత్రం మాదే. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఇండీవుడ్‌ చిత్రోత్సవంలోనూ అవార్డు వచ్చింది. నంది అవార్డు నా బాధ్యతను పెంచింది. భవిష్యత్‌లో మరిన్ని బాలల చిత్రాలు తీస్తా’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement