నటిగా, టీవీ వ్యాఖ్యాతగా, నిర్మాతగా తెలుగు చలన చిత్రపరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. ఈ నెలలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డును గెలుచు కున్నారు. గతంలో కూడా ఆమె నంది అందుకున్నారు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో విడుదలైన ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో ప్రతినాయకురాలి పాత్రలో ఉత్తమ నటనను కనబరచినందుకు మంచు లక్ష్మికి తొలిసారి నంది అవార్డు వచ్చింది.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 2014లో విడుదలైన ‘చందమామ కథలు’ సినిమాలో లీసా స్మిత్ పాత్రలో ఆమె అద్భుతంగా నటించారని, ఏపీ ప్రభుత్వం ఆమెకు ఉత్తమ సహాయనటి విభాగంలో నంది అవార్డును అనౌన్స్ చేసింది. మంచి లక్ష్మికి అవార్డు రావడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ‘‘అవార్డు ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలుగు అమ్మాయిగా నాకెంతో గర్వంగా ఉంది’’ అన్నారు మంచు లక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment