స్క్రీన్‌ టెస్ట్‌ | Screen Test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Tue, Aug 29 2017 1:23 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

స్క్రీన్‌ టెస్ట్‌ - Sakshi

స్క్రీన్‌ టెస్ట్‌

► 2010లో ‘లీడర్‌’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన రానా 2006లో నంది అవార్డు అందుకున్నారు. ఆ అవార్డు ఎందుకు వచ్చిందో తెలుసా?
ఎ) విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రొడ్యూసర్‌ బి) విజువల్‌ ఎఫెక్ట్స్‌ స్పెషలిస్ట్‌ సి) విజువల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌ డి) విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌

► మురుగదాస్‌ డైరెక్షన్‌లో బొమ్మాళి అనుష్క స్పెషల్‌ అప్పియరన్స్‌ చేశారు. ఆ చిత్రంలో నటించిన హీరో ఎవరో తెలుసా..?
ఎ) విజయ్‌ బి) విజయ్‌కాంత్‌   సి) చిరంజీవి డి) సూర్య

► ఫ్రెండ్‌షిప్‌కి వేల్యూ ఇస్తూ ప్రభాస్‌ హిందీ చిత్రం ‘యాక్షన్‌ జాక్సన్‌’లో  గెస్ట్‌ అప్పియరన్స్‌ చేశారు. ఆ ఫ్రెండ్‌ ఎవరు?
ఎ) సోనాక్షీ సిన్హా‡   బి) ప్రభుదేవా సి) అజయ్‌ దేవగన్‌   డి) సల్మాన్‌ ఖాన్‌

► ‘ఠాగూర్‌’ (తమిళంలో ‘రమణ’) హిందీ రీమేక్‌ ‘గబ్బర్‌’ దర్శకుడు ఎవరు?
 ఎ) ఏ.ఆర్‌ మురుగదాస్‌ బి) క్రిష్‌ సి) శేఖర్‌ కమ్ముల డి) ఎన్‌.శంకర్‌

► మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌కు శిల్పా శిరోద్కర్‌ ఏమవుతారు?
ఎ) వదిన   బి) పిన్ని సి) చెల్లెలు   డి) అక్క

► ‘ఠాగూర్‌’లో ముందు చిరంజీవి హీరో కాదు. వేరే హీరో చేయాలనుకున్నారు. అతనెవరో తెలుసా?
ఎ) బాలకృష్ణ   బి) నాగార్జున సి) వెంకటేశ్‌ డి) రాజశేఖర్‌

► నందమూరి తారకరామారావు 1959లో చేసిన ‘దైవబలం’ చిత్రం ద్వారా ఒక నటుణ్ణి పరిచయం చేశారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలసి ఇరవై పై చిలుకు చిత్రాల్లో నటించారు. ఆ హీరో ఎవరు? చిన్న క్లూ: అతనికి ఫ్యామిలీ హీరో అనే పేరుంది.
ఎ) రామకృష్ణ     బి) కాంతారావు సి) హరనాథ్‌     డి) శోభన్‌బాబు

► 1991లో విడుదలైన ‘నిర్ణయం’లో ‘హలో గురు ప్రేమ కోసమేరోయ్‌ జీవితం....’ అంటూ హుషారెత్తించిన పాటకు ట్యూన్‌ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరు?
ఎ)ఇళయరాజా   బి) కేవీ మహదేవన్‌ సి) ఎమ్‌.ఎస్‌ విశ్వనాథన్‌ డి) చక్రవర్తి

► ‘బాయ్స్‌’లో ‘ఆలే...ఆలే...’ సాంగ్‌ టేకింగ్‌ సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. 62 స్టిల్‌ కెమెరాలతో ఒక కొత్త టెక్నాలజీతో దర్శకుడు శంకర్‌ ఆ పాట తీశారు. ఆ టెక్నాలజీ పేరు చెప్పగలరా..?
ఎ) స్టిల్‌ టెక్నాలజీ బి) మూమెంట్‌ టెక్నాలజీ    సి) ఫ్రీజ్‌ టెక్నాలజీ డి) క్యాప్చర్‌ టెక్నాలజీ

► యూఎస్‌లో కలెక్షన్స్‌ వైజ్‌గా సంచలనం సృష్టించిన హీరో నాని మొదటి సినిమా ఏది?
ఎ) ఎవడే సుబ్రమణ్యం బి) భలేభలే మగాడివోయ్‌ సి) జెంటిల్‌మెన్‌ డి) మజ్ను

► పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రంలో మలయాళీ భామ కీర్తీ సురేశ్‌ ఓ కథానాయిక. మరో కథానాయిక కూడా మలయాళీనే. ఆమె ఎవరు?
ఎ) మంజిమా మోహన్‌ బి) అనుపమా పరమేశ్వరన్‌ సి) అను ఇమ్మాన్యుయేల్‌ డి) సాయిపల్లవి

► ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో చిన్న ఎన్టీఆర్‌ ఓ కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించారు. ఆ స్టైల్‌ చేసిన హెయిర్‌ స్టైలిస్ట్‌ ఎవరో తెలుసా?
ఎ) జావేద్‌ హబీబ్‌బి) హకీమ్‌ అలీ     సి) అలీ డి) మహబూబ్‌

► ఈ కింది దర్శకుల్లో ఒక దర్శకుడు సెట్‌కు ప్రాధాన్యం ఉండేలా స్క్రిప్ట్‌ను తయారు చేసుకుంటారు. ఆ దర్శకుడు ఎవరై ఉంటారు?
ఎ) వీవీ వినాయక్‌ బి) శేఖర్‌ కమ్ముల సి) గుణశేఖర్‌ డి) సురేందర్‌ రెడ్డి

► మహేశ్‌బాబు ట్విట్టర్‌ ఐడీ కనుక్కోండి చూద్దాం.
ఎ) యువర్స్‌ ట్రూలీ మహేశ్‌ బి) ఐయామ్‌ మహేశ్‌ సి) యువర్స్‌ మహేశ్‌ డి) మీ మహేశ్‌

► మలయాళ ‘ప్రేమమ్‌’ నటి సాయిపల్లవికి మంచి మార్కులు తెచ్చిపెట్టింది. తెలుగు రీమేక్‌లో ఆ క్యారెక్టర్‌ చేసిన నటి ఎవరు?
ఎ) కాజల్‌ అగర్వాల్‌ బి) శ్రుతీహాసన్‌ సి) లావణ్యా త్రిపాఠి డి) కీర్తీ సురేశ్‌

► ‘అరటిపండు లంబా లంబా’ అంటూ ‘చంటబ్బాయి’ చిత్రంలో తన కవిత్వంతో హాస్యాన్ని పండించిన నటి ఎవరు?
ఎ) శ్రీలక్ష్మి      బి) రజిత సి) కోవై సరళ డి) జయలలిత

► అల్లు అర్జున్‌ సుకుమార్‌ కలసి సెక్యూరిటీ సిస్టమ్‌ మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి చేసిన షార్ట్‌ ఫిల్మ్‌ పేరు?
ఎ) ది బ్లైండ్‌ డేట్‌  బి) షేర్‌ ది స్పిరిట్‌ ఆఫ్‌ దివాలి సి) అతిథి డి) ఐయామ్‌ ది ఛేంజ్‌

► గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌’ సినిమాలో ‘నరికేస్తా.. నిలువునా నరికేస్తా..’ అంటూ మహేశ్‌బాబు రౌద్రం ప్రదర్శించిన ఫైట్‌ని డిజైన్‌ చేసిన ఫైట్‌మాస్టర్‌ ఎవరో తెలుసా?
ఎ) అణల్‌ అరసు బి) విజయన్‌ సి) రామ్‌–లక్ష్మణ్‌ డి) పీటర్‌ హెయిన్‌

► ఈ ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్న ఈ బుడతడు ఇప్పుడు లోక నాయకుడు... ఊహించేశారు కదూ!
ఎ) అజిత్‌   బి) సూర్య సి) కమల్‌హాసన్‌ డి) రజనీకాంత్‌

► ఎస్వీ రంగారావు పౌరాణిక గెటప్‌లో ఉన్న ఈ స్టిల్‌ ఏ సినిమాలోది?
ఎ) ఇంద్రజిత్‌   బి) మాయాబజార్‌ సి) భూకైలాస్‌    డి) పాతాళ భైరవి

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే...మీకు సినిమా అంటే ఇష్టం    
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...  మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!


సమాధానాలు
1) ఎ 2) సి 3) బి 4) బి5) డి 6) డి 7) డి 8) ఎ 9) సి 10) బి 11) సి 12) బి 13) సి 14) ఎ 15) బి 16) ఎ17) డి 18) బి 19) సి 20) ఎ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement