శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా నటించిన చిత్రం 'లీడర్'. ఆ చిత్రంతోనే 2010వ సంవత్సరంలో రానా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. శేఖర్ కమ్ముల మార్క్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఆ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల్లోనే ఓ మంచి క్లాసిక్ అని చెప్పొచ్చు.
'లీడర్' కథని చాలా మంది హీరోలకి శేఖర్ కమ్ముల వినిపించినట్టు అప్పట్లో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ హీరోలు కథలో కొన్ని మార్పులు చేయాలని కోరడంతో చివరికి రానాతో ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రానాకి 'లీడర్' మొదటి సినిమా అంటే ఎవ్వరూ నమ్మరేమో అనేలా అతను అంత మెచ్యూర్డ్‌గా నటించి అందరినీ మెప్పించాడు. ఇక రానా తప్ప ఆ పాత్రకి మరెవ్వరూ న్యాయం చేయలేరనేలా అర్జున్ ప్రసాద్ పాత్రలో జీవించాడు. అయితే ఇదిలా ఉండగా 'లీడర్' చిత్రానికి సీక్వెల్ ఉంటుందని 'అరణ్య' 'లవ్ స్టోరీ' సినిమాల రిలీజ్ సమయంలో శేఖర్ కమ్ముల తెలిపిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా 'భీమ్లా నాయక్' ప్రమోషన్లలో భాగంగా దీని గురించి ఆ చిత్ర హీరో రానా స్పందించాడు. "శేఖర్ కమ్ముల 'లీడర్' సీక్వెల్ గురించి నాకు రెండు మూడు సీన్లు చెబుతుంటారు మళ్ళీ సైలెంట్ అయిపోతుంటారు. అది పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది" అంటూ రానా బదులిచ్చాడు. ఇక దీని బట్టి చూస్తే.. 'లీడర్' సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే శేఖర్ కమ్ముల మొదలు పెట్టేశాడని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment