రానా ‘లీడర్ -2’ చేస్తున్నారా? | Rana doing a 'Leader -2' ? | Sakshi
Sakshi News home page

రానా ‘లీడర్ -2’ చేస్తున్నారా?

Jul 31 2015 12:33 AM | Updated on Aug 11 2019 12:52 PM

రానా ‘లీడర్ -2’ చేస్తున్నారా? - Sakshi

రానా ‘లీడర్ -2’ చేస్తున్నారా?

రానా తొలి చిత్రం ‘లీడర్’. అందులో యువ ముఖ్యమంత్రిగా రానా కనబడిన తీరు, పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది.

రానా తొలి చిత్రం ‘లీడర్’. అందులో యువ ముఖ్యమంత్రిగా రానా కనబడిన తీరు, పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నారాయన. ఈ మధ్య విడుదలైన ‘బాహుబలి’లో భల్లాలదేవగా రానా ఆహార్యం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి.
 
 ప్రస్తుతం తమిళంలో ‘బెంగళూరు డేస్’ రీమేక్‌లో నటిస్తున్న రానా చేతిలో మరిన్ని చిత్రాలు ఉన్నాయి. ఆ సంగతలా ఉంచితే... ‘లీడర్’కి కొనసాగింపుగా ‘లీడర్ 2’ చేయాలనుకుంటున్నారు రానా. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని రానా తెలిపారు. మరి.. తొలి భాగానికి దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ములే దీనికి కూడా దర్శకత్వం వహిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement