
2014 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులలో లెజెండ్ సినిమా ఎక్కువ అవార్డులు సాధించటంపై హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. లెజెండ్ సినిమాకు ఉత్తమ చిత్రంతో పాటు హీరో, దర్శకుడు, విలన్, మాటల రచయిత, ఎడిటర్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఫైట్ మాస్టర్ కేటగిరీల్లో నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్యతో తనతో పాటు 2015, 16 సంవత్సరాలకు నంది అవార్డులు అందుకోనున్న నటీనటులు సాంకేతికనిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజకీయ అంశాలపై కూడా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ, చెరువున్ని జలకళ సంతరించుకోవటం ఆనందంగా ఉందన్నారు. వర్షాలు బాగా కురవటంతో చెరువులన్ని నిండాయని తెలిపారు. ఫిబ్రవరి 24,25 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment