నంది అవార్డులు తీసుకోలేదు.. పంచుకున్నారని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. నంది అవార్డులు తీసుకున్నపుడు గొడవ చేశామన్నారు కదా.. ఆ నంది అవార్డు కమిటీలు వేసింది కూడా మీరే(చంద్రబాబు నాయుడు)కదా అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. తమరు పంచిన నంది అవార్డులు తీసుకున్న వారు ఈ విషయంపై ఎందుకు స్పందించరని అడిగారు. ఆడవాళ్ల అందాలతో సినిమా తీసేవాళ్లు తమరి పక్కనే ఉన్నారు కదా వారెందుకు హోదా కోసం పోరాడరు అని ప్రశ్నించారు. తాము ఏసీల్లో కులుకుతున్నామా..? మీరే (టీడీపీ నాయకులనుద్దేశించి) లంచాలు తిని ఏసీల్లో కులుకుతున్నారని ధ్వజమెత్తారు.