
జయసుధ, కోడి రామకృష్ణ అధ్యక్షతన కమిటీలు
విజయవాడ: ఏపీ నంది, టీవీ అవార్డుల ఎంపికకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీలు ఏర్పాటుచేసింది. 2012,2013 సంవత్సరాలకు కమిటీలు ప్రకటించింది. 2012 నంది సినిమా అవార్డులకు గాను ప్రముఖ నటి జయసుధను చైర్‌పర్సన్‌గా నియమించగా ఇందులో సభ్యులుగా గుణ్ణం గంగరాజు, మహర్షి రాఘవ, ఢిల్లీ రాజేశ్వరి, నందితారెడ్డి, చంటి అడ్డాల సహా 13మందితో కమిటీ వేశారు.
అలాగే 2012 టీవీ అవార్డుల కోసం జీవీ నారాయణ నేతృత్వంలో 13మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే 2013 సినిమా, టీవీ అవార్డుల ఎంపిక కోసం కూడా కమిటీ వేశారు. 2013 నంది సినిమా అవార్డుల కోసం వేసిన కమిటీ చైర్మన్ గా కోడి రామకష్ణ వ్యవహరించనుండగా శివపార్వతీ, రవిబాబు, శేఖర్ కమ్ముల, చంద్ర సిద్ధార్థ సహా 13 మంది ఈ కమిటీలో పని చేయనున్నారు. అలాగే, 2013 టీవీ అవార్డుల ఎంపిక కోసం కవిత చైర్మన్ గా 13మంది సభ్యులతో కమిటీ వేశారు.