
'నంది అవార్డుల పేరు మారుస్తాం'
హైదరాబాద్: నంది అవార్డుల పేరు మారుస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. అందుకు సంబంధించి సీఎం కేసీఆర్ పరిశీలనలో మూడు పేర్లు ఉన్నాయని వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చిత్ర పరిశ్రమలో అనేక సంఘాలు, గ్రూపులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. సోమవారం సచివాలయంలో తలసాని శ్రీనివాసయాదవ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ ఆరు నెలల పాలన తర్వాత వ్యాపారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు.
అయితే బంగారం, వెండి ఆభరణాల వ్యాపారులు పూర్తిస్థాయిలో ట్యాక్స్ చెల్లించడం లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నగరంలో బంగారు దుకాణాలు అధికంగా ఉన్న అబిడ్స్, ప్యాట్నీ, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లోని బంగారు వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని వ్యాపార సంస్థలు వినియోగదారుడికి బిల్లులు ఇవ్వకుండా తక్కువ టర్నోవర్ చూపించి రాష్ట్ర ఖజానాకు ట్యాక్స్ కట్టడం లేదన్నారు.
ఇదే తరహాలో కొబ్బరి, రబ్బరు వ్యాపారులు కూడా ఇదే దారిలో పయనిస్తున్నారని చెప్పారు. పాన్ మసాలా రాష్ట్రంలో నిషేధించినప్పటికీ... ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు జరుగుతున్నాయిని ఆయన ఆరోపించారు. వ్యాపారుస్తులంతా పన్నుల సక్రమంగా పన్నులు కట్టేలా చర్యలు చేపడతామని ఆయన వివరించారు.