
సాక్షి, విశాఖపట్టణం : నంది అవార్డుల విషయంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికార మదంతో, అహంభావంతో మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనర్హులకు అవార్డులు ఇవ్వడంపై ప్రశ్నిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్ కార్డు అడుగుతారా? అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్ కార్డులు ఉన్న వారినే జ్యూరీలోకి తీసుకున్నారా? అంటూ ప్రశ్నించారు. మంత్రి పదవిలో ఉన్న లోకేశ్ బాధ్యతారాహిత్యంతో మాట్లాడటం గర్హనీయమన్నారు.
ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పంచభూతాలను ప్రభుత్వ నేతలు దోచుకు తింటున్నారని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యవహారంలో ముఖ్యమంత్రి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజులు దోచుకుతింటున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి భోగాపురం ఎయిర్‌పోర్టుపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment