ఆర్ నారాయణ మూర్తి(పాత చిత్రం)
హైదరాబాద్ : ‘అన్నదాత సుఖీభవ’ సినిమాలో జీఎస్టీపై డైలాగులు తొలగించాలని సెన్సార్‌బోర్డు సభ్యులు ఆదేశించడం పట్ల దర్శక నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై సినిమా తీస్తే సెన్సార్ బోర్డు వాళ్లు కొన్ని ముఖ్యమైన సీన్లు తొలగించాలని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించినట్టు ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా తాను సినిమాలు తీస్తున్నానని చెప్పారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా సినిమాలు తీయడం లేదని, ప్రజా సమస్యలపై మాత్రమే సినిమాలు తీస్తున్నానని అన్నారు.
సెన్సార్ బోర్డు వారు తన సినిమాలోని... ‘బడా పారిశ్రామిక వేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు గానీ, రైతు అప్పుకట్టకపోతే పీడిస్తారు’ అనే ప్రధానమైన సీన్‌ను తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఇదే తన సినిమాకి సోల్ అని చెప్పారు. అందుకే తన సినిమాకు సెన్సార్ చేయలేదని, తాను రివైవింగ్ కమిటీకి వెళ్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment