Censor Board cut
-
‘లవ్ ఆజ్ కల్ 2’కు సెన్సార్ షాక్!
సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్, యువ నటుడు కార్తీక్ ఆర్యన్లు నటిస్తున్న ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రానికి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ చిత్రంలో పలు సన్నివేశాలపై సెన్సార్ బోర్డు షరతులు విధించింది. ఈ చిత్రంలో పెద్ద సంఖ్యలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని వాటిని తీసివేయాల్సిందిగా డైరెక్టర్‌కు సూచించింది. అలాగే హీరో, హీరోయిన్ సంభాషణల్లో కొన్ని అసభ్యకర పదాలు ఉన్నాయని.. ఆ మాటలను బీప్ చేయాలని చెప్పింది. అలాగే సారా, కార్తీక్‌ల మధ్య ఉన్న కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి.. మరికొన్నింటి నిడివిని తగ్గించింది. అదే విధంగా సినిమా ఫస్టాఫ్‌లో వచ్చే సారా, కార్తీక్‌ల ముద్దు సీన్‌ను కట్ చేయడంతోపాటు కొన్ని సీన్లను బ్లర్ చేసింది. మరోవైపు ప్రేమికుల రోజున(ఫిబ్రవరి 14) విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2009లో సైఫ్ అలీఖాన్, దీపికా నటించిన ‘లవ్ ఆజ్ కల్’కు ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఇంతియాజ్ అలీనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చదవండి : కార్తిక్‌తో ఆ సీన్లో నటించాలని ఉంది: నటి కూతురు ‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’ -
ఆ సీన్స్ తీసేయమంటున్నారు
హైదరాబాద్ : ‘అన్నదాత సుఖీభవ’ సినిమాలో జీఎస్టీపై డైలాగులు తొలగించాలని సెన్సార్‌బోర్డు సభ్యులు ఆదేశించడం పట్ల దర్శక నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై సినిమా తీస్తే సెన్సార్ బోర్డు వాళ్లు కొన్ని ముఖ్యమైన సీన్లు తొలగించాలని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించినట్టు ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా తాను సినిమాలు తీస్తున్నానని చెప్పారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా సినిమాలు తీయడం లేదని, ప్రజా సమస్యలపై మాత్రమే సినిమాలు తీస్తున్నానని అన్నారు. సెన్సార్ బోర్డు వారు తన సినిమాలోని... ‘బడా పారిశ్రామిక వేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు గానీ, రైతు అప్పుకట్టకపోతే పీడిస్తారు’ అనే ప్రధానమైన సీన్‌ను తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఇదే తన సినిమాకి సోల్ అని చెప్పారు. అందుకే తన సినిమాకు సెన్సార్ చేయలేదని, తాను రివైవింగ్ కమిటీకి వెళ్తున్నట్లు చెప్పారు. -
విశాల్, క్యాథరిన్ లిప్‌లాక్‌కు కత్తెర
నటుడు విశాల్ నటి క్యాథరిన్ ట్రెసాల లిప్‌లాక్ కిస్‌లకు సెన్సార్ కత్తెర వేసింది. విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కథాకళి. మెడ్రాస్ చిత్రం ఫేమ్ క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. రెజీనా కస్సాంద్ర, నాజర్, కరుణాస్, సూరి, శ్రీజిత్ రవి, లక్ష్మి రామక్రిష్ణన్ పోషించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీత బాణీలు అందించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సంక్రాంతికి బరిలోకి దూకడానికి సిద్ధమవుతున్న కథాకళి చిత్రాన్ని సెన్సార్‌కు పంపనున్నారు. ఈచిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ దృశ్యాలు చోటు చేసుకున్నాయట. ఆ సన్నివేశాలను ముందుగానే ట్రైలర్లో జోడించి సెన్సార్‌కు పంపగా అక్కడ సెన్సార్ సభ్యులు ఆ సన్నివేశాలను నిర్దాక్షణ్యంగా కట్ చేసి విశాల్ క్యాథరిన్ ట్రెసాల చుంబనాలకు దగ్గరయ్యే వరకూ సన్నివేశాలు ఉంచి మిగతావి కట్ చేసి ట్రైలర్‌ను చేతిలో పెట్టారట. దాన్నే ప్రచారం చేస్తున్న చిత్ర యూనిట్ ఇప్పుడు మెయిన్ చిత్రంలో అలాంటి సన్నివేశాలు లేకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారని సమాచారం. లవ్,కామెడీ, యాక్షన్, అంటూ పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన చిత్రం కథాకళి అంటున్నారు చిత్రవర్గాలు.