పుప్పాల శ్రీనివాస్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు  | Lifetime Achievement Award to Puppala Srinivas | Sakshi
Sakshi News home page

పుప్పాల శ్రీనివాస్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు 

Published Sun, Feb 26 2023 2:38 AM | Last Updated on Sun, Feb 26 2023 4:25 PM

Lifetime Achievement Award to Puppala Srinivas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదాల ని­యం­త్ర­ణ కోసం విస్తృతమైన సేవలందిస్తున్న రహదారి భద్రతా నిపుణుడు, డిప్యూ­­టీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ లభించింది. శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓహెచ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఫౌండేషన్‌ 7వ వార్షికో­త్సవం సందర్భంగా ఆరోగ్యం, భద్రత, పర్యావరణం, సుస్థిరత అంశాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా రహదారి భద్రతపై విస్తృతంగా పని చేయడంతో పాటు, పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని రోడ్డు భద్రతపై పరిశోధన పత్రాలను అందజేసినందుకుగాను పుప్పాల శ్రీనివాస్‌కు ఈ పురస్కారం దక్కింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో పుప్పాల చేస్తున్న సేవలు అభినందనీయమని, దేశంలో రహదారిభద్రతా ఉద్యమానికి ఎంతో దోహదం చేశాయని ఈ సందర్భంగా ప్రశంసించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement