![Minister Harish Rao Warns Health Director Srinivas - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/21/Harish-Rao-Warns-Health-Director-Srinivas.jpg.webp?itok=ECqxUEwK)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్‌గా పని చేస్తున్న గడల శ్రీనివాస్‌కు మంత్రి హరీష్‌రావు క్లాస్ పీకారు. ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో రాజకీయ ప్రకటనలు చేస్తూ హడావుడి చేస్తున్న శ్రీనివాస్‌ను హరీష్ సుతిమెత్తగా హెచ్చరించారు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు ఫోన్ చేసిన హరీష్.. రాజకీయ ప్రకటనలు మానుకోవాలంటూ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారిగా ఉన్నశ్రీనివాస్ వరుసగా రాజకీయ ప్రకటనలు చేయడంతో హరీష్‌రావు ఎట్టకేలకు రంగప్రవేశం చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో శ్రీనివాస్‌ను హరీష్ హెచ్చరించారు. కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్న శ్రీనివాస్‌కు హరీష్‌రావు ఇలా ఫోన్ చేసి చెప్పడం స్వీట్ వార్నింగ్ లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment