
నేడు సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం
ముఖ్య అతిథిగా బర్ఖాదత్
- ‘తెలుగు శిఖరం’గా డాక్టర్ దాసరి నారాయణరావు
- కైకాల సత్యనారాయణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: సమాజంలోని వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందజేసిన ప్రముఖులకు ప్రతి ఏటా అందజేసే ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఫిల్మ్‌నగర్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ప్రముఖ టెలివిజన్ జర్నలిస్టు, రచయిత్రి బర్ఖాదత్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అడిషనల్ డీజీపీ అంజనీ కుమార్, రెయిన్‌బో హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్–మెటర్నల్ అండ్ ఫెటల్ మెడిసిన్ డాక్టర్ ప్రణతీరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వినోద్ అగర్వాల్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, జలమండలి ఎండీ దానకిశోర్, పర్యాటక శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలేంద్రకుమార్ జోషి, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ బోయపాటి శ్రీను, సాగర్ తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
తెలుగు శిఖరం దాసరి
కన్నులపండువగా జరగనున్న ఈ వేడుకల్లో తెలుగు సినీ దిగ్గజం, డాక్టర్ దాసరి నారాయణరావుకు ‘తెలుగు శిఖరం’ అవార్డును అందజేయనున్నారు. అలా గే ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకోనున్నా రు. సామాజిక సేవ, సాహిత్య, సాంస్కృతిక రంగాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, క్రీడలు, సినిమా తదితర రంగాల్లో ఉత్తమ సేవలందజేసిన వ్యక్తులు, సంస్థలు, నటీనటులు, క్రీడాకారులకు ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులను అందజేయనున్నారు. గత రెండేళ్లుగా సాక్షి ఆయా రంగాలకు చెందిన వారి సేవలను గుర్తించి, విజేతలను ఎంపిక చేసి అవార్డులను అంద జేస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయ నిపుణుల బృం దం విజే తల ఎంపికలో ప్రతిష్టాత్మకంగా వ్యవహ రించింది. ఆయా రంగా ల్లో వారు అందజేస్తున్న సేవలు, సాధించిన విజయాలు, సమాజ పురోగమనంలో వారి ప్రభావం వంటి అంశా లను ప్రామాణికంగా తీసుకుని అవార్డులకు ఎంపిక చేశారు.