బల్బీర్ సింగ్‌కు జీవిత సాఫల్య పురస్కారం
న్యూఢిల్లీ: తొలిసారిగా ప్రవేశపెట్టిన హాకీ ఇండియా అవార్డుల్లో బల్బీర్ సింగ్ సీనియర్‌కు మేజర్ ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం అందించారు. శనివారం ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. 90 ఏళ్ల బల్బీర్‌కు ట్రోఫీతో పాటు రూ. 30 లక్షల నగదును అందించారు. 1948 నుంచి 56 వరకు జరిగిన ఒలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన హాకీ జట్టులో బల్బీర్ సభ్యుడు. 1956 ఒలింపిక్స్ ఫైనల్లో ఆయన చేసిన ఐదు గోల్స్ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.
అలాగే పురుషుల విభాగంలో ఉత్తమ ఆటగాడిగా బీరేంద్ర లక్రా.. మహిళల్లో వందనా కటారియా అవార్డులను గెలుచుకున్నారు. వీరికి రూ.25 లక్షల చొప్పున నగదును అందించారు. పీఆర్ శ్రీజేష్ (ఉత్తమ గోల్‌కీపర్), దీపికా (ఉత్తమ డిఫెండర్), మన్‌ప్రీత్‌సింగ్ (ఉత్తమ మిడ్‌ఫీల్డర్), ఆకాశ్‌దీప్‌సింగ్ (ఉత్త మ ఫార్వర్డ్) తదితరులు అవార్డులు గెలుచుకున్న వారిలో ఉన్నారు.