
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఆగష్టు 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతో పాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు నేపథ్యంలో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నట్లు పేర్కొంది.
అవార్డు గ్రహీతల వయస్సు, వారి ఆరోగ్యం.. అదే విధంగా వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని వాయిదా వేశామని, వచ్చే అక్టోబరు లేదా నవంబరు నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
చదవండి: Huzurabad Bypoll: టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment