
భారత బ్యాంకర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్
దుబాయ్ : దోహా బ్యాంక్ సీఈఓ ఆర్. సీతారామన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ లభించింది. బ్యాంకింగ్ రంగంలో ఈ భారతీయ బ్యాంకర్ చేసిన సేవలు, మధ్య ప్రాచ్యం ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఆయన తన సేవల ద్వారా అందించిన తోడ్పాటుకు ఈ అవార్డ్ లభించింది. ఇక్కడ ఇటీవల జరిగిన ద బ్యాంకర్ మిడిల్ ఈస్ట్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2015 కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డ్‌ను ప్రదానం చేశారు.