YSR Lifetime Achievement Awards 2021: Ceremony Program Updates - Sakshi
Sakshi News home page

నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్సార్‌: సీఎం జగన్‌

Published Mon, Nov 1 2021 7:14 AM | Last Updated on Mon, Nov 1 2021 4:45 PM

YSR Lifetime Achievement Awards 2021 Ceremony Program Updates - Sakshi

సాక్షి, అమరావతి: నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్‌ అని.. అలాంటి వ్యక్తి వైఎస్సార్‌ పేరుమీద అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కులం, మతం, రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డుల ఎంపిక జరిగిందన్నారు. విజయవాడలోని ఏ–కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వైఎస్‌ విజయమ్మ హాజరయ్యారు.

ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో  సీఎం మాట్లాడుతూ, కేవలం సేవలను పరిగణనలోకి తీసుకుని అవార్డులకు ఎంపిక చేశామన్నారు. సామాన్యులుగా ఉండే అసమాన్యుల ప్రతిభకు పట్టం కట్టామన్నారు. కళలు, సంస్కృతికి అవార్డుల్లో పెద్దపీట వేశామన్నారు. రైతులు, రచయితలు, జర్నలిస్టులు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను ఎంపిక చేశామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలుగుజాతికి శుభాకాంక్షలు. సామాన్యులుగా ఉన్న అసామాన్యుల మధ్య సమయం గడపడం నా అదృష్టం. కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని పలు సూచనలు వచ్చాయి. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్‌ ప్రదానోత్సవం నిర్వహిస్తున్నాం. నిండైన పంచెకట్టుతో వైఎస్సార్‌ ప్రజల గుండెల్లో నిలిచారు. వైఎస్సార్‌ ఆకాశమంత ఎత్తు ఎదిగిన మహా మనీషి’’ అని సీఎం కొనియాడారు.

ప్రతి సంవత్సరం నవంబర్‌ 1న వైఎస్సార్‌ అవార్డులు ప్రదానం చేస్తామని సీఎం వెల్లడించారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేస్తామన్నారు. అచీవ్‌మెంట్‌ అవార్డు పొందిన వారికి రూ.5 లక్షలు కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేయనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి: గవర్నర్‌
వైఎస్సార్‌ వైద్య వృతి చేసినా.. వ్యవసాయం, విద్యారంగాలకు విశేష కృషి చేశారని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ అన్నారు. ‘‘ఏపీ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్‌ గొప్ప వ్యక్తిగా నిలిచారు. వైఎస్సార్‌కు విద్య, వైద్యం, అంటే ఎంతో మక్కువ. పేదల నాడి తెలిసిన డాక్టర్‌ వైఎస్సార్‌.. వారి కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందించి ప్రజల హృదయాలను గెలిచారని’’ గవర్నర్‌ అన్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవన్నారు. వ్యవసాయం, ఆక్వా, ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానం ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌లోనూ ఏపీ క్రియాశీలకంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్నాథుడుని ప్రార్థిస్తున్నానని గవర్నర్‌ అన్నారు. వైఎస్సార్‌ అవార్డులు అందుకున్నవారికి ఆయన అభినందనలు తెలిపారు.

ట్రస్టులు
1. ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ ట్రస్ట్‌ – కాకినాడ(తూర్పుగోదావరి) 
2. సీపీ బ్రౌన్‌ లైబ్రరీ – వైఎస్సార్‌ జిల్లా 
3. సారస్వత నికేతన్‌ లైబ్రరీ – వేటపాలెం(ప్రకాశం) 
4. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ – పుట్టపర్తి(అనంతపురం) 
5. ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌ – వైఎస్సార్‌ జిల్లా 
6. రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌(ఆర్‌డీటీ) – అనంతపురం 
7. గౌతమి రీజనల్‌ లైబ్రరీ – తూర్పుగోదావరి 
8. మహారాజా గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ – విజయనగరం 

రైతులు 
9. స్వర్గీయ పల్లా వెంకన్న  – కడియం(తూర్పుగోదావరి) 
10. మాతోట ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ – శ్రీకాకుళం 
11. ఎంసీ రామకృష్ణారెడ్డి     – అనంతపురం 
12. కొట్యాడ శ్రీనివాసరావు – విజయనగరం 
13. విఘ్నేశ్వర ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ – కృష్ణా జిల్లా 
14. ఎం.బలరామి రెడ్డి – వైఎస్సార్‌ జిల్లా 
15. ఎస్‌.రాఘవేంద్ర – చిత్తూరు 
16. సెగ్గె కొండలరావు – విశాఖపట్నం 
17. ఆంధ్ర కశ్మీర్‌ ట్రైబల్‌ ఫ్మారింగ్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ – విశాఖపట్నం 
18. వల్లూరు రవికుమార్‌     – కృష్ణా జిల్లా 
19. శివ అభిరామిరెడ్డి – నెల్లూరు జిల్లా 

కళలు–సంస్కృతి 
20. పొందూరు ఖద్దర్‌(ఆంధ్రాపైన్‌ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం) – శ్రీకాకుళం 
21. స్వర్గీయ వంగపండు ప్రసాదరావు(జానపద గేయం) – విజయనగరం 
22. అచ్యుత నారాయణ(బొబ్బిలి వీణ కేంద్రం) – విజయనగరం 
23. పొన్నాల రామసుబ్బారెడ్డి(రంగస్థలం) – నెల్లూరు 
24. వినాయక నాట్యమండలి(సురభి నాటకం) – వైఎస్సార్‌ జిల్లా 
25. సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం(కూచిపూడి నాట్యం) – కృష్ణా 
26. దాలవాయి చలపతిరావు(తోలు బొమ్మలాట) – అనంతపురం 
27. కిల్లు జానకమ్మ(థింసా నృత్య బృందం) – విశాఖ 
28. సవర రాజు(సవర పెయింటింగ్స్‌) – శ్రీకాకుళం 
29. మజ్జి శ్రీనివాసరావు(వీధి నాటకం) – విశాఖపట్నం 
30. ధర్మాడి సత్యం(డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) – తూర్పుగోదావరి 
31. సర్వారాయ హరికథ పాఠశాల (మహిళలు) – తూర్పుగోదావరి 
32. మిరియాల అప్పారావు(బుర్రకథ) – పశ్చిమగోదావరి 
33. కూరెళ్ల వెంకటాచారి(కొండపల్లి బొమ్మలు) – కృష్ణా 
34. గోచిపాత గాలేబు(డప్పు కళాకారుడు) – కృష్ణా     
35. జి.రమణయ్య(వెంకటగిరి జాంధానీ చీరలు) – నెల్లూరు 
36. శివప్రసాద రెడ్డి(కళంకారీ పెయింటింగ్స్‌) – కర్నూలు 
37. బాలాజీ ఉడ్‌ కార్వింగ్‌ ఆర్టిజన్స్‌ సొసైటీ – చిత్తూరు 
38. డా.వి.సత్యనారాయణ(నాదస్వరం) – చిత్తూరు 
39. పూసపాటి పరమేశ్వర్‌రాజు(కాలిగ్రఫీ) – విజయనగరం 

సాహిత్యం 
40. స్వర్గీయ కాళీపట్నం రామారావు(కారా మాస్టర్‌) – శ్రీకాకుళం 
41. కత్తి పద్మారావు – గుంటూరు 
42. రాచపాలెం చంద్రశేఖర్‌ రెడ్డి – వైఎస్సార్‌ జిల్లా 
43. బండి నారాయణ స్వామి – అనంతపురం 
44. కేతు విశ్వనాథరెడ్డి – వైఎస్సార్‌ జిల్లా 
45. కొలకలూరి ఇనాక్‌ – గుంటూరు 
46. లలితా కుమారి(ఓల్గా) – గుంటూరు 

జర్నలిజం 
47. ఏబీకే ప్రసాద్‌ – కృష్ణా 
48. స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు 
49. స్వర్గీయ ఖాజా హుస్సేన్‌ (దేవీప్రియ) – గుంటూరు 
50. స్వర్గీయ కె.అమరనాథ్‌ – పశ్చిమగోదావరి 
51. సురేంద్ర (కార్టునిస్ట్‌) – వైఎస్సార్‌ జిల్లా 
52. ఇమామ్‌ – అనంతపురం 

వైద్య–ఆరోగ్య విభాగం 
53. డాక్టర్‌ నీతి చంద్ర(ఊపిరితిత్తుల వ్యాధుల ప్రొఫెసర్‌) – నెల్లూరు 
54. డాక్టర్‌ కె.కృష్ణ కిషోర్‌(ఈఎన్‌టీ ప్రొఫెసర్‌) – తూర్పుగోదావరి 
55. లక్ష్మి(స్టాఫ్‌ నర్స్‌) – విజయవాడ 
56. కె.జోతిర్మయి(స్టాఫ్‌ నర్స్‌) – అననంతపురం 
57. తురబిల్లి తేజస్వి(స్టాఫ్‌ నర్స్‌) – విశాఖపట్నం 
58. ఎం.యోబు(మేల్‌ నర్స్‌) – వైఎస్సార్‌ జిల్లా 
59. ఆర్తి హోమ్స్‌ – వైఎస్సార్‌ జిల్లా   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement