కపిల్‌కు ‘జీవితకాల సాఫల్య’ పురస్కారం | Kapil Dev wins Lifetime Achievement award in UK | Sakshi
Sakshi News home page

కపిల్‌కు ‘జీవితకాల సాఫల్య’ పురస్కారం

Published Fri, Sep 26 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

కపిల్‌కు ‘జీవితకాల సాఫల్య’ పురస్కారం

కపిల్‌కు ‘జీవితకాల సాఫల్య’ పురస్కారం

లండన్: భారత బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్‌కు ‘జీవితకాల సాఫల్య పురస్కారం’ అవార్డు లభించింది. ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) నెలకొల్పిన ఈ అవార్డును బుధవారం రాత్రి హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. క్రికెట్‌కు చేసిన సేవలతో పాటు నిరాశ్రయులకు చేయూతనిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. ‘మన దేశాన్ని వాళ్లు పాలించారు కాబట్టి ఒకప్పుడు ఇంగ్లండ్ అంటే నాకు ఇష్టముండేదికాదు. అయితే వాళ్లు బాగా ఆడకపోయినా మనకు క్రికెట్‌ను అందించారు. కాబట్టి ప్రస్తుతం ఆ భావన లేదు’ అని కపిల్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement