Indian bowling
-
'బౌలింగ్‌లో దమ్ము లేకపోయేది.. హెల్మెట్ లేకుండానే ఆడేవారు'
టి20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు మరో రెండు వారాల సమయం ఉంది. కాస్త సమయం ఉన్నప్పటికి ఇప్పటినుంచే అభిమానులు పదునైన మాటలతో కత్తులు దూసుకుంటున్నారు. ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే ఎంత హైవోల్టేజ్ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా చిరకాల ప్రత్యర్థుల మధ్య అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా మ్యాచ్ జరగనుంది. తాజాగా భారత్, పాక్ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో భారత్ పేస్ బౌలింగ్ వీక్‌గా ఉండడంతో పాక్ ఓపెనర్లు హెల్మెట్లు లేకుండానే బరిలోకి దిగేవారంటూ పేర్కొన్నాడు. సల్మాన్ భట్ మాట్లాడుతూ.. 'సయీద్ అన్వర్, అమీర్ సోహైల్‌లు ఆడుతున్న సమయంలో టీమిండియా పేస్ బౌలింగ్ వీక్‌గా ఉండేది. అందుకే వాళ్లు హెల్మెట్లు లేకుండానే బరిలోకి దిగేవారు. తలకు క్యాప్‌ను పెట్టుకుని టీమిండియా బౌలర్లను ఉతికారేసేవారు'' అంటూ చెప్పుకొచ్చాడు. 2013లో భారత్, పాక్‌ల మధ్య చివరిసారి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆ తర్వాత రాజకీయ కారణాలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో మ్యాచ్‌లకు ఆస్కారం లేకుండా పోయింది. అప్పటినుంచి కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే టీమిండియా, పాకిస్తాన్‌లు తలపడుతూ వస్తున్నాయి. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ భారత్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఇటీవలే ఆసియాకప్‌లో తలపడగా.. టీమిండియా పాక్‌పై బదులు తీర్చుకుంది. మళ్లీ నెల వ్యవధిలోనే ఇరుజట్లు పొట్టి ప్రపంచకప్‌లో మరోసారి తలపడనున్నాయి. మరి ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఇక సల్మాన్ భట్ పాకిస్తాన్ తరపున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టి20లు ఆడాడు. 2010లో తోటి క్రికెటర్లు మహ్మద్ ఆమిర్, మహ్మద్ ఆసిఫ్‌లతో కలిసి సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడం అతని కెరీర్‌ను అంధకారంలో పడేసింది.ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో సల్మాన్ భట్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించింది. 2015లో నిషేధం నుంచి బయటపడ్డ సల్మాన్ భట్ అప్పటినుంచి దేశవాలీ టోర్నీలో ఆడాడు. ఆ తర్వాత మే 2022లో సింగపూర్ క్రికెట్ టీమ్‌కు కన్సల్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. చదవండి: ఉమ్రాన్ మాలిక్‌కు వీసా కష్టాలు..ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇబ్బందులు క్రికెట్లో అరుదైన ఘటన.. నోరెళ్లబెట్టడం ఖాయం! -
మంచి బౌలర్లను తీర్చి దిద్దాలి: కెప్టెన్ ధోని
మెల్బోర్న్: భారత బౌలింగ్ గొప్పగా లేకపోవడం సమస్యగా మారిందని కెప్టెన్ ధోని అన్నాడు. ఇకపై టెస్టులు, పరిమిత ఓవర్లకు వేర్వేరుగా బౌలర్లను గుర్తించి తీర్చిదిద్దాల్సిన అవసరం వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ‘గత మ్యాచ్‌లో నేను అవుట్ కాగానే జట్టు కుప్పకూలింది. అలా కాకూడదనే ఆరంభంలో భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడాను. నాకే ఇబ్బంది అవుతున్న చోట జూనియర్లకు మరింత సమస్య అయ్యేది. మరో 10-15 మ్యాచ్‌ల వరకు అవకాశం ఇచ్చే విధంగా మనీశ్ పాండే ఆడాడు. పరిస్థితులకు తగినట్లుగా అతని బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. ఈ ఇన్నింగ్స్ అతనికే ఒక పాఠంలాంటిది. తొలి మ్యాచ్‌లోనే చాలా బాగా ఆడిన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రత్యేకంగా ప్రశంసించాలి. అయితే టి20ల కోసం మన ఫీల్డింగ్ మరింత మెరుగు పడాల్సి ఉంది’ అని అన్నాడు. తన రిటైర్మెంట్ గురించి అడుగుతున్నవారు ‘పిల్’ వేసి చూడాలని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు. 1 ఆసీస్ గడ్డపై ఒక జట్టు 300పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియాను ఓడించడం ఇదే మొదటిసారి. 1 ఐదు అంతకంటే తక్కువ వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు (3159), అత్యధిక సెంచరీలు (11) ఇదే సిరీస్‌లో నమోదు కావడం విశేషం. 12 భారత్ తరఫున వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న 12వ ప్లేయర్ రోహిత్‌శర్మ. 210 వన్డేల్లో భారత్ తరఫున ఆడిన 210వ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా -
మళ్లీ జారవిడిచారు!
మెల్‌బోర్న్‌లోనూ అదే ఆట... గత మ్యాచ్‌లకు రీప్లే ప్రదర్శన... హాడిన్పై షార్ట్ బంతి ప్రయోగిస్తే వికటించింది... అసలు బ్యాటింగ్ చేయగలడా అనుకున్న 9వ నంబర్ ఆటగాడు కూడా అర్ధ సెంచరీ సాధించేశాడు. స్వయంగా వికెట్ ఇచ్చుకుంటే తప్ప స్మిత్‌పై ఎలాంటి ఎత్తుగడ పని చేయలేదు. టెస్టుల్లో కెప్టెన్‌గా తన బలహీనతను మరోసారి ప్రదర్శించిన ధోని, ప్రత్యర్థిని ఎలా కట్టడి చేయాలో తెలీక చేతులెత్తేశాడు. మైదానం మారినా మన బౌలింగ్, వ్యూహాలు మారలేదు. ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ మరోసారి చెలరేగింది. 50 వేలకు పైగా ప్రేక్షకుల ప్రోత్సాహం, సహచరుల అండతో నాయకుడు జట్టును ముందుండి నడిపించాడు. కంగారూల స్కోరు 500 దాటితే... భారత ప్రధాన బౌలర్లు నలుగురు ‘సెంచరీ’ మార్క్‌ను అందుకున్నారు. తొలి 5 వికెట్లకు ఆసీస్ 216 పరుగులు చేస్తే, మన బౌలర్ల సహకారంతో తర్వాతి 5 వికెట్లకు 314 పరుగులు చేసింది. కొండంత స్కోరు ముందుండగా భారత్ నెమ్మదిగా అడుగులు వేసింది. విజయ్ మళ్లీ తన నిలకడ ప్రదర్శిస్తే, ధావన్ తనకు అలవాటైన రీతిలో నిష్ర్కమించాడు. ఇప్పుడు మన జట్టుకు కావాల్సింది ఆసీస్ రెండో రోజు ఆట స్ఫూర్తి. ఎలాంటి స్థితిలోనూ తొణకకుండా ప్రత్యర్థి చూపిన పట్టుదలతో మూడో రోజు ఎంసీజీలో టీమిండియా బ్యాట్స్‌మెన్ సత్తా చాటుతారా? లేక సాగిలపడతారా? చూడాలి. తీరు మారని భారత బౌలింగ్ ⇒ చెలరేగిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ⇒ తొలి ఇన్నింగ్స్‌లో 530 ఆలౌట్ ⇒ స్మిత్ భారీ సెంచరీ, రాణించిన హారిస్ ⇒ భారత్ 108/1 మెల్బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారత జట్టు.. ప్రత్యర్థి భారీ స్కోరు ముందు ఎదురీదుతోంది. ఇక్కడి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. మురళీ విజయ్ (102 బంతుల్లో 55 బ్యాటింగ్; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (25 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. హారిస్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ (28) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్ ప్రస్తుతం మరో 422 పరుగులు వెనుకబడి ఉంది. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాజల్‌వుడ్ బౌలింగ్‌లో పుజారా ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కీపర్ హాడిన్ వదిలేయకపోతే భారత్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 530 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (305 బంతుల్లో 192; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా, ర్యాన్ హారిస్ (88 బంతుల్లో 74; 8 ఫోర్లు, 1 సిక్స్), బ్రాడ్ హాడిన్ (84 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. స్మిత్... హాడిన్‌తో ఆరో వికెట్‌కు 110 పరుగులు, హారిస్‌తో ఎనిమిదో వికెట్‌కు 106 పరుగులు జత చేశాడు. తొలి రోజు మందకొడిగా ఆడిన ఆసీస్ రెండో రోజు మాత్రం ధాటిని ప్రదర్శించింది. భారత పేలవ బౌలింగ్‌ను పూర్తిగా ఉపయోగించుకున్న ఆ జట్టు 5.18 రన్‌రేట్‌తో 52.3 ఓవర్లలోనే 271 పరుగులు జోడించడం విశేషం. షమీ అయితే పూర్తిగా గతి తప్పాడు. మిగతా ముగ్గురు బౌలర్లు కలిసి 29 ఫోర్లు ఇస్తే, అతనొక్కడే 23 బౌండరీలు ఇచ్చాడు. షమీ 4 వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో 3 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (సి) ధోని (బి) షమీ 57; వార్నర్ (సి) ధావన్ (బి) ఉమేశ్ 0; వాట్సన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 52; స్మిత్ (బి) ఉమేశ్ 192; మార్ష్ (సి) ధోని (బి) షమీ 32; బర్న్స్ (సి) ధోని (బి) ఉమేశ్ 13; హాడిన్ (సి) ధోని (బి) షమీ 55; జాన్సన్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 28; హారిస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 74; లయోన్ (బి) షమీ 11; హాజల్‌వుడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (142.3 ఓవర్లలో ఆలౌట్) 530 వికెట్ల పతనం: 1-0; 2-115; 3-115; 4-184; 5-216; 6-326; 7-376; 8-482; 9-530; 10-530. బౌలింగ్: ఇషాంత్ 32-7-104-0; ఉమేశ్ 32.3-3-130-3; షమీ 29-4-138-4; అశ్విన్ 44-9-134-3; విజయ్ 5-0-14-0. భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (బ్యాటింగ్) 55; ధావన్ (సి) స్మిత్ (బి) హారిస్ 28; పుజారా (బ్యాటింగ్) 25; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (37 ఓవర్లలో వికెట్ నష్టానికి) 108 వికెట్ల పతనం: 1-55. బౌలింగ్: జాన్సన్ 9-3-24-0; హారిస్ 7-3-19-1; హాజల్‌వుడ్ 9-4-19-0; వాట్సన్ 4-0-14-0; లయోన్ 8-0-32-0. ⇒ కెప్టెన్‌గా తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీ చేసిన ఐదో ఆటగాడు స్మిత్. ఆస్ట్రేలియా తరఫున తొలి క్రికెటర్. 2007-08లో హేడెన్ తర్వాత వరుసగా మూడు సెంచరీలు చేసిన ఆసీస్ ఆటగాడు కూడా స్మిత్ కావడం విశేషం. ⇒ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక స్టంపింగ్‌లు (134) చేసిన ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. సంగక్కర (133)ను అతను అధిగమించాడు. అలాగే టెస్టుల్లో 38 స్టంపింగ్‌లతో భారత్ తరఫున కిర్మాణీ (38)తో సమంగా నిలిచాడు. ⇒ నలుగురు భారత బౌలర్లు ఒకే ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగులు ఇవ్వడం 2014లో ఇది నాలుగోసారి. ఈ ఏడాది టీమిండియా తరఫున వేర్వేరు మ్యాచ్‌ల్లో ఏకంగా 26 సార్లు ఇలా పరుగులిచ్చారు. గతంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో ఏ జట్టు కూడా 18 సార్లకు మించి సమర్పించలేదు. భారీగా పరుగులు ఇచ్చుకోవడం నిరాశకు గురి చేసింది. ఈ వికెట్‌పై పరుగులకు మంచి అవకాశముంది కాబట్టి మేమూ భారీ స్కోరు చేస్తాం. మాకు ఆరంభం లభించింది కూడా. హాడిన్ షార్ట్ బంతులు ఆడలేడనే అలా బౌలింగ్ చేశాం. స్మిత్అలాంటి ఫామ్‌లో ఉన్నప్పుడు ప్రత్యర్థికి కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ రెండు రోజులు నా బౌలింగ్‌తో సంతృప్తి చెందా -అశ్విన్, భారత స్పిన్నర్ మా జట్టు భారీ స్కోరు చేయడం సంతోషంగా ఉంది. క్రీజ్‌లో అన్ని నాకు అనుకూలంగా జరిగాయి. మా చివరి వరుస బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించాడు. దీనికి భారత్ వద్ద సమాధానం లేకపోయింది. డబుల్ సెంచరీ కోల్పోవడం పట్ల నిరాశగా లేను. వేగంగా పరుగులు చేసి డిక్లేర్ చేయాలనుకున్నా. చివర్లో మరిన్ని వికెట్లు తీసి ఉంటే ఇంకా బాగుండేది. అయితే మూడు రోజు ఆరంభంలో ఆ పని చేయగలం -స్టీవెన్ స్మిత్, ఆసీస్ కెప్టెన్ సెషన్-1: ఆస్ట్రేలియా దూకుడు ఓవర్‌నైట్ స్కోరు 259/5తో ఆసీస్ ఆట ప్రారంభించింది. హాడిన్ షార్ట్ బంతుల బలహీనత తెలిసిన భారత బౌలర్లు పదే పదే అవే బంతులు వేశారు. అయితే ఇది సత్ఫలితం ఇవ్వలేదు. షమీ వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు బాది హాడిన్ జవాబిచ్చాడు. ఇదే క్రమంలో 75 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. గత 15 ఇన్నింగ్స్‌లలో అతనికి ఇదే తొలి అర్ధ సెంచరీ. మరోవైపు 191 బంతుల్లో స్మిత్ ఈ సిరీస్‌లో వరుసగా మూడో శతకాన్ని సాధించాడు. హాడిన్ అవుటయ్యాక వచ్చిన జాన్సన్ కూడా ఉమేశ్, షమీ బౌలింగ్‌లలో వరుసగా రెండేసి ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన అతను స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఓవర్లు: 25, పరుగులు: 130, వికెట్లు: 2 సెషన్-2: అదే జోరు లంచ్ తర్వాత కూడా స్మిత్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. అనూహ్యంగా హారిస్ నుంచి కూడా భారత బౌలర్లకు ప్రతిఘటన ఎదురైంది. అశ్విన్ వేసిన ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి అతనూ ఆధిక్యం ప్రదర్శించాడు. చివరకు అశ్విన్ బౌలింగ్‌లోనే భారీ సిక్సర్ కొట్టిన అనంతరం తర్వాతి బంతికి అవుటయ్యాడు. 273 బంతుల్లో 150 పరుగులు అందుకున్న స్మిత్ డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోయాడు. అయితే ఇదే జోరులో ఉమేశ్ బౌలింగ్‌లో ర్యాంప్ షాట్ ఆడబోయి వికెట్లు వదిలేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్లు: 27.3, పరుగులు: 141, వికెట్లు: 3 సెషన్-3: ఆకట్టుకున్న విజయ్ ఫామ్‌లో ఉన్న మురళీ విజయ్ మరోసారి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ఆరంభించగా, ధావన్ కాస్త తడబడ్డాడు. ఆసీస్ బౌలర్లు కూడా చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. వాట్సన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి కాస్త దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేసిన ధావన్, హారిస్ వేసిన తర్వాతి ఓవర్లోనే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. మరోవైపు విజయ్ మాత్రం చక్కటి ఆటతీరు కనబర్చాడు. సంయమనం కోల్పోకుండా ఆడిన అతను 93 బంతుల్లో ఈ సిరీస్‌లో మూడో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాడిన్ చలవతో బతికిపోయిన పుజారా కూడా ఆ తర్వాత మరో అవకాశం ఇవ్వలేదు. ఓవర్లు: 37, పరుగులు: 108, వికెట్లు: 1 -
కపిల్‌కు ‘జీవితకాల సాఫల్య’ పురస్కారం
లండన్: భారత బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్‌కు ‘జీవితకాల సాఫల్య పురస్కారం’ అవార్డు లభించింది. ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) నెలకొల్పిన ఈ అవార్డును బుధవారం రాత్రి హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. క్రికెట్‌కు చేసిన సేవలతో పాటు నిరాశ్రయులకు చేయూతనిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. ‘మన దేశాన్ని వాళ్లు పాలించారు కాబట్టి ఒకప్పుడు ఇంగ్లండ్ అంటే నాకు ఇష్టముండేదికాదు. అయితే వాళ్లు బాగా ఆడకపోయినా మనకు క్రికెట్‌ను అందించారు. కాబట్టి ప్రస్తుతం ఆ భావన లేదు’ అని కపిల్ వ్యాఖ్యానించారు. -
పమాదపు ‘గంట’ మోగింది!
రెండో రోజూ భారత్ శ్రమ నిష్ఫలం ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 569/7 డిక్లేర్డ్ ►బెల్ భారీ సెంచరీ, రాణించిన బట్లర్ ►భారత్ 25/1 వరుసగా రెండో రోజూ అదే వరుస... పేలవ బౌలింగ్‌కు తోడు పట్టు లేని ఫీల్డింగ్ వెరసి సౌతాంప్టన్ టెస్టులో భారత్ కష్టాలు పెరిగాయి. అలవోకగా పరుగులు సాధించిన ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసి సురక్షిత స్థితికి చేరుకుంది. సీనియర్ ఆటగాడు బెల్ భారీ స్కోరుకు... బట్లర్ వన్డే తరహా దూకుడు జత కలిసి ఇంగ్లండ్‌ను ముందంజలో నిలిపాయి. ఇక మూడో రోజు భారత్ బ్యాటింగ్ ఏ మాత్రం నిలబడుతుందనే దానిపైనే మూడో టెస్టు ఫలితం ఆధారపడి ఉంది. సౌతాంప్టన్: ఇంగ్లండ్ బ్యాటింగ్ జోరు ముందు భారత బౌలింగ్ మరోసారి తలవంచింది. ఇయాన్ బెల్ (256 బంతుల్లో 167; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), బట్లర్ (83 బంతుల్లో 85; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ప్రదర్శనతో మూడో టెస్టులో కుక్ సేన భారీ స్కోరు సాధించింది. ఇక్కడి రోజ్ బౌల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్ల నష్టానికి 569 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బ్యాలెన్స్ (288 బంతుల్లో 156; 24 ఫోర్లు) కూడా ఓవర్‌నైట్ స్కోరుకు మరిన్ని పరుగులు జత చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. ధావన్ (6) విఫలమయ్యాడు. విజయ్ (11 బ్యాటింగ్), పుజారా (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. కొనసాగిన జోరు... ఓవర్‌నైట్ స్కోరు 247/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ మొదటి సెషన్లో ధాటిగా ఆడింది. భారత బౌలింగ్‌లో పస లేకపోవడంతో బ్యాలెన్స్, బెల్ అలవోకగా పరుగులు సాధించారు. ఆరంభంలోనే ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి బ్యాలెన్స్ భువనేశ్వర్ లయను దెబ్బ తీశాడు. 99 బంతుల్లో బెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే బ్యాలెన్స్ 278 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. రెగ్యులర్ బౌలర్లు విఫలమైన చోట రోహిత్ శర్మ మెరిశాడు. లంచ్‌కు ముందు బ్యాలెన్స్‌ను కీపర్ క్యాచ్ ద్వారా అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అయితే రీప్లేలో బంతి, బ్యాట్‌కు తాకలేదని తెలిసింది. గత కొన్ని మ్యాచ్‌లుగా విఫలమవుతున్న ఇయాన్ బెల్ ఈసారి చెలరేగిపోయాడు. క్రీజ్‌లో కుదురుకున్నాక భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా జడేజా బౌలింగ్‌ను చితక్కొట్టాడు. అతను వేసిన ఒకే ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 20 పరుగులు రాబట్టాడు. అదే ఓవర్ రెండో బంతికి భారీ సిక్స్‌తో 179 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత కెప్టెన్ ధోని ఎన్ని మార్పులు, ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) ధోని (బి) జడేజా 95; రాబ్సన్ (సి) జడేజా (బి) షమీ 26; బ్యాలెన్స్ (సి) ధోని (బి) రోహిత్ 156; బెల్ (సి) పంకజ్ (బి) భువనేశ్వర్ 167; రూట్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 3; మొయిన్ అలీ (సి) రహానే (బి) భువనేశ్వర్ 12; బట్లర్ (బి) జడేజా 85; వోక్స్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (163.4 ఓవర్లలో 7 వికెట్లకు) 569 డిక్లేర్డ్ వికెట్ల పతనం: 1-55; 2-213; 3-355; 4-378; 5-420; 6-526; 7-569. బౌలింగ్: భువనేశ్వర్ 37-10-101-3; షమీ 33-4-123-1; పంకజ్ సింగ్ 37-8-146-0; రోహిత్ శర్మ 9-0-26-1; రవీంద్ర జడేజా 45.4-10-153-2; శిఖర్ ధావన్ 2-0-4-0. భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (బ్యాటింగ్) 11; ధావన్ (సి) కుక్ (బి) అండర్సన్ 6; పుజారా (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (14 ఓవర్లలో వికెట్ నష్టానికి) 25 వికెట్ల పతనం: 1-17. బౌలింగ్: అండర్సన్ 7-3-14-1; బ్రాడ్ 4-2-4-0; జోర్డాన్ 2-1-3-0; వోక్స్ 1-1-0-0.