అమెరికాలోని భారతీయ తెలుగు కమ్యూనిటీ వ్యాపార ప్రముఖులలో ఒకరైన 'అట్లూరి'కి ఇండియా స్టార్టప్ ఫెస్ట్-2023 (ఐఎస్ఎఫ్ 2023) ఈవెంట్‌లో 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు' లభించింది.
దశాబ్దాలుగా వ్యాపార ఆలోచనలతో అనేక ఔత్సాహిక స్టార్టప్ ఆలోచనలకు వేదికగా పనిచేసిన CXO ఫోరమ్ రూపశిల్పిగా ఉన్నందుకు ఈ అవార్డును అందుకున్నట్లు సమాచారం. స్టార్టప్‌లలో చాలా మంది ఒకే విధమైన ఆలోచనను కలిగి ఉంటారు. కానీ కొత్త సాంకేతికతలు, మార్కెట్ పోకడలను అవలంబించడం ద్వారా వారు అభివృద్ధి చెందాలని అట్లూరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో శివకుమార్ సూరంపూడి (ఐటీసీ లిమిటెడ్‌లోని అగ్రి & ఐటీ బిజినెస్ గ్రూప్ హెడ్), డా.డి నాగేశ్వర్ రెడ్డి (ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ & ఏఐజీ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ & చీఫ్), వినీత్ రాయ్ (ఆవిష్కార్ గ్రూప్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్) డా.గల్లా రామచంద్ర నాయుడు (అమర రాజా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్), డా.పి రాజ మోహన్ రావు (యునైటెడ్ టెలికామ్స్ గ్రూప్ చైర్మన్) మొదలైన వారికి కూడా అవార్డులు అందించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment