
హ్యాపీ బర్త్ డే- 28-05-15
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కోటి (సంగీత దర్శకుడు),
కైలీ మినోగ్ (ప్రముఖ గాయని, నటి)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. వీరు ఈ సంవత్సరమంతా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అభివృద్ధి పథంలో పయనిస్తారు. ఊహించని ఆహ్వానాలు, సన్మానాలు, గుర్తింపు లభిస్తాయి. సంఘంలో వీరి మాట బాగా చెల్లుబాటు అవుతుంది. విద్యార్థులకు మంచి కాలం. గతంలో చేసిన రచనలు ఇప్పుడు వెలుగు చూస్తాయి.
వాటికి పేరు వస్తుంది. ఉద్యోగులకు ప్రాధాన్యత గల స్థానాలకు బదిలీ అవుతంంది. రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి. న్యాయవాదులకు చేతినిండా పని దొరుకుతుంది. మంచి ఆదాయం కళ్లజూస్తారు. అయితే అనుకున్న పనులన్నీ అవుతున్నందువల్ల గర్వంతో కూడిన మిడిసిపాటు పడతారు. ఫలితంగా అపనిందలు, అవహేళనలు ఎదుర్కొనవలసి రావచ్చు. అందువల్ల మాటలలో, చేతలలో సంయమనం పాటించాలి. ఆచితూచి వ్యవహరించాలి.
లక్కీ నంబర్లు: 1, 5, 9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రీన్, గోల్డెన్; లక్కీ డేస్: బుధ, గురు, ఆదివారాలు. సూచనలు: పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం, తోబుట్టువులను... ముఖ్యంగా పెళ్లికాని సోదరీమణులను ఆదరించడం, సరస్వతిని, సాయినాథుని, దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు