Kylie Minogue
-
ప్రభాస్‌తో హాలీవుడ్ పాప్ గాయని
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమా స్థాయిని అంతకంతకూ పెంచేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే బడ్జెట్ పరంగా యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా ఈ సినిమా ఇండియాలో తెరకెక్కిన అత్యంత భారీ చిత్రాల సరసన నిలిచింది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం హాలీవుడ్ బ్యూటీని తీసుకువస్తున్నారట సాహో టీం. పాప్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బ్రిటీష్ భామ కైలీ మినోగ్.. సాహోలో స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. 2009లో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘బ్లూ’ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన కైలీ పదేళ్ల తరువాత మరోసారి ఇండియన్ సినిమాకు ఓకె చెప్పటం విశేషం. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సింగర్ కు చేదు అనుభవం
లాస్ ఏంజిల్స్ : ఆస్ట్రేలియాకు చెందిన పాప్ సింగర్ కైలీ మినోగ్ కు ఓ కార్యక్రమం సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. ఆమె తన కొత్త ఆల్బమ్ వీడియో 'అబ్ సోల్యూట్లీ ఎనీథింగ్ అండ్ ఎనీథింగ్ ఎట్ ఆల్' ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కైలీ పాల్గొన్నది. ఈ ఈవెంట్ కు వచ్చిన ఆమె వైట్-బ్లాక్ కలర్ కలిసి ఉన్న ఓ డ్రస్ ఆమె ధరించారు. అయితే ఇందులో భాగంగా ఆమె స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగా కైలీ డ్రెస్ టాప్ భాగం కొంత తొలగిపోయింది. పూర్తిగా డ్యాన్స్‌లో లీనమైన సింగర్ వెంటనే ఈ విషయాన్ని గ్రహించిన ఆమె టాప్ ను సరిచేసుకుంది. చేతులతో ఛాతీ భాగాన్ని కప్పివేసి త్వరగా డ్రెస్ పైభాగంలో ఉన్న జిప్ సవరించుకోవడంతో అవమానాన్ని త్రుటిలో తప్పించుకుంది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో ఆమె ఆశ్చార్యానికి లోనయింది. ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు ఆమె నవ్వుతూనే ఉంది, కెమెరా వైపు చూస్తూ ఇక ఆపండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న కొందరూ తీస్తున్న వీడియోలో ఈ సన్నివేశం కూడా రికార్డయింది. అనంతరం ఇన్ స్టాగ్రామ్‌లో ఈ వీడియో ఎవరో ఆకతాయి అప్ లోడ్ చేయడంతో ఈ విషయం స్థానిక మీడియాలో హల్ చల్ చేసింది. -
హ్యాపీ బర్త్ డే- 28-05-15
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కోటి (సంగీత దర్శకుడు), కైలీ మినోగ్ (ప్రముఖ గాయని, నటి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. వీరు ఈ సంవత్సరమంతా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అభివృద్ధి పథంలో పయనిస్తారు. ఊహించని ఆహ్వానాలు, సన్మానాలు, గుర్తింపు లభిస్తాయి. సంఘంలో వీరి మాట బాగా చెల్లుబాటు అవుతుంది. విద్యార్థులకు మంచి కాలం. గతంలో చేసిన రచనలు ఇప్పుడు వెలుగు చూస్తాయి. వాటికి పేరు వస్తుంది. ఉద్యోగులకు ప్రాధాన్యత గల స్థానాలకు బదిలీ అవుతంంది. రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి. న్యాయవాదులకు చేతినిండా పని దొరుకుతుంది. మంచి ఆదాయం కళ్లజూస్తారు. అయితే అనుకున్న పనులన్నీ అవుతున్నందువల్ల గర్వంతో కూడిన మిడిసిపాటు పడతారు. ఫలితంగా అపనిందలు, అవహేళనలు ఎదుర్కొనవలసి రావచ్చు. అందువల్ల మాటలలో, చేతలలో సంయమనం పాటించాలి. ఆచితూచి వ్యవహరించాలి. లక్కీ నంబర్లు: 1, 5, 9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రీన్, గోల్డెన్; లక్కీ డేస్: బుధ, గురు, ఆదివారాలు. సూచనలు: పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం, తోబుట్టువులను... ముఖ్యంగా పెళ్లికాని సోదరీమణులను ఆదరించడం, సరస్వతిని, సాయినాథుని, దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు