
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమా స్థాయిని అంతకంతకూ పెంచేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే బడ్జెట్ పరంగా యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా ఈ సినిమా ఇండియాలో తెరకెక్కిన అత్యంత భారీ చిత్రాల సరసన నిలిచింది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం హాలీవుడ్ బ్యూటీని తీసుకువస్తున్నారట సాహో టీం.
పాప్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బ్రిటీష్ భామ కైలీ మినోగ్.. సాహోలో స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. 2009లో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘బ్లూ’ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన కైలీ పదేళ్ల తరువాత మరోసారి ఇండియన్ సినిమాకు ఓకె చెప్పటం విశేషం. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment