కోఠి ప్రసూతి ఆస్పత్రిపై హైకోర్టు ఆగ్రహం | high court serious on koti maternity hospital | Sakshi
Sakshi News home page

కోఠి ప్రసూతి ఆస్పత్రిపై హైకోర్టు ఆగ్రహం

Published Tue, Jun 14 2016 5:54 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

high court serious on koti maternity hospital

హైదరాబాద్: కోఠి ప్రసూతి ఆస్పత్రి పరిస్థితులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రిలోని అసౌకర్యాలపై సుమోటోగా ఫిర్యాదు స్వీకరించిన న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఆస్పత్రిలో అపరిశుభ్ర వాతావరణం, అరకొర వసతులు, నిర్వహణ లోపం రోగులకు తీవ్ర ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంది. అక్కడి పరిస్థితులపై మూడు వారాల్లోగా సవివర నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ ఇద్దరు మహిళా న్యాయవాదులతో కమిటీని ఏర్పాటు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement