Maternity Hospital
-
మనసు నిండుగా.. మురి'పాల' పండుగ
సృష్టిలో అమ్మ స్థానం అత్యున్నతం. అమ్మ గొప్పతనం వర్ణనాతీతం.. అమ్మ త్యాగం అనన్యసామాన్యం.. పురిటి నొప్పులను సైతం పంటి బిగువున భరిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ప్రాణం పెట్టేస్తుంది. అందుకే అమ్మను మించిన దైవం ఉండదు అంటారు. అయితే కొంతమంది తల్లులు అనివార్యకారణాలతో శిశువుకు ముర్రెపాలు అందించలేక తల్లడిల్లిపోతున్నారు. అలాంటి సమయంలో బిడ్డ ఆకలి తీర్చడమే కాకుండా రోగనిరోధకశక్తిని పెంచే తల్లిపాలను అందించేందుకు కొందరు అమ్మలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అమ్మతనానికి మరింత వన్నె తీసుకువస్తున్నారు. ఈ ప్రక్రియకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు.తిరుపతి తుడా : తల్లి పాలు అవసరం ఉన్న నవజాత శిశువులకు అవసరమైన పాలను మదర్ మిల్క్ బ్యాంకు అందిస్తుంది. అమ్మపాలు శిశువు ఎదుగుదలకు, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో కీలకం, తల్లి పాల ప్రాధాన్యత తెలియకపోవడంతో కొందరు పిల్లలకు పాలిస్తే తమ శరీర ఆకృతి పాడైపోతుందని ఆవు, గేదె పాలను, మిల్క్ పౌడర్‌ను బాటిల్స్‌తో పట్టిస్తుంటారు. మరికొందరు బాలింతల విషయంలో శిశువుకు తగినంత పాలు లేకపోవడం, తల్లి అనారోగ్యం కారణంగా పాల వృద్ధి క్షీణిస్తుంది. ఇటువంటి వారికోసం మదర్ మిల్క్ కేంద్రం ఓ వరంగా పనిచేస్తోంది. 247లీటర్ల సేకరణ తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని తల్లి పాల కేంద్రంలో ఏడాదిగా సుమారు 247లీటర్ల పాలను సేకరించి సుమారు 3,475మంది శిశువులకు అందించారు. ప్రతి నెల సుమారు 23 నుంచి 25 లీటర్ల పాలను డోనర్స్ నుంచి సేకరిస్తున్నారు. పాలు డొనేట్ చేసిన తల్లులకు సుమారు 6రకాల డ్రైఫ్రూట్స్ అందించి ప్రోత్సహిస్తున్నారు. మదర్ మిల్క్ కావలసిన వారు, డోనర్స్ 8919469744 నంబర్లో సంప్రదించవచ్చు. ఎలాంటి శిశువులకు అందిస్తారంటే... డెలివరీ అయిన వెంటనే తల్లి చనిపోయిన శిశువులకు, 2కేజీల కంటే బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు, తల్లి ఆరోగ్యంగా ఉండి చనుపాల ద్వారం (నిప్పిల్స్) మూసుకుపోయిన పాలు రాని పరిస్థితి ఏర్పడిన శిశువులకు, తల్లిపాలు పడని బిడ్డలకు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న బాలింతల పిల్లలకు పాలు అందిస్తున్నారు. ఒక్కో ఫీడింగ్‌కు 30ఎమ్ఎల్ చొప్పున రోజుకు 12సార్లు పాలు ఇస్తారు. ఇలా ఒకటి నుంచి 6నెలల వరకు శిశువుకు పాలు అందిస్తారు. సేకరణ ఇలా... స్వచ్ఛందంగా వచ్చే డోనర్స్ నుంచి తల్లి వయసు, డెలివరీ, ఆధార్‌కార్డుతో పూర్తి వివరాలను దరఖాస్తు రూపంలో నమోదు చేసుకుంటారు. అనంతరం తల్లి ఆరోగ్య సమాచారం సేకరించి అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు. తల్లి శరీరంపై టాటూస్ (పచ్చ»ొట్టులు) ఉన్నా, బ్రెస్ట్ సమీపంలో మచ్చలు, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాలింతల నుంచి పాలు సేకరించరు. సంపూర్ణ ఆరోగ్యవంతులైన తల్లుల నుంచి మాత్రమే పాల సేకరణ చేస్తున్నారు. ప్రధానంగా హెచ్ఐవీ, హెచ్‌సీవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, వీడీఆర్ఎల్ పరీక్షలు ప్రతి తల్లికీ తప్పని సరిగా చేసి నెగటివ్ రిపోర్టు ఉంటేనే పాల డొనేషన్‌కు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలింతలు తమ బిడ్డకు సరిపోగా మిగులు పాలను మాత్రమే డొనేట్ చేయాల్సి ఉంటుంది.స్టోరేజ్ ఇలా...ఆరోగ్యవంతులైన తల్లుల నుంచి సుమారు 200ఎమ్ఎల్కు పైబడి ఒక సిట్టింగ్‌లో పాలు సేకరిస్తారు. ఇందులో 10ఎమ్ఎల్ శాంపిల్ పాలను పరీక్షల నిమిత్తం మైక్రోబయోలజీ విభాగానికి పంపుతారు. మిగిలిన పాలను మిక్స్ చేసి రిఫ్రిజిరేటర్లో భద్రపరుస్తారు. అనంతరం యూవీ రేస్‌లో ఉంచి పూలింగ్ ప్రక్రియ కొనసాగిస్తారు. సుమారు 3గంటల పాటు శుద్ధి చేసి 62.4 టెంపరేచర్లో వేడి చేస్తారు. అనంతరం సుమారు అరగంట పాటు కూలింగ్ ప్రాసెసర్‌లో ఉంచుతారు. సుమారు ఆరు నెలలపాటు పాలు సురక్షితంగా ఉండేందుకు మిల్క్ బ్యాంకు అధికారులు. సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. శిశు మరణాల నివారణకే.. శిశు మరణాలను తగ్గించాలనే సంకల్పంతోనే హ్యూమన్ మిల్క్ బ్యాంకుకు శ్రీకారం చుట్టాం. సుమారు రూ.35లక్షల వ్యయంతో ఏర్పాటు చేశాం. చాలా మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 3,475 మంది పసికందుల గొంతు తడిపాం. వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశాం . – టి.దామోదరం,మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ చైర్మన్, తిరుపతి తల్లిపాలే తొలి వ్యాక్సిన్ నవజాత శిశువుకు తొలి వ్యాక్సిన్ తల్లి పాలే. గైనకాలజిస్టా్గ తల్లిపాల శ్రేష్టతపై స్పష్టమైన అవగాహన ఉంది. నేను ఇప్పటివరకు 34 లీటర్లకు పైగా పాలను మిల్క్ బ్యాంకుకు అందించా. బాలింతలు తమ మిగులు పాలను ఇచ్చేందుకు ముందుకు రావాలి. పసికందుల ప్రాణరక్షణకు సహకారం అందించాలి. – డాక్టర్ సోనా తేజస్వి, గైనకాలజిస్ట్ -
ప్రసవాల్లో తిరుపతి బోధనాస్పత్రి టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బోధనాస్పత్రుల ప్రసూతి సేవల్లో తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రి మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అన్ని బోధనాస్పత్రుల్లో 83,493 ప్రసవాలు జరగ్గా.. అత్యధికంగా తిరుపతిలో 9,952 ప్రసవాలు చేశారు. 7,426 ప్రసవాలతో విజయవాడ జీజీహెచ్ రెండో స్థానంలో, 7,424 ప్రసవాలతో కర్నూలు జీజీహెచ్ మూడో స్థానంలో ఉన్నాయి. బోధనాస్పత్రుల్లో రోగుల సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు ఎక్కువ మందికి సేవలందించేలా ప్రతి ఆస్పత్రికి లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లోని మెటర్నిటీ వార్డుల్లో పడకల సామర్థ్యం ఆధారంగా నిర్వహించాల్సిన ప్రసవాలపై లక్ష్యాలను నిర్దేశించారు. 2023–24వ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రుల్లో 1.08 లక్షల ప్రసవాలు నిర్వహించాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 77.3 శాతం ప్రసవాలు చేశారు. రాజమండ్రి జీజీహెచ్‌లో 2,063 ప్రసవాలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. 3,227 ప్రసవాలను నిర్వహించి లక్ష్య ఛేదనలో రాష్ట్రంలోనే ముందంజలో నిలిచింది. అలాగే 4,125 ప్రసవాలకు గాను 5,523 ప్రసవాలు నిర్వహించి లక్ష్య ఛేదనలో కడప జీజీహెచ్ రెండో స్థానంలో, 2,063కు గాను 2,683 ప్రసవాలతో మచిలీపట్నం జీజీహెచ్ మూడో స్థానంలో నిలిచాయి. మహిళలకు అండగా ప్రభుత్వం మాత, శిశు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. మారుమూల గ్రామాల్లో ప్రసవ వేదనతో ఉన్న గర్భిణులను 108 అంబులెన్స్‌లలో సకాలంలో బోధనాస్పత్రులకు తరలిస్తోంది. విశ్రాంత సమయానికి రూ.5 వేలు చొప్పున ఆరోగ్య ఆసరా అందిస్తోంది. అంతేకాకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తల్లీ, బిడ్డలను.. వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో క్షేమంగా స్వగ్రామాలకు చేరుస్తోంది. -
Stolen children: పొత్తిళ్లలో విడిపోయి 19 ఏళ్లకు కలిశారు
కన్న తల్లి ఒడిలో పెరిగి జంటగా ఆడుకోవాల్సిన కవల అమ్మాయిలు వీరు. కానీ విధి వారితో వింత నాటకం ఆడింది. ఆస్పత్రుల్లో పుట్టిన పసికందులను దొంగలించి పిల్లల్లేని జంటలకు అమ్మేసే ముఠా బారిన పడి కన్నతల్లి ప్రేమకు దూరమయ్యారు. ఎందరో చిన్నారులను మొబైల్‌ఫోన్‌కు అతుక్కుపోయేలా చేసే టిక్‌టాక్ వీడియో ఒకటి వీరిద్దరినీ మళ్లీ కలిపింది. అందుకు ఏకంగా 19 సంవత్సరాల సమయం పట్టింది. అచ్చం తనలా ఉన్న అమ్మాయిని చూసి ఎవరీమె? ఎందుకు నాలాగే ఉంది? అంటూ ఒకరిని వేధించిన ప్రశ్నలు చివరకు తన కవల సోదరి చెంతకు చేర్చాయి. ఈ గాథ ఐరోపాలోని జార్జియాలో జరిగింది... ఈ కథ 2002 ఏడాదిలో జార్జియాలోని కీర్ట్స్కీ ప్రసూతి ఆస్పత్రిలో మొదలైంది. గోచా ఘకారియా దంపతులకు కవల అమ్మాయిలు పుట్టారు. వెంటనే తల్లి అజా షోనీకి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లింది. తను చనిపోతే పసికందులను పెంచడం తన వల్ల కాదని గోచా భావించాడు. ఇదే అదనుగా అక్కడున్న పిల్లల్ని దొంగలించే ముఠా అతనికి డబ్బులు ఎరవేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. అచ్చం తనలా ఉండటంతో అవాక్కై.. పిల్లలను ఆ దొంగల ముఠా వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు కుటుంబాలకు పెద్ద మొత్తాలకు అమ్మేసింది. పెంపుడు తల్లిదండ్రులు ఆ చిన్నారులకు అమీ ఖవీటియా, అనో సర్టానియా అని పేర్లు పెట్టారు. చూస్తుండగానే పుష్కరకాలం గడిచిపోయింది. 12 వయసు ఉన్నపుడు అమీ 2014 సంవత్సరంలో ఓ రోజు టీవీలో తనకిష్టమైన ప్రోగ్రాంలో అచ్చం తనలా ఉన్న ఓ 12 ఏళ్ల అమ్మాయి డ్యాన్స్ చేయడం చూసి అవాక్కైంది. కలిపిన టిక్‌టాక్ అమీకి కూడా డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్ నేర్చుకుంది. ఏడేళ్ల తర్వాత అమీ ఒక టిక్‌టాక్ వీడియో తీసి అప్లోడ్ చేసింది. అది తెగ వైరల్ అయింది. దానిని అమీ సొంతూరుకు 320 కిలోమీటర్ల దూరంలోని టిబిలిసీ నగరంలోని కవల సోదరి అనో సర్టానియా స్నేహితురాలు చూసింది. ఆ వీడియో సర్టానియోది అనుకుని భ్రమపడింది. సర్టానియోకు షేర్ చేసి విషయం కనుక్కోమని చెప్పింది. తనలాగా ఉన్న అమీ వీడియో చూసి సర్టానియోకు అనుమానం వచ్చింది. ఈమె నాకు బంధువు అవుతుందా? అసలు ఈ టీనేజర్ ఎవరు? అంటూ తను చదువుకునే విశ్వవిద్యాలయం వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులుపెట్టేది. ఈ గ్రూప్‌లో అమీకి తెల్సిన వ్యక్తి ద్వారా ఒకరి ఫోన్ నంబర్ ఒకరికి అందింది. అందజేశారు. దీంతో అమీ, అనో మొట్టమొదటిసారిగా మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకోవడం మొదలైంది. ఎన్నెన్నో పోలికలు వేర్వేరు కుటుంబ వాతావరణాల్లో పెరిగినా ఇద్దరి అభిరుచులూ ఒకటే. డ్యాన్స్ ఇష్టం. హెయిర్ స్టైల్ ఒక్కటే. ఇద్దరికీ ఒకే జన్యు సంబంధమైన వ్యాధి ఉంది. సరి్టఫికెట్లలో పుట్టిన తేదీ కూడా చిన్న తేడాతో దాదాపు ఒకేలా చూపిస్తోంది. ఒకే వయసు ఉన్నారు. సరి్టఫికెట్లలో ఆస్పత్రి పేరు కూడా ఒక్కటే. ఇన్ని కలవడంతో తాము కవలలమేమో అని అనుమానం బలపడింది. కానీ ఇరు కుటుంబాల్లో ‘నువ్వు మా బిడ్డవే’ అని చెప్పారుగానీ కొనుక్కున్నాం అనే నిజం బయటపెట్టలేదు. వీళ్ల మొండిపట్టు చూసి నిజం చెప్పేశారు. కానీ వీళ్లు కవలలు అనే విషయం వారికి కూడా తెలీదు. ఎందుకంటే వీరికి అమ్మిన ముఠా సభ్యులు వేర్వేరు. దీంతో తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేది మిస్టరీగా ఉండిపోయింది. పెంచలేక వదిలేశారని అనో ఆగ్రహంతో రగిలిపోయింది. కన్న వారిని ఎలాగైనా కనిపెట్టాలని అమీ మాత్రం పలు వెబ్సైట్లు, గ్రూప్‌లలో అన్వేషణ ఉధృతం చేసింది. ఇందుకోసం సొంతంగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించింది. మూడో తోబుట్టువు! ఆ నోటా ఈనోట విన్న ఒక టీనేజర్.. అమీకి ఫోన్ చేసింది. తన తల్లి 2002లో ఒక మెటరి్నటీ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచి్చందని, వారు పుట్టగానే చనిపోయారని తల్లి ఓసారి తనతో చెప్పిందని అమీకి వివరించింది. వెంటనే అమీ అక్కడికి వెళ్లి ఆ టీనేజర్, ఆమె కన్నతల్లి డీఎన్ఏ టెస్ట్‌లు చేయించింది. అవి తమ డీఎన్ఏలతో సరిపోలాయి. అలా ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులో లీపెగ్ నగరంలో కవలలు కన్నతల్లిని కలిసి తనివి తీరా కౌగిలించుకున్నారు. దాంతో ఆమెకు నోట మాట రాలేదు. కోమా నుంచి కోలుకున్నాక మీరు చనిపోయారని భర్త చెప్పాడని కన్నీరుమున్నీరైంది. ఈ మొత్తం ఉదంతం తాజాగా వెలుగు చూసింది. లక్షల శిశు విక్రయాలు ట్యాక్సీ డ్రైవర్లు మొదలు ఆస్పత్రి సిబ్బంది, అవినీతి అధికారులదాకా ఎందరో ఇలా జార్జియాలో పెద్ద వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి లక్షల మంది పసికందులను ఆస్పత్రుల్లో మాయం చేశారని అక్కడి మీడియాలో సంచలనాత్మక కథనాలు వెల్లడయ్యాయి. దీనిపై ప్రస్తుతం జార్జియా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాలింతల మృతి ఆందోళనకరం: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సిజేరియన్ వికటించి ఇద్దరు బాలింతలు మృతిచెందడం పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు సర్కారీ ఆస్పత్రులే ఆఖరి ఆశ అని ఆమె వ్యాఖ్యానించారు. గైనకాలజిస్టుగా తనకు ఈ ఘటనపై ఎన్నో ప్రశ్నలున్నాయని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని అనుకున్నానని, కానీ సంక్రాంతి పండుగని ఆగానని అన్నారు. గతంలో సైతం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో నలుగురు మహిళలు మరణించారని గుర్తు చేశారు. జనాభా అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపడాలని ఆమె అభిప్రాయపడ్డారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొని మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులు తన పరిశీలనలో ఉన్నాయనీ పెండింగ్‌లో లేవని తెలిపారు. యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లులోని అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటీ నియామకాల బిల్లుపై న్యాయ వివాదాలు వచ్చే అవకాశం ఉందని, దీంతో నియామకాల్లో జాప్యం జరగరాదని తన భావనని చెప్పారు. ఈ తరహా విధానాలకు గతంలో న్యాయ స్థానాలు అభ్యంతరం తెలిపాయన్నారు. బిల్లుపై యూజీసీ కొన్ని అంశాలను లేవనెత్తిందని గవర్నర్ వెల్లడించారు. వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కావాలని తన అభిమతమన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై స్వయంగా తయారు చేసిన పొంగళిని సూర్యుడికి సమర్పించిన అనంతరం ఉత్సవాల్లో పాల్గొన్న వారికి వడ్డించారు. -
ప్రసూతి ఆస్పత్రి మహిళా సిబ్బంది నిర్వాకం వైరల్
-
హన్మకొండ: ప్రసూతి ఆస్పత్రి మహిళా సిబ్బంది నిర్వాకం వైరల్
సాక్షి, హన్మకొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మందు పార్టీతో హల్ చల్ చేశారు వాళ్లు. ఏకంగా స్టాఫ్ రూమ్‌లో బీర్లు తాగుతూ చిలిపి చేష్టల విజువల్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారాయి. వారం రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. వైరల్ వీడియో ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరోగ్య శ్రీ ఉద్యోగి, ఒక స్టాప్ నర్స్ మరొక జీఎన్ఎం కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో వాళ్లు వెకిలి చేష్టలకు పాల్పడుతుండగా.. ఎవరో వీడియో తీశారో. కానీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. విచారణకు ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది మందు పార్టీతో ఇలా వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్‌ను బార్ గా మార్చిన సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హనుమకొండ ప్రసూతి ఆస్పత్రిలో మందు పార్టీపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి. ‘వారం రోజుల క్రితం జరిగిన ఘటన తమ దృష్టికి రాగానే పిలిచి మందలించాను. స్టాప్ రూమ్ లో అలా చేయడం తప్పేనని సారీ చెప్పారంటున్న సూపరింటెండెంట్. మొదటి తప్పుగా భావించి మందలించి వదిలేశాము.ఇంకోసారి ఇలా జరిగితే సీరియస్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించాను. బర్త్‌డే పార్టీ సందర్భంగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నామని వివరణ ఇచ్చారు’ అని తెలిపారు సూపరింటెండెంట్. -
కార్పొరేటర్ దంపతులపై కేసు నమోదు
సుల్తాన్‌బజార్: సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి ఫిర్యాదుతో గన్‌ఫౌండ్రీ డివిజన్ కార్పొరేటర్ సురేఖ, ఆమె భర్త ఓంప్రకాష్ బీశ్వలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ పద్మ వివరాల ప్రకారం.. బుధవారం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి కార్పొరేటర్ సురేఖ, ఆమె భర్త ఓంప్రకాష్ బీశ్వలతో పాటు మరికొంత మంది బీజేపీ నాయకులు డాక్టర్ రాజ్యలక్ష్మి చాంబర్‌కు వచ్చి దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేయడంతో భార్యాభర్తతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. కాగా సురేఖ సైతం సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మిపై ఫిర్యాదు చేశారు. (చదవండి: బాలికతో అసభ్య ప్రవర్తన కేసులో ఎమ్మెల్యే కుమారుడు?) -
తన వద్దకు రావొద్దంటూ.. ఆస్పత్రి భవనంపై నుంచి దూకిన బాలింత
సాక్షి, హైదరాబాద్: ప్రసూతి కోసం పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చిన ఓ బాలింత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆసుపత్రి వర్గాలు, పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన సంపూర్ణ(33) గత నెల 26వ తేదీన ప్రసవం కోసం పేట్లబురుజు ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. 29వ తేదీన ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఒక బాలుడు, ఒక బాలిక జన్మించగా ఇరువురు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే ఆ మహిళ ప్రసవించిన అనంతరం రెండు, మూడు రోజులుగా నిద్రలేని సమస్యతో ఏదో ఆలోచనతో బాధపడుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. గురువారం ఆమె భర్త సంపూర్ణను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చాడు. అప్పటికే మానసిక ఒత్తిడితో ఉన్న ఆమె భర్తను చూసి మరింత ఒత్తిడికి గురై ఆసుపత్రి ఆవరణలోనే గట్టిగా ఆరుస్తూ తన వద్దకు రావొద్దంటూ.. వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. గట్టిగా అరుస్తూ ప్రధాన గేటు వైపు నుంచి మొదటి అంతస్తు నుంచి దూకడానికి ప్రయత్నించింది. అప్పటికే పరిస్థితిని అర్థం చేసుకున్న ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు ఆమె దూకడాన్ని గమనించి అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కాపాడారు. స్వల్ప గాయాలకు గురైన ఆమెను ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, భర్తపై కోపంతో ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి -
భవనం పూర్తి కాదు.. కష్టాలు తీరవు
సుల్తాన్‌బజార్: సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడకు వచ్చే గర్భిణులు, తోడుగా వచ్చే సహాయకులకు కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో నిలుచునే చోటు లేకపోవడంతో చాలామంది ప్రాగంణంలోను, చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి. రోగులు, వారి బంధువులు అందరూ బయటే ఉండటంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారుతోంది. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఇన్ పేషెంట్‌గా ఉన్న వారికోసం వారి బంధువుల సైతం రావడంతో నిత్యం ఆస్పత్రిలో జన సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ప్రాంగణంలో మరో కొత్త భవనం నిర్మాణం చేపట్టింది. అయితే, గత మూడేళ్లుగా నిర్మాణ పనులు నత్త నడకన నడుస్తుండటంతో రోగులకు, వారి సహాయకులకు ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో వారు ఆస్పత్రి ఆవరణలో నేలపైనే భోజనాలు చేయడం, అక్కడే కునుకు తీయడం చేస్తుండడంతో అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. నూతన భవనం త్వరగా పూర్తయితే గాని రోగులకు ఈ పాట్లు తప్పవు. -
పసికందును కిడ్నాప్ చేసిన మహిళ అరెస్ట్
-
చిన్నారి.. చేతన
సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి నుంచి కిడ్నాపైన తన బిడ్డను తిరిగి తన ఒడికి చేర్చడంలో కీలకపాత్ర పోషించిన ఏసీపీ చేతన పేరునే ఆ చిన్నారికి పెడుతున్నట్లు తల్లి సబావత్ విజయ ప్రకటించారు. తమకు దైర్యం చెప్పడానికి ఆస్పత్రికి వచ్చిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు ఈ విషయం తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ చిన్నారిని సైతం చేతన లాంటి అధికారిగా చేయాలని విజయ నుంచి మాట తీసుకున్నారు. బాలికల విద్యాశాతాన్ని పెంచడానికి ఇదో ఉత్తమ కేస్‌స్టడీగా మారాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం ఆస్పత్రికి వెళ్లిన అంజనీకుమార్ శిశువు తల్లికి పుష్పగుచ్ఛం అందించారు. బీదర్‌కు చెందిన మహిళగానే అనుమానం... చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ బీదర్‌వాసి అని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువును తీసుకొని ఎంజీబీఎస్ నుంచి బస్సులో వెళ్లిన ఆమె బీదర్ బస్టాండ్‌లో కాకుండా కాస్త ముందున్న నయాకమాన్ స్టాప్‌లో దిగింది. ఇలా కేవలం స్థానికులు మాత్రమే చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. సోమవారం సైతం విజయ బిడ్డ కంటే ముందు మరో ఇద్దరు చిన్నారుల్ని ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నించి విఫలమైనట్లు బయటపడింది. మీడియాలో హడావుడి, పోలీసుల గాలింపు నేపథ్యంలో భయపడిపోయి బుధవారం సాయంత్రం బీదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువును వదిలివెళ్లింది. పోలీసులు బీదర్‌లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారి కిడ్నాప్‌నకు గురైన సోమవారంరాత్రి డ్యూటీ అధికారిణిగా ఏసీపీ చేతన ఉన్నారు. దీంతో కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయానికి ఆపరేషన్ బీదర్‌కు మారడంతో డీసీపీ ఎం.రమేశ్ అనుమతి తీసుకుని అక్కడకు వెళ్లి పర్యవేక్షించారు. సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ పి.శివశంకర్‌రావు తన డ్రైవర్‌ను ఇచ్చి బీదర్‌కు అంబులెన్స్ పంపారు. ఏసీపీ చేతన గురువారం తెల్లవారుజామున చిన్నారిని తీసుకువచ్చి తల్లిఒడికి చేర్చారు. త్వరలో భద్రతాచర్యలకు సిఫారసులు.. ఆస్పత్రులు తీసుకోవాల్సిన భద్రతాచర్యల్ని నిర్దేశించడానికి అధ్యయనం చేస్తున్నట్లు కొత్వాల్ అంజనీకుమార్ తెలిపారు. ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేశ్, సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ చేతన వీటిపై రెండు, మూడు రోజుల్లో ఖరారు చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. చిన్నారికి తన పేరు పెట్టడం ఆనందంగా, గర్వంగా ఉందని చేతన అన్నారు. చిన్నారికి కామెర్ల లక్షణాలు కనిపించాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తామంటూ కుటుం బీకులు వైద్యుల్ని కోరినా కమిషనర్ వస్తున్నారంటూ వారు తరలించడానికి అంగీకరించలేదు. దీంతో చిన్నారి తండ్రి నారీ బయటకు వచ్చి పోలీసులతో పాటు మీడియాపై అసహనం ప్రదర్శిస్తూ చిన్నారి విషయం చెప్పారు. దీంతో స్పందించిన ఆస్పత్రి వర్గాలు చిన్నారిని బంధువుల సంరక్షణలో అంబులెన్స్‌లో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
నా కూతురు నాకు కావాలి: విలపించిన తల్లి
సాక్షి, హైదరాబాద్ : సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ఆయాలా వచ్చిన ఓ మహిళ ఆరు రోజుల ఆడ శిశువుకు వ్యాక్సినేషన్ ఇప్పిస్తానని చెప్పి శిశువుతో ఉడాయించిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. సుమారు 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ శిశువును అపహరించినట్లు సీసీ కెమెరాల ద్వారా నిర్ధారించారు. ఈ విషయం గురించి సుల్తాన్ బజార్ సీఐ శివశంకర్ మాట్లాడుతూ.. ‘శిశువును అపహరించిన మహిళ తొలుత బీదర్ వైపు వెళ్లినట్లు గుర్తించాము. అనంతరం ఆమె ప్రయాణించిన బస్సు డ్రైవర్, కండక్టర్లను విచారించగా ఆమె బీదర్ కొత్త కమాన్ దగ్గర దిగినట్లు చెప్పారు. అక్కడి నుంచి ఆమె ఆటోలో వెళ్ళి ఉండవచ్చని అనుమానిస్తున్నాము. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని విచారిస్తున్నాము. కాని ఈ మహిళకు పాత కేసుల్లో ఉన్న వారితో ఎలాంటి పోలికలు లేవ’ని తెలిపారు. అంతేకాక శిశువును అపహరించిన మహిళ పాప తల్లితో మాట్లాడినప్పుడు తెలుగులోనే మాట్లాడిందని, కండక్టర్‌తో మాట్లాడినప్పుడు మాత్రం కన్నడలో మాట్లాడిందని సీఐ శివశంకర్ చెప్పారు. శిశువును అపహరించిన మహిళను పట్టుకునేందుకు మొత్తం 11 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఏడు తెలంగాణకు చెందినవి కాగా, మరో నాలుగు బీదర్ పోలీసు బృందాలని తెలిపారు. నా కూతురు నాకు కావాలి: తల్లి విజయ ‘ఆ మహిళ నాతో తెలుగులోనే మాట్లాడింది. టీకా వేయించాలని నా కూతుర్ని తీసుకెళ్లింది. ఇప్పుడు నా కూతురు కనిపించకుండా పోయింది. నా కూతురు నాకు కావాలి, ఎక్కడ ఉన్నా నా కూతుర్ని నాకు తెచ్చివ్వండి’ అంటూ బాలిక తల్లి విజయ కన్నీరుమున్నీరైంది. -
కోఠి ప్రసూతి ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్
-
మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక కృషి
కరీమాబాద్: వరంగల్ అండర్ రైల్వేగేట్‌లోని సీకేఎం అనుబంధ ఉర్సు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అన్నారు. సోమవారం ఆస్పత్రిలో అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది, ఓపీ, వైద్య సేవలు, సౌకర్యాల గురించి కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతివారం ఆసుపత్రిలో డెలివరీస్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో ఇంకా కావల్సిన సౌకార్యలపై ఎస్టిమేషన్ వేయించి ఇవ్వాలని కలెక్టర్ కోరారు. డీఎంహెచ్ఓ హరీష్‌రాజ్ మాట్లాడుతూ ఉర్సు ఆసుపత్రికి చెందిన డాక్టర్లు సీకేఎంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులను ఉర్సు ఆసుపత్రికి రప్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి గురువారం డెలివరీలు, బుధవారం వ్యాక్సినేషన్, శుక్రవారం స్కానింగ్, శనివారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్, వార్డు రూమ్, పరిసరాలను కలెక్టర్, అధికారులు పరిశీలించారు. సమావేశంలో సీకేఎం సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్, ఆర్ఎంఓ శివకుమార్, టీబీ ఆఫీసర్ డాక్టర్ మల్లిఖార్జున్, రిటైర్డ్ జేడీ సూర్యప్రకాష్, కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి, జిల్లా మలేరియా అధికారి రమణమూర్తి, డీఐఓ గీతాలక్ష్మి, డాక్టర్ గోపాల్, దేవదాస్, ప్రకాష్ పాల్గొన్నారు. కరీమాబాద్: సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ అమ్రపాలి బాలల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి కాజీపేట అర్బన్: బాలల సంరక్షణకు బాలల స్వచ్ఛంధ సంస్థలు మొదటి ప్రాధాన్యతనివ్వాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం మహిళాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ, స్వచ్ఛంధ సంస్థల పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ అమ్రపాలి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల సంరక్షణ సంస్థలు బాలలకు అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్ధాయి పర్యవేక్షణ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీలో సభ్యులుగా డీసీపీఓ, సీడబ్లుసీ చైర్పర్సన్ అనితారెడ్డి, చైల్డ్‌లైన్ ప్రతినిధి వైధ్యాధికారి డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులను ఎన్నుకున్నారు. జిల్లాలోని వివిధ బాలల సంరక్షణ స్వచ్ఛంధ సంస్థల నిర్వాహకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
హన్మకొండలో చోటాభీమ్
5.3 కిలోల బరువుతో జన్మించిన శిశువు హన్మకొండ చౌరస్తా: హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఓ తల్లి 5.3 కిలోల పండంటి పాపకు జన్మనిచ్చింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కె.మంజులకు వైద్యులు సోమవారం ఆపరేషన్ ద్వారా ప్రసవం చేశారు. ఆమెకు 5.3 కిలోల బరువుతో శిశువు జన్మించింది. పాప ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు. మంజులకు ఇది మూడో కాన్పని, ఇదివరకు ఇద్దరు కుమారులు ఉన్నారని ఆమె బంధువులు తెలిపారు. -
ప్రసవించిన మూడురోజులకే పరీక్షకు..
హన్మకొండ: ప్రసవించిన మూడురోజులకే ఓ మహిళ గురుకుల టీచర్ పోస్టుల రాత పరీక్షకు హాజరయ్యింది. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన మల్లికంటి వరలక్ష్మి గురుకుల టీచర్ పోస్టుల రాత పరీక్షకు ప్రిపేర్ అయింది. పరీక్షకు మూడు రోజుల ముందే వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని మెటర్నిటీ ఆస్పత్రిలో ప్రసవించింది. ప్రసవించి మూడు రోజులే అయినా పరీక్ష రాయాలనే పట్టుదలతో అంబులెన్స్‌లో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రానికి వెళ్లింది. వరలక్ష్మికి ప్రత్యేకంగా సీటు కేటాయించగా పరీక్ష రాసింది. -
పురుడుకోసం వస్తే పాడెక్కిస్తున్నారు!
-
మెటర్నిటీ ఆస్పత్రిలో మరణ మృదంగం
-
ప్రసూతి రగడ
⇒రాజుకుంటున్న ప్రసూతి ఆస్పత్రి వ్యవహారం ⇒గడువు ముగిసినా ఖాళీ చేయని స్విమ్స్ ⇒మండిపడుతున్న ప్రజాసంఘాలు తిరుపతి మెడికల్:తిరుపతిలో ప్రసూతి ఆస్పత్రి రగడ రాజుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న ఈ ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్‌కు కట్టబెట్టింది. దీన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కార్పొరేట్ వైద్యానికే టీడీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మండిపడుతున్నాయి. రూ.77 కోట్లతో 300 పడకల ఆస్పత్రి ఎస్వీ మెడికల్ కళాశాల పరిధిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఉంది. ఇక్కడ 150 బెడ్లు ఉన్నాయి. రాయలసీమ జిల్లాల నుంచి వందలాది మంది కాన్పుల కోసం వస్తుండడంతో బెడ్ల కొరత ఏర్పడుతోంది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు, నలుగురు ప్రసవించిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద మహిళల కోసం 300 పడకల ఆస్పత్రిని మంజూరు చేసింది. 2012లో రూ.77 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అత్యాధునిక వైద్య సదుపాయాలతో 300 పడకల ప్రసూతి ఆస్పత్రి ఆవిష్కృతమైంది. ప్రసూతిపై కన్నేసిన స్విమ్స్ టీటీడీ ఆధ్వర్యంలో సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ ప్రసూతి ఆస్పత్రిపై కన్నేసింది. తమకు అనుబంధంగా ఉన్న శ్రీపద్మావతి మెడికల్ కళాశాలో సీట్ల పెంపు, సిబ్బంది నియామకాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రసూతి ఆస్పత్రిని ఇవ్వాలని పాలకులపై ఒత్తిడి తెచ్చింది. ఆ మేరకు టీడీపీ ప్రభుత్వం ప్రసూతి ఆస్పత్రిని రెండేళ్లపాటు స్విమ్స్‌కు కట్టబెట్టింది. రెండేళ్ల క్రితంరాత్రికిరాత్రే జీవోలు విడుదల చేసింది. రెండేళ్ల గడువు ముగిసినా.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పేదలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. గడువు గత ఏడాది డిసెంబర్ నాటికే తీరినా ఇంతవరకు ఖాళీ చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరో రెండేళ్ల వరకు గడువు పొడిగింపునకు ప్రయత్నాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. ప్రస్తుత మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగా గత కేంద్ర ప్రభుత్వం రూ.77 కోట్లతో 300 పడకల ఆస్పత్రిని కేటాయించింది. పేద గర్భిణులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపట్టింది. అయితే ప్రస్తుతం స్విమ్స్‌కు కట్టబెట్టడంతో పేద గర్భిణులకు ఉచితంగా వైద్యం చేసుకునే వెసులబాటు లేకుండా పోయింది. దీనికితోడు రూ.50 ఓపీ తీసుకున్నా కాన్పు సమయంలో కార్పొరేట్ ధరలు వసూలు చేస్తుండడంతో పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
‘గాంధీ’కి పోటెత్తుతున్న గర్భిణీలు..
పాలనా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గాంధీ ఆస్పత్రి : సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ఆపరేషన్లు నిలిపివేసిన నేపధ్యంలో గాంధీ ఆస్పత్రికి గర్భిణీలు పోటెత్తుతున్నారు. వైద్యులు, సిబ్బందితో పాటు మంచాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గైనకాలజీ వార్డు, లేబర్ రూమ్‌ల్లో 160 మంచాలుండగా సుమారు 250 మందికి సర్ధుబాటు చేస్తున్నారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో డెలివరీలు నిలిపివేయడంతో నిరుపేదలు గాంధీ దారిపట్టడంతో ఓపీకి వచ్చేవారి సంఖ్య అమాంతంగా 350కి పెరిగింది. బెడ్లు అందుబాటులో లేకపోవడంతో ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురికి సర్దుబాటు చేస్తున్నారు. వార్డుల బయట మంచాలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. గైనకాలజీ విభాగానికి రద్ధీ పెరిగినందున రోగులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్, గైనకాలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ జేవీరెడ్డి తెలిపారు. సుల్తాన్‌బజార్ ఆస్పత్రికి చెందిన వైద్యులు, సిబ్బంది ఇక్కడికే వచ్చి వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఐదు ఆపరేషన్ థియేటర్లను 24 గంటల పాటు అందుబాటులో ఉంచామన్నారు. -
వాడు మాబిడ్డే.. కాదు మాబిడ్డే..
- ప్రసూతి ఆస్పత్రిలో శిశువుల తారుమారు - ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం - మగశిశువు తమ బిడ్డేనని ఇరువర్గాల పట్టు హైదరాబాద్: ఆస్పత్రి వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువులను తారుమారు చేయడం.. రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపింది. మంగళవారం సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మాంచాల మండలం నోముల గ్రామానికి చెందిన జంగయ్య భార్య రమాదేవిని సోమవారం కాన్పుకోసం ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ మండలం కడ్తాల్‌కు చెందిన శత్రు భార్య రజిత కూడా కాన్పు కోసం ఇదే ఆస్పత్రిలో చేరింది. రమాదేవి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నర్సులు, ఆయాలు రమాదేవి అని పిలవడంతో ఆమె కుటుంబీకులకు బదులు రజిత పెద్దమ్మ మసూర్ వచ్చి నిలబడింది. మీ పాపకు మగ శిశువు జన్మించాడని సిబ్బంది ఆమె వద్ద రూ.వెయ్యి తీసుకొని బాబును అందజేశారు. అనంతరం గంట తరువాత రజిత సైతం ప్రసవించింది. అప్పుడు ఆస్పత్రి సిబ్బంది వచ్చి మసూర్ వద్ద ఉన్న మగ శిశువును మీ బిడ్డ కాదని చెప్పి.. రమాదేవి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో రజిత బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. తమ కూతురికి పుట్టింది మగ శిశువేనని.. ఆస్పత్రి వర్గాలు తారుమారు చేశాయని ఆరోపిస్తూ సిబ్బందిపై దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఇరువర్గాల గొడవ నేపథ్యంలో శిశువులను ఆస్పత్రిలోని చైల్డ్‌వార్డ్‌కు తరలించారు. జంగయ్య, శత్రు, శిశువుల రక్తనమూనాలను ఆస్పత్రి వర్గాలు పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు ఈ సమస్యకు డీఎన్ఏ టెస్టే పరిష్కార మార్గమని వైద్యులు భావిస్తున్నారు. కాగా ఆస్పత్రిలో ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పత్తాలేకపోవడంతో రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
అమ్మలకు నరకయాతన
ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రిలో వైద్యుల కొరత క్యూలో గంటలకొద్దీ నిలబడుతున్న గర్భిణులు రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాతాశిశు ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. చాలినంతమంది వైద్యులు లేకపోవడంతో గర్భిణులు గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఆస్పత్రికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైద్యం నిమిత్తం గర్భిణులు వస్తూంటారు. రంపచోడవరం, చింతూరు తదితర ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. వైద్య పరీక్షల నిమిత్తం రోజూ 200 మంది వస్తున్నారు. రోజూ 20 ప్రసవాలు జరుగుతాయి. ఇందులో 10 వరకూ సిజేరియన్లు ఉంటాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ ఆస్పత్రిలో గర్భిణులకు సేవలందించడానికి ముగ్గురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు ప్రసవాలు,ఆపరేషన్లు చేయడానికి, మరొకరు వైద్యపరీక్షలకు, మూడో డాక్టర్ రోజువారీ ఓపీ చూస్తూంటారు. గంటలకొద్దీ క్యూలో.. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు వైద్యం పూర్తయ్యే వరకూ అధిక సమయం గర్భిణులు క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఓపీ రాయించుకుని డాక్టర్ వద్దకు వెళ్లితే అక్కడ క్యూ భారీగా ఉంటోంది. డాక్టర్ ఎంత వేగంగా సేవలందించినా గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. 200 మందికి ఒక్కరే వైద్యం చేయడం చాలా కష్టమవుతోంది. అలాగే స్కానింగ్ వద్ద కూడా గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. ఒక్క గైనకాలజిస్ట్ మాత్రమే ఉండడంతో గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. డాక్టర్లు సరిపడా లేకపోవడంతో చాలామందిని కాకినాడ జీజీహెచ్‌కు పంపిస్తున్నారు. భవనాలు కట్టారు కానీ.. జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలోనే ఎన్ఆర్హెచ్ఎం నిధులతో 100 పడకల మాతా, శిశు సంక్షేమ ఆస్పత్రి నిర్మించారు. రూ.10 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రిని గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ అవసరమైన మేరకు సిబ్బంది నియామకం చేపట్టలేదు. 100 పడకల ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. స్టాఫ్నర్సులకూ కొరత శిక్షణ పొందిన స్టాఫ్‌నర్సుల కొరత కూడా ఇక్కడ తీవ్రంగా ఉంది. 24 స్టాఫ్‌నర్స్, 4 హెడ్ నర్స్, 10 ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. ఎనిమిది మంది గైనకాలజిస్టులను నియమించాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో గత్యంతరం లేక ఉన్న సిబ్బంది, వైద్యులతోనే గర్భిణులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఎనిమిదిమంది డాక్టర్లు కావాలి గర్భిణులకు వేగవంతంగా సేవలు అందించడానికి ఎనిమిదిమంది డాక్టర్లు కావాలి. ఇప్పుడు కేవలం ముగ్గురే ఉన్నారు. గర్భిణులు కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అందుబాటులో ఉన్న డాక్టర్లతో మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నాం. శిక్షణ పొందిన స్టాఫ్‌నర్సుల కొరత తీవ్రంగా ఉంది. మే నెలలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పోస్టుల మంజూరుపై చర్చించాం. త్వరలో మంజూరయ్యే అవకాశం ఉంది. - టి.రమేష్ కిషోర్, జిల్లా ఆస్పత్రి సంచాలకుడు, రాజమహేంద్రవరం maternity hospital, doctors , pregnants, మాతాశిశు ప్రభుత్వాస్పత్రి, డాక్టర్లు, గర్భిణులు -
కోఠి ప్రసూతి ఆస్పత్రిపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: కోఠి ప్రసూతి ఆస్పత్రి పరిస్థితులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రిలోని అసౌకర్యాలపై సుమోటోగా ఫిర్యాదు స్వీకరించిన న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఆస్పత్రిలో అపరిశుభ్ర వాతావరణం, అరకొర వసతులు, నిర్వహణ లోపం రోగులకు తీవ్ర ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంది. అక్కడి పరిస్థితులపై మూడు వారాల్లోగా సవివర నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ ఇద్దరు మహిళా న్యాయవాదులతో కమిటీని ఏర్పాటు చేసింది. -
ప్రసూతి ఆస్పత్రిలో గర్భిణి మృతి
- కుటుంబసభ్యుల ఆందోళన హైదరాబాద్ : నగరంలోని కోఠి ప్రసూతి వైద్యశాలలో గర్భిణి మృతి చెందడంతో మృతురాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. రంగారెడ్డి జిల్లా మాధపురం గ్రామానికి చెందిన మమత(25) పురిటినొప్పులతో సోమవారం సాయంత్రం కోఠిలోని ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. ఆమె మంగళవారం ఉదయం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మమత చనిపోయిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. -
ఆడపిల్లని చంపేశారు..
మరుగుదొడ్డి కమోడ్‌లో కుక్కేశారు.. విజయవాడ (లబ్బీపేట): కడుపు నొప్పి అంటూ అర్ధరాత్రి సమయంలో చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ మహిళ గుట్టు చప్పుడు కాకుండా టాయిలెట్లో ప్రసవించి బిడ్డను కమోడ్‌లో కుక్కేసిన దారుణ ఘటన మంగళవారం రాత్రి విజయవాడలో జరిగింది. మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటలకు ఓ మహిళ 108 సిబ్బంది సాయంతో రాత్రి 1.50 గంటలకు ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భిణిగా గుర్తించి ఆమెతో ఉన్న వారిని మరో ప్రాంతంలో ఉన్న ప్రసూతి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఆ సమయంలో ఆమె సిబ్బందిని ఏమార్చి టాయిలెట్‌కు వెళ్లి ప్రసవించి పుట్టిన ఆడశిశువును కమోడ్‌లో కుక్కేసింది. కొద్దిసేపటికి బయటకు వచ్చి 2.52 గంటలకు మరో ప్రాంతంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లేందుకు 108కు ఫోన్ చేయగా, సమీపంలోని రామవరప్పాడులో ఉన్న వాహనం వచ్చి ఆమెను వేకువన 3.50 గంటల సమయంలో ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం 7.45 గంటల సమయంలో ఆస్పత్రి టాయిలెట్స్ కమోడ్‌లో శిశువు మరణించి ఉన్నట్లు అక్కడి సిబ్బంది గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
గర్భిణికి గ్రూప్ మార్చి రక్తం ఎక్కించిన వైద్యులు
ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఓ పాజిటివ్ బ్లడ్ కావడంతో తప్పిన పెనుముప్పు ఎంజీఎం : వరంగల్‌లోని సీకేఎం మెటర్న టీ ఆస్పత్రి వివాదాలకు నిలయంగా మారుతోంది. నెల రోజుల క్రితం శిశు మార్పిడి జరిగిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన విషయం మరువక ముందే బుధవారం ఓ గర్బిణీకి బీ పాజి టివ్ గ్రూప్ రక్తానికి బదులు ఓ పాజిటివ్ గ్రూప్ రక్తం ఎక్కించి మరో వివాదానికి తెర తీశారు. అయితే ఓ పాజిటివ్ రక్తం యూనివర్సల్ బ్లడ్ గ్రూపు రక్తం కావడంతో గ ర్భిణికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడంతో సీకేఎం పరిపాలనాధికారులతో వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. నర్సంపేట డివిజ న్ గిర్నిబావికి చెందిన స్వాతి అనే గర్భిణిని మంగళవారం సాయంత్రం 4 గంటలకు సీకేఎం ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆమె కు రక్తం తక్కువగా ఉండడంతో రక్తాన్ని అం దుబాటులో ఉంచాల్సిందిగా తెలి పారు. అయితే గర్భిణీ బ్లడ్ గ్రూపు బీ పాజిటివ్ కాగా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న రంజిత్ అనే ల్యాబ్ టెక్నీషియన్ ఓ పాజిటివ్‌గా పేర్కొంటూ రక్తాన్ని రెం డు యూనిట్లు అందుబాటులో ఉంచాల్సిందిగా పేర్కొన్నాడు. అనంతరం బ్లడ్ శాంపిల్ నమూనాతోపాటు కేస్ షీట్‌ను బంధుమిత్రులకు అందించి రక్తం తేవాల్సిందిగా పేర్కొన్నారు. బంధువులు వెళ్లి ఎంజీఎం బ్లడ్‌బ్యాంక్‌లో శాంపిల్ ఇవ్వగా ఎలాంటి క్రాస్ మ్యాచింగ్ చేయకుండానే ఓ పాజిటివ్ రక్తాన్ని అందించారు. దీంతో స్వాతికి అదే రక్తం ఎక్కించారు. అయితే ఓ పాజిటివ్ యూనివ ర్సల్ బ్లడ్ గ్రూపు కావడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా గర్భిణి సురక్షితంగా ఉంది. అరుు తే మళ్లీ స్వాతి బ్లడ్‌గ్రూపు శాంపిళ్లను ఎం జీఎం బ్లడ్బ్యాంక్తోపాటు సీకేఎం ఆస్పత్రిలో పరీక్షించగా ఆమె రక్తం బీ పాజిటివ్ బ్లడ్‌గా తేలింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకుంటామని సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. అంతేగాక ఎంజీఎం బ్లడ్‌బ్యాంక్ తీరుపై ఎంజీఎం పరిపాలనాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆర్ఎంఓ పుష్పేందర్నాథ్ పేర్యొన్నారు. -
ప్రసూతి వైద్యశాలలో 8 గంటలపాటు నరకయాతన
హైదరాబాద్: నగరంలో ప్రసూతి సేవలకు కీలకమైన కోటి మెటర్నిటీ ఆస్పత్రిలో విద్యుత్ లేక చికిత్స కోసం వచ్చిన వారు 8 గంటల పాటు నానా యాతన పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆస్పత్రి వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయంగా ఆస్పత్రిలో జనరేటర్ ఉన్నప్పటికీ అది పనిచేయడం లేదు. సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, శిశువులు అవస్థలు పడ్డారు. ఆస్పత్రి సిబ్బంది జనరేటర్‌కు మరమ్మతులు చేయించి ఎట్టకేలకురాత్రి 9 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
అమ్మతనానికి అడ్డుకోత
అవసరం లేకున్నా ఆపరేషన్లు ఏటా ఏడు వేలకుపైగా సిజేరియన్లు పెరుగుతున్న మాత, శిశు మరణాలు ప్రైవేటు ఆస్పత్రులకు కాసుల వర్షం తిరుపతి నగరానికి చెందిన అమ్ములు గత నెల మూడో తేదీన ప్రసవం కోసం స్థానిక ప్రసూతి ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకున్నారు. తీరా అక్కడ పనిచేస్తున్న ఓ ప్రయివేట్ క్లినిక్ మధ్యవర్తి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇచ్చింది. ఆమె సూచించిన ఆస్పత్రికి వెళితే అవసరం లేకున్నా అమ్ములుకు సిజేరియన్ చేసి కాన్పు చేశారు. రూ.23 వేల బిల్లు చేతికిచ్చారు. బంగారుపాళ్యంలోని తుంబకుప్పానికి చెందిన సుజాత గత నెల ఏడున చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో కాన్పు కోసం వచ్చింది. అర్ధరాత్రి ఓ మగబిడ్డకు జన్మనిచ్చి కన్ను మూసింది. సుజాత మరణం ఇక్కడి వైద్యుల పనితీరును ప్రశ్నిస్తోంది. తొట్టంబేడుకు చెందిన మునెమ్మకు నెలలు పూర్తిగా నిండడంతో స్థానిక పీహెచ్సీలో కాన్పుకోసం వెళ్లింది. పరిస్థితి విషమించిందని, ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. అంబులెన్సులో వెళుతుండగానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మూడే కాదు జిల్లాలోని దాదాపు 90 శాతం ప్రభుత్వాస్పత్రులు, 24 గంటల పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏపీవీపీ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. గర్భిణులకు శస్త్ర చికిత్సల పేరిట కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వపరంగా అందజేయాల్సిన ‘జాతీయ ఆరోగ్య గ్రామీణ మిషన్’లో వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గర్భిణులు ప్రైవేటు వైద్య సేవల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. మాత, శిశు మరణాలను తగ్గించడానికి ఏటా రూ.కోట్లలో నిధులు విడుదలవుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ప్రజలకు చైతన్యం కల్పించి ప్రభుత్వ ఆసుపత్రులవైపు రప్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎలాంటి అవసరం లేకున్నా సిజేరియన్ ఆపరేషన్లు చేసి అమ్మతనాన్ని తెలిపే పురిటినొప్పులను చెరిపేస్తున్నారు. ధరలు ఏవీ? ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి ఇష్టానుసారంగా తయారయ్యింది. రక్తం గ్రూపు తెలుసుకోవడం నుంచి పెద్ద స్థాయి శస్త్ర చికిత్సల వరకు ఏయే సేవలకు ఎంత రుసుం చెల్లించాలనే వివరాలు జిల్లాలో ఏ ఒక్క ప్రైవేటు ఆసుపత్రిలో కనిపించడంలేదు. ఫలితంగా కాసులకు కక్కుర్తిపడి కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు సిజేరియన్లు చేయడానికే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు వెలిశాయంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల అనుభవం లేని వైద్యులు ఆపరేషన్లు చేస్తుండడంతో అవి వికటించి మాత, శిశు మరణాలు సైతం పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు ఏటా సగటున 7500 మంది స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగటున ఏదాడికి మూడువేల సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు పోటీగా రెట్టింపు సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. -
ప్రసూతి ఆస్పత్రికి మహర్దశ
అదనంగా రూ.57.2 కోట్ల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం 57.30 కోట్లతో మూడువందల పడకల సామర్థ్యంతో భవన నిర్మాణం రూ.20 కోట్లతో అధునాతన పరికరాల కొనుగోలుకు వెసులుబాటు..! తిరుపతి : రూయా ఆస్పత్రి పరిధిలోని ప్రసూతి(మెటర్నిటీ) ఆస్పత్రికి మహర్దశ పట్టనుంది. మూడు వందల పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆస్పత్రికి అదనంగా రూ.57.2 కోట్లను మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. మెటర్నిటీ ఆస్పత్రి అంచనా వ్యయం రూ.77.30 కోట్లకు పెంచినట్లు వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ.సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళితే.. రాయలసీమలో ప్రత్యేకమైన ప్రసూతి ఆసుపత్రి ఒక్క రుయా పరిధిలో మాత్రమే ఉంది. ప్రసూతి ఆసుపత్రికి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గర్భిణులు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ.20.10 కోట్లతో వంద పడకల ప్రసూతి ఆసుపత్రి భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మార్చి 29, 2012న ఉత్తర్వులు జారీచేసింది. భవన నిర్మాణ స్థాయిని వంద పడకల నుంచి మూడు వందల పడకలకు పెంచాలని డిసెంబర్ 14, 2012న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇందుకు రూ.57.20 కోట్లను(రూ.37.20 కోట్లతో భవన నిర్మాణం.. రూ.20 కోట్లతో అధునాత పరికరాల కొనుగోలు) మంజూరు చేయాలని కోరింది. ఇందుకు ఆమోదం తెలిపిన కేంద్రం 2013-14లో రూ.20 కోట్లు.. 2014-15లో రూ.37.20 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించింది. 2013-14లో రూ.20 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఈ ఆర్థిక సంవత్సరం నిధులు ఇప్పటిదాకా విడదల చేయలేదు. దాంతో.. భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని స్విమ్స్ నేతృత్వంలోని శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రుయా ఆసుపత్రి వర్గాలు.. జూనియర్ డాక్టర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసూతి ఆసుపత్రికే ఆ భవనాన్ని కేటాయించాలంటూ భారీ ఎత్తున ఉద్యమించారు. ఈ వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. సెప్టెంబర్‌లో రుయా ఆసుపత్రికి వెళ్లిన తిరుపతి ఎంపీ వరప్రసాద్.. మూడు వందల పడకల ఆసుపత్రి స్థితిగతులపై సమీక్షించారు. కేంద్రం 2014-15లో నిధులు విడుదల చేయని విషయాన్ని రుయా అధికారవర్గాలు ఎంపీ దృష్టికి తీసుకొచ్చాయి. నిధుల విడుదలపై కేంద్రంతో చర్చిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ.. అదనంగా నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అదనంగా రూ.20.10 కోట్లు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 27న ప్రతిపాదనలు పంపారు. అంటే.. ప్రసూతి ఆసుపత్రికి నేషనల్ హెల్త్ మిషన్ కింద మొత్తం రూ.77.30 కోట్లను మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపినట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రతిపాదలనపై కేంద్రం ఆమోదముద్ర వేసింది. రూ.57.30 కోట్లతో మూడు వందల పడకల సామర్థ్యంతో భవన నిర్మాణం.. రూ.20 కోట్లతో అధునాతన పరికరాలు కొనుగోలు చేయాలని కేంద్రం సూచించింది. నిధులను సకాలంలో విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించడంతో రుయాలోని ప్రసూతి ఆసుపత్రి భవన నిర్మాణం వేగం పుంజుకోనుంది. మూడు వందల పడకల ఆసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. గర్భిణులకు సమస్యలు తీరినట్లవుతుందని రుయా అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
జూనియర్ డాక్టర్ల సమ్మె బాట
తిరుపతి కార్పొరేషన్ : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. ముందుగా ప్రకటించిన విధంగానే సోమవారం ఉదయం విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు రుయా ఆస్పత్రి వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. రుయా ఆస్పత్రితో పాటు మెటర్నటీ హాస్పిటల్, ఎస్వీ మెడికల్ కళాశాలకు చెందిన పీజీ,యూజీ, హౌస్ సర్జన్లు క్యాజువాలిటీ, ఐసీయూ, ఏఎంసీ, ఆర్ఐసీయూ విభాగాల్లో మినహా మిగిలిన వైద్య సేవలను బహిష్కరించారు. రుయా ఆస్పత్రి ఆవరణలో పెద్ద ఎత్తున జూడాలు గుమికూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానిది బ్లాక్‌మెయిలింగ్ ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ తమను ప్రభుత్వం బ్లాక్‌మెయిలింగ్ చేస్తోందన్నారు. పీజీలో ఏడాదిపాటు విధిగా గ్రామీణప్రాంతంలో పనిచేయాలనే నిబంధన పెడుతున్నారన్నారు. లేకుంటే నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల జామీనుతో కూడిన రూ.20 లక్షలు బాండ్ తీసుకుంటున్నారని ఆరోపించారు. నిరుపేదలు, గ్రామీణ ప్రాంతం, రైతు కుటుంబాల నుంచి వచ్చిన తాము రూ.20 లక్షలు ఏ విధంగా బాండ్ ఇస్తారని నిలదీశారు. పోనీ గ్రామీణ ప్రాంతంలో వైద్యసేవలు చేయిస్తారా అంటే అదీ లేదన్నారు. కేవలం ఎంసీఐ వారికి కళాశాలలో సీట్ల సంఖ్యను చూపించుకునేందుకు తమను ఎరగా వాడుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. పీహెచ్‌సీల్లో పోస్టులు భర్తీ చేయండి గ్రామీణ ప్రాంతంలోని పీహెచ్సీలో పర్మినెంట్ వైద్యుల పోస్టులను భర్తీ చేయకుండా, ఆ పోస్టుల్లో పేరుకు జూనియర్ డాక్టర్లను హౌస్సర్జన్లుగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. పర్మినెంట్ పోస్టులు కల్పిస్తే పల్లెకు పోవడానికి మామే సిద్ధం. మమ్మల్ని శాశ్వత ఉద్యోగానికి పంపడానికి మీకు దమ్ముందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఏడాది పాటు వైద్య సేవలు చేయమంటే ఎలా సాధ్యమవుతుందన్నారు. పైగా ఆ హాస్పిటల్స్‌లో ఖాళీలను భర్తీచేస్తే వేతనాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వం స్వార్థం కోసం జూనియర్ డాక్టర్లను వాడుకుని వదిలేస్తోందని ధ్వజమెత్తారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే అత్యవసర సేవలను కూడా స్తంభింప జేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో జూడా అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి ఇజాజ్, ఉపాధ్యక్షుడు నిఖిల్ప్రవీణ్, సంయుక్త కార్యదర్శి నాగరాజు రాయల్, రామ్‌భూపాల్‌రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
నెల్లూరు మెటర్నిటీ ఆసుపత్రిలో వసతుల లేమి!
-
మెటర్నిటీ ఆస్పత్రి వైద్యుల ర్యాలీ
పీజీలు, హౌస్ సర్జన్లు విధులకు దూరం ఆస్పత్రి వద్ద గర్భిణీల ధర్నా తిరుపతి అర్బన్ : స్థానిక మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన 300 పడకల గర్భిణీల భవనాన్ని స్విమ్స్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్ ర్లు, భవన నిర్మాణ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలు సోమవారం 6వ రోజుకు చేరా యి. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్లు డాక్టర్ పార్థసారధిరెడ్డి, డాక్టర్ కిరీటి ఆధ్వర్యంలో రుయా, మెటర్నిటీ వైద్యులతో పాటు పీజీ డాక్టర్లు, హౌస్ సర్జన్లు పెద్ద ఎత్తున స్కూటర్ ర్యాలీ చేపట్టారు. మెటర్నిటీ హాస్పిటల్ వద్ద ప్రారంభమైన ర్యాలీని డాక్టర్ భారతి ప్రారంభించగా బస్టాండు సమీపంలోని పూర్ణకుంభం సర్కిల్ వద్ద ముగిసింది. రుయా, మెటర్నిటీల్లో పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లు విధులను బహిష్కరించడంతో వేలాది మంది రోగులు, గర్భిణీలు అవస్థలు పడ్డారు. ఇందుకు నిరసనగా మెటర్నిటీ హాస్పిటల్ ఎదుట పలువురు గర్భిణీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్లు మాట్లాడుతూ సుమారు రూ.100 కోట్ల కేంద్ర నిధులతో నిర్మించుకున్న భవనాలను పేదలకు కాకుండా ప్రైవేటు చేతుల్లో నిర్వహిస్తున్న స్విమ్స్‌కు అప్పగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు చంద్రశేఖర్, సురేష్‌బాబు, గోపీకృష్ణ, విష్ణుభరద్వాజ్, భానుప్రకాష్, ప్రమోద్, మెటర్నిటీ, రుయా వైద్యులు పాల్గొన్నారు. -
కాశ్మీర్‌లోని అతి పెద్ద ప్రసూతి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
జమ్ము కాశ్మీర్‌లోనే అతి పెద్దదైన ప్రసూతి ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో అగ్నిప్రమాదం చెలరేగింది. వజీర్‌బాగ్ ప్రాంతంలోని ఈ ఆస్పత్రిలో మంటలు చెలరేగినా, ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. 500 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలోని ఓపీడీ విభాగంలో ఈరోజు సాయంత్రం పొగలు రావడాన్ని అక్కడి సిబ్బంది గమనించినట్లు అగ్నిమాపక దళాధికారి తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఒకేసారి 18 అగ్నిమాపక శకటాలను హుటాహుటిన అక్కడకు తరలించారు. ఆస్పత్రిలో ఉన్న రోగులు, వారి సహాయకులను వెంటనే అక్కడకు సమీపంలో ఉన్న ఇన్ పేషెంట్ విభాగానికి తరలించారు. అయితే ఈ సంఘటనపై అధికారులు సత్వరం స్పందించడంతో ఎవరూ గాయపడలేదని తెలిసింది.