చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ బీదర్‌వాసి అని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువును తీసుకొని ఎంజీబీఎస్ నుంచి బస్సులో వెళ్లిన ఆమె బీదర్ బస్టాండ్‌లో కాకుండా కాస్త ముందున్న నయాకమాన్ స్టాప్‌లో దిగింది. ఇలా కేవలం స్థానికులు మాత్రమే చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. సోమవారం సైతం విజయ బిడ్డ కంటే ముందు మరో ఇద్దరు చిన్నారుల్ని ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నించి విఫలమైనట్లు బయటపడింది. మీడియాలో హడావుడి, పోలీసుల గాలింపు నేపథ్యంలో భయపడిపోయి బుధవారం సాయంత్రం బీదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువును వదిలివెళ్లింది.