Chetana
-
Chetana Parikh: రక్తదాతకు వందనం
ఇన్ని కోట్ల మంది ఉన్న మనదేశంలో 100 సార్లు రక్తదానం చేసినవారు కేవలం 125 మంది ఉన్నారు. వీరిలో స్త్రీలు ఇద్దరే ఉండగా మూడవ వ్యక్తిగా అహ్మదాబాద్‌కు చెందిన చేతన పారిఖ్ నిలిచింది. అక్టోబర్ 1న వందోసారి రక్తదానం చేయడం ద్వారా ఆమె ఈ ఘనత సొంతం చేసుకుంది. రక్తదాన అవసరాన్ని ప్రచారం చేయడమే కాక అనితరసాధ్యంగా పాటిస్తున్న చేతన పరిచయం. అక్టోబర్ 1, ఆదివారం, అహ్మదాబాద్‌లోని జె.ఎల్.ఠాకూర్ రెడ్‌క్రాస్ భవన్. ‘నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే’ సందర్భంగా రెడ్‌క్రాస్ సంస్థ నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. అందరూ 58 ఏళ్ల చేతన పారిఖ్ కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపటికి ఆమె వచ్చింది. రక్తం ఇవ్వడానికి అలవాటుగా చేతిని ముందుకు సాచింది. మెడికల్ స్టాఫ్ ఆమె చేతిలో సూది గుచ్చారు. ఆమె ఒంటి నుంచి రక్తం సాచెట్ వైపు ప్రవహించసాగింది. అంతే. అందరూ చప్పట్లు హోరెత్తించారు. ఎందుకంటే ఆ రోజుతో ఆమె అలా రక్తాన్ని ఇవ్వడం వందోసారి. మన దేశంలో దశాబ్దాలుగా రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల్లో ఇప్పటి వరకు కేవలం ఇద్దరు స్త్రీలే నూరుసార్లు రక్తం ఇచ్చారు. చేతన పారిఖ్ మూడో వ్యక్తి. కాలేజీ రోజుల నుంచి అమ్మమ్మ వయసు వరకూ ఆమె ఎప్పుడూ రక్తదానం చేస్తూనే ఉంది. ఇక మీదట కూడా చేస్తూనే ఉంటాను అంటోంది. 1985లో మొదటిసారి చేతన పారిఖ్ అహ్మదాబాద్‌లోనే పుట్టి పెరిగింది. నగరంలోని కలుపూర్ కాలేజీలో చదువుకుంది. ‘అది 1985వ సంవత్సరం. మా కాలేజీకి రెడ్ క్రాస్ వాళ్లు వచ్చి రక్తం ఇమ్మని అభ్యర్థించారు. అప్పటికి రక్తదాన ఉద్యమం ఊపందుకోలేదు. చాలా అపోహలు ఉండేవి. కొద్దిమంది అబ్బాయిలు ముందుకొచ్చారు. నేను, ఇంకో అమ్మాయి మాత్రమే రక్తం ఇచ్చాం. మా ఇంటిలో ఇది తెలిసి చాలా ఆందోళన చెందారు. రక్తం ఇవ్వడం వల్ల శరీరానికి నష్టం అనుకునేవారు ఆ రోజుల్లో. కాని రక్తం అందక చాలా మంది మరణిస్తున్నారని అప్పటికే నాకు తెలుసు. ఇది చేయదగ్గ మంచి పని అనిపించింది. అప్పటి నుంచి రక్తం ఇస్తూనే ఉన్నాను’ అంటుంది చేతన పారిఖ్. కుటుంబంతో ఉద్యమం చేతన భర్త వినిత్ పారిఖ్ సాదాసీదా డాక్టర్. పెళ్లయ్యాక చేతన తన భర్తను రక్తదానం వైపు ప్రోత్సహించింది. ఒక డాక్టర్‌గా రక్తదానం ఎంత అవసరమో తెలియడం వల్ల వినిత్ కూడా భార్య నుంచి స్ఫూర్తి పొందాడు. ఇద్దరూ కలిసి రెడ్ క్రాస్‌లో చేరారు. ఒకరికి చెప్పడమే కాదు తాము క్రమం తప్పకుండా రక్తదానం ఇస్తూ స్ఫూర్తిగా నిలిచారు. ‘నా భర్త వినిత్ నా కంటే ముందే నూరుసార్లు రక్తం ఇచ్చినవాళ్ల లిస్ట్‌లోకి ఎక్కారు. నేను తాజాగా ఆ లిస్ట్‌లో చేరాను. మనం చేసి చూపిస్తే మిగిలినవారు అందుకుంటారు. నా కొడుకు హన్షిల్, నా కుమార్తె మేహ ఇద్దరూ డాక్టర్లే. వారు కూడా మాతో కలిసి రక్తదానం చేస్తూనే ఉంటారు. ఇద్దరూ ఇప్పటికి చెరో ముప్పైసార్లు రక్తం ఇచ్చారు. ఇలా మా కుటుంబంలోని నలుగురు సభ్యులం కలిసి మొత్తం 260 సార్లు రక్తం ఇచ్చాం. ఇన్నిసార్లు ఇచ్చిన మరో కుటుంబం లేదేమో మన దేశంలో’ అంటుంది చేతన. పెళ్లిలో వినూత్నం చేతన రక్తదానం కోసం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుంటుంది. కూతురు పెళ్లిలో ఆమె రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం విశేషం. అందులో పెళ్లికొడుకు స్వయంగా రక్తం ఇచ్చాడు. పెళ్లికి వచ్చిన బంధుజనుల్లో చాలామంది రక్తం ఇవ్వగా 58 యూనిట్ల సేకరణ జరిగింది. ‘రక్తం విలువ సరిగ్గా అది అవసరమైనప్పుడు తెలుస్తుంది. రక్తం ల్యాబ్‌లో తయారు కాదు. మనిషే ఇవ్వాలి. అందుకు మానవత్వం ఉండాలి. మన మానవత్వం నిరూపించుకోవడానికి రక్తదానానికి మించిన మార్గం లేదు’ అంటుంది చేతన. ఒక గృహిణిగా ఉంటూనే ఆమె చేస్తున్న ఈ విశిష్ట ప్రచారం, సేవ ఒక్కరికైనా స్ఫూర్తి కలిగిస్తే అంతే చాలు. -
ఘనంగా ఉత్తేజ్ కూతురి సీమంతం.. ఫోటోలు వైరల్
Actor Uttej Daughter Chetana Baby Shower Photos Goes Viral: నటుడు ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా వైభవంగా సీమంతం వేడుక జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉత్తేజ్ చిన్నకూతురు పాట తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసింది. త్వరలోనే నా హీరో లేదా హీరోయిన్ వస్తున్నారు అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సీమంతం వేడుకకు సింగర్స్ గీతా మాధురి, శృతి సహా నటుడు తనీష్ సైతం హాజరయ్యారు. చదవండి: నటుడు ఉత్తేజ్ కూతురు బేబీ బంప్ ఫోటోలు వైరల్ హాట్ టాపిక్‌గా మారిన కృతిశెట్టి లిప్‌లాక్ సీన్ -
నటుడు ఉత్తేజ్ కూతురు బేబీ బంప్ ఫోటోలు వైరల్
Actor Uttej Daughter Chetana Baby Bump Photos Viral: నటుడు ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న ఆమె మెటర్నటీ షూట్ చేయించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టింది అని సంతోషిస్తానని, కొడుకు పుట్టినా ఆనందమే అని పేర్కొంది. కాగా ఇటీవలె ఉత్తేజ్ సతీమణి పద్మావతి మరణించిన సంగతి తెలిసిందే. క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఇక చిత్రం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన చేతన పలు సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. నటుడు రవిరాజాను ప్రేమ వివాహం చేసుకోవడంతో ఉత్తేజ్ కొంతకాలం పాటు కూతురితో మాట్లాడలేదు. -
Chetna Vasishth: ఒకప్పుడు కార్పొరేట్ ఉద్యోగి.. సబ్స్క్రైబర్స్ 30 లక్షల మందికి పైనే!
జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగిన వాళ్లు ఎప్పుడూ బిజీగా ఉంటారు. తీరికలేకపోయినప్పటికీ సేవా దృక్పథం ఉన్న వారు.. తమ సంపద నుంచి కొంత విరాళంగా ఇచ్చి, సమాజాభివృద్ధికి తోడ్పడుతుంటారు. వీరందరికీ విభిన్నంగా వ్యవహరిస్తూ.. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్ వైపు అడుగులు వేసేలా కృషిచేస్తున్నారు చేతన వశిష్ట. గోల్డ్‌మెడల్ స్టూడెంట్, యూనివర్శిటీ ర్యాంకర్ ఆమె. పదేళ్లపాటు కార్పోరేట్ ఉద్యోగిగా పనిచేసిన అనుభవంతో.. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి కావాల్సిన విద్య, చేయాల్సిన కోర్సులను ఎలా ఎంచుకోవాలి? కాలేజీ, యూనివర్శిటీలలో ఏవి బావుంటాయి... వంటి అంశాలకు విశ్వసనీయమైన సమాచారాన్ని గైడింగ్ ట్రీలా వివరిస్తూ వ్యూవర్స్‌ను ఆకట్టుకుంటోంది చేతన. దీంతో ఆమె ఫాలోవర్స్ లక్షల్లోనే ఉన్నారు. కెరియర్ గైడెన్స్, విజయవంతంగా రాణిస్తోన్న వ్యాపారవేత్తల స్టోరీలను తనదైన శైలిలో వివరిస్తూ లక్షలమంది యువతరానికి మార్గనిర్దేశనం చేస్తున్నారు ముంబైకి చెందిన చేతన వశిష్ట. బీఏ ఎకనామిక్స్ చేసిన చేతన తరువాత ఎక్స్ ఎల్ఆర్ఐ జంషెడ్‌పూర్‌లో పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రీయల్ రిలేషన్స్‌లో ఎంబీఏ చేసింది. ఇన్స్టిట్యూట్ మొత్తంలో రెండో ర్యాంక్ పొందడమేగాక, మొత్తం పెర్ఫార్మెన్స్లో గోల్డ్ మెడల్ అందుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలో మంచి ర్యాంకర్ స్టూడెంట్‌గా నిలిచింది. లెర్నింగ్ ట్రీ.. చేతన పీజీ అయ్యాక ఏఎన్జెడ్ గ్రిండ్లేస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్‌లలో సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేసింది. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరులలోని ఈ బ్యాంకుల విభాగాల్లో పదేళ్లపాటు పనిచేసింది. 2001 నుంచి 2007 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎమ్) బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అండ్ మేనేజ్మెంట్ (ఐఐపీఎమ్) ముంబైలకు విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేసేది. ఈ క్రమంలోనే 2007లో ‘లెర్నింగ్ ట్రీ’ పేరిట ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎన్నో బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలకు కన్సల్టంట్గా పనిచేసింది. ఇంతటి ఉన్నతస్థాయి బాధ్యతలు నిర్వహిస్తోన్న సమయంలో ఎంతోమంది సక్సెస్‌పుల్ ఎంట్రప్రెన్యూర్లను కలిసిన చేతన వారి ఆలోచనా దృక్పథాన్ని తెలుసుకోవడం ద్వారా ఇతరులకు సాయం చేసే గుణమున్న ఓఫ్రా విన్‌ఫ్రేను ఆదర్శంగా తీసుకుని వాళ్లలాగా సేవచేయాలనుకుంది.. భవిష్యత్‌ను బంగారుమయంగా మార్చే విద్యకు సరైన గైడెన్స్ అందిస్తే యువతరం అద్భుతాలు సాధిస్తుందని భావించింది. ఏ కోర్సు చేయాలి? ఎక్కడ ఎడ్యుకేషన్ బావుంది? కోర్సులను అందిస్తోన్న కాలేజీలు యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయో వివరంగా చెప్పడానికి సరైన మాధ్యమం లేదని గ్రహించిన సమయంలో చెట్‌చాట్ ఆలోచన వచ్చింది తనకు. చెట్‌చాట్.. చేతనకు సోషల్ మీడియా గురించి అంతగా తెలియకపోయినప్పటికీ 2015లో చెట్‌చాట్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. ఇది ఒకరకమైన కెరియర్ ఓరియంటేషన్ ఛానల్. ప్రారంభంలో లాయర్స్, డాక్టర్స్, డిజైనర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, డెంటిస్ట్స్, ఎంట్రప్రెన్యూర్స్, ప్రోస్థటిక్ డిజైనర్స్, సీఈవోలను ఎందరినో ఇంటర్వ్యూలు చేసి ఆ వీడియోలు పోస్టు చేసేది. ఈ క్రమంలో వాళ్లు మాట్లాడేటప్పుడు ‘‘హార్వర్డ్, కేంబ్రిడ్జి, కొలంబియా, ఆక్స్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలలో వాళ్ల అనుభవాలు పంచుకోవడం, యూపీఎస్సీ, క్లాట్, ఐబీపీఎస్, సీఏ ఎంట్రన్స్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు వాళ్లు ఎదుర్కొన్న అనేక అనుభవాలను చెబుతూ..వీటికి సంబంధించిన విషయాలు చెప్పేవాళ్లు ఎవరూ లేరు. విద్యార్థులకు వీటిగురించి సమాచారం అందించే సైట్లు పెద్దగా లేవు. వీటిమీద మీరు వీడియోలు రూపొందిస్తే బావుంటుంది’’ అని చెప్పారు. అప్పటినుంచి చెట్చాట్లో కెరియర్ గైడెన్స్‌ను ప్రారంభించింది. చేతన కూడా ఒకప్పుడు స్వతహాగా మెరిట్ స్టూడెంట్ కావడం, ఐఐఎమ్‌లకు గెస్ట్ ఫ్యాకల్టీగా వ్యవహరించిన అనుభవంతో విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందించేది. వందశాతం విశ్వసనీయమైన, విలువైన సమాచారం అందించడంతో ఆమె చెట్చాట్కు క్రమంగా మంచి ఆదరణ లభించింది. కెరియర్ గైడెన్స్, సక్సెస్‌పుల్ వ్యాపార వేత్తల స్టోరీలు, వృత్తినిపుణులతో చిట్ చాట్, బెస్ట్ స్టడీ టెక్నిక్స్, మానసికంగా ఎలా దృఢంగా ఉండాలి? నిరాశానిస్పృహలను ఎలా ఎదుర్కొవాలి వంటి అనేక విషయాలను చెబుతోంది. ఎడ్యుకేషన్, కెరియర్ స్టడీ టిప్స్, లెర్నింగ్ ఇంగ్లీష్, స్కాలర్షిప్స్ అందించే విదేశీ విద్యకు సంబంధించిన సలహాలు, సూచనలు అందిస్తోంది. దీంతో చెట్‌చాట్ సబ్స్ట్రైబర్స్ ముప్ఫై లక్షల మందికి పైనే ఉండగా, ఆమె ఇన్‌స్ట్రాగామ్ ఫాలోయర్స్ సంఖ్య కూడా నలభై ఐదువేలకు మందికి పైమాటే! చదవండి: ప్లస్ సైజ్అయినా మైనస్ కాదు Manjula Pradeep: ఎవరీమె... ఏం చేస్తున్నారు.. ఎందుకీ పోరాటం? -
చేతన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకుంది
చేతనాజైన్... ఆర్కిటెక్ట్. యాభై మంది ఉద్యోగులున్న తన సొంత సంస్థకు ఆమె సీఈవో. తండ్రి స్థాపించిన సంస్థను వారసత్వంగా అందిపుచ్చుకున్న మహిళ కాదామె. తన జీవితాన్ని తానే నిర్మించుకున్న ఓ ట్రెండ్‌సెట్టర్. ఆర్కిటెక్చర్ రంగంలో మహిళలు లెక్కలేనంత మంది ఉన్న మాట నిజమే. కానీ ఎక్కువ మంది మగవాళ్లు స్థాపించిన సంస్థలో ఉద్యోగి గా ఉండడానికే ఇష్టపడుతుంటారు. మరికొందరు ఇంటీరియర్ డిజైనింగ్ వైపు మరలిపోతుంటారు. అలాంటి సమయంలో ఇరవై రెండేళ్ల కిందట సొంత సంస్థను స్థాపించి, నిర్మాణరంగంలో తనదైన పాదముద్రలు వేసిన మహిళ చేతనా జైన్. అమ్మ అనుసరించిన సూత్రమే.... హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన చేతనాజైన్ ది గుజరాతీ వ్యాపార కుటుంబం. ఆర్కిటెక్ట్‌గా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులను విస్తృతంగా చేస్తున్నారామె. కార్పొరేట్ కంపెనీల యాజమాన్యం నుంచి తాపీ మేస్త్రీల వరకు అందరితోనూ మాట్లాడాల్సి ఉంటుంది. ఏ నేల మీద ఉంటే ఆ భాష నేర్చుకుని తీరాలనే తన తల్లి అనుసరించిన సూత్రమే తన విజయానికి పునాది అన్నారు చేతనాజైన్. ‘‘ఏ నేల మనకు జీవితాన్నిస్తుందో ఆ నేలను, అక్కడి భాష ను గౌరవించాలనేది మా అమ్మ. కనీసం బస్సుల మీద పేర్లు చదవగలగాలి కదా అనేది. అలా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదివాను. ఇక ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో నా వంతు వచ్చేటప్పటికి జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ లో మాత్రమే ఖాళీలున్నాయి. ఆర్కిటెక్ట్ ఏం పని చేయాల్సి ఉంటుందని అడిగి తెలుసుకుంది మా అమ్మ. ‘పెళ్లయిన తర్వాత ఇంట్లో ఉండి కూడా పని చేసుకోవచ్చు’ అని ఆర్కిటెక్చర్లో చేర్చేసింది. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ తర్వాత జెమ్షెడ్పూర్లో ఎంబీఏ చేశాను. స్వయంగా ఇన్వాల్వ్ అయినప్పుడే... ఎన్ఆర్ అసోసియేషన్స్‌లో మల్లికార్జునరావుగారి దగ్గర జూనియర్‌గా ఒకటిన్నర ఏడాది పని నేర్చుకున్నాను. కాలేజ్‌లో కాన్సెప్ట్ మాత్రమే తెలుసుకుంటాం. అసలైన పని వచ్చేది ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే. ‘ఒక బిల్డింగ్ పునాది నుంచి పూర్తయే వరకు ప్రతి పనిలోనూ స్వయం గా ఇన్వాల్వ్ అయినప్పుడే పనిలో నైపుణ్యం వస్తుంది’ అని ఆయన చెప్పిన మాటే నా కెరీర్ నిర్మాణానికి పునాది. చేతిలో పని లేకపోతే పాత డిజైన్లను తీసి చూస్తుంటే.. అదే స్థలంలో ఇంకా చక్కని డిజైన్ వేయడానికి ఉన్న అవకాశాలు అవగతమవుతాయని చెప్పారు. హైదరాబాద్, మొజంజాహి మార్కెట్ రెస్టోరేషన్ విజయవంతంగా చేయగలిగానంటే అప్పట్లో ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలే కారణం. ఆయన పోయిన తర్వాత ఇక ఉద్యోగం చేయలేదు. సొంత ఫర్మ్ పెట్టాను. భవనం జెండర్ చూడదు ‘‘నువ్వు కట్టే భవనం నువ్వు స్త్రీవా, పురుషుడివా అని చూడదు. ఇక్కడ పనిచేసేది జెండర్ కాదు మన మెదడు మాత్రమే. ఆడవాళ్లం కాబట్టి ఆఫీస్‌కే పరిమితం అనుకుంటే ఎప్పటికీ ఏమీ సాధించలేరు. మీరు వేసిన డిజైన్‌ను సైట్లో భవన రూపంలోకి తెచ్చే పనిలో కూడా భాగస్వాములయి తీరాలి. అప్పుడే ఆచరణలో ఎదురయ్యే సవాళ్లు అర్థమవుతాయి. అవసరమైతే సైట్లో ఆ క్షణంలోనే డిజైన్ని మార్చి ఇవ్వగలిగే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. మహిళలుగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేతప్ప మహిళని కదా అని పని లో వెసులుబాటు వెతుక్కోకూడదు’’ అంటారు ఈ రంగంలో కొత్తగా చేరే స్త్రీలతో చేతనాజైన్. నిజానికి ప్రతి రంగమూ అందరిదీ. ఆడవాళ్లు అడుగు పెట్టనంత వరకే అది మగవాళ్ల సామ్రాజ్యంగా ఒక ముద్ర వేసుకుని ఉంటుంది. కొన్ని కనిపించని పరిధులు విధించుకుని ఉంటుంది. ఆ సరిహద్దు గీతను తుడిచేస్తున్న మహిళల్లో చేతనాజైన్ కూడా ఒకరు. కెరీర్‌కి కిరీటం వారసత్వ హోదా ఉన్న కట్టడాన్ని పునరుద్ధరించాలంటే నైపుణ్యం కంటే ఎక్కువగా అంకితభావం ఉండాలి. మొజంజాహి మార్కెట్ పునరుద్ధరణ పనిని 2016 చివర్లో మొదలుపెట్టాం. ఆ నిర్మాణం తొలిరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఆరునెలలకు పైగా పట్టింది. హబ్సిగూడలో ఉన్న స్టేట్ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లో ఈ భవనానికి సంబంధించిన ప్రతి ఆధారమూ ఉంది. నిజాం నవాబు 1935లో ఈ భవనం కోసం విడుదల చేసిన తొలి మొత్తం 30 రూపాయల డాక్యుమెంట్‌తో సహా ఉన్నాయి. దుకాణదారులు ఎవరికి వాళ్లు తమకు కావల్సినట్లు కరెంట్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు, ఫ్లోరింగ్ వేసుకున్నారు. దుకాణదారులతో మాట్లాడి వాళ్ల అవసరాలు నెరవేరేటట్లు చూస్తూనే, భవనం అసలు స్వరూపాన్ని పరిరక్షించగలిగాం. ఇందుకోసం మా టీమ్ రెండేళ్లు పని చేసింది. కమర్షియల్‌గా అయితే రెండేళ్లలో సమాంతరంగా అనేక ప్రాజెక్టులు చేయగలుగుతాం. కానీ ఇలాంటివి చేయడం కెరీర్‌కి గర్వకారణం. – చేతనాజైన్, సీఈవో, ధ్రుమతారు కన్సల్టెంట్స్ – వాకా మంజులారెడ్డి -
స్నేహితురాలి కోసం... అమెరికా నుండి జల్లీకి..
సాక్షి, చెన్నారావు పేట: చిన్నానాటి స్నేహితురాలికి కోసం అమెరికా నుండి జల్లీ గ్రామానికి చేరుకుని ఓ స్నేహితురాలు ఓటు హక్కును వినియోగించుకుంది. వివరాల్లోకి వెళితే జల్లీ గ్రామానికి చెందిన తొగరు చేతన అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. కాగా చేతన ఖాజీపేటలోని ఫాతిమ హైస్కూల్లో మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితతో కలిసి పదవ తరగతి వరకు(1996) చదువుకుంది. తాను టీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పడంతో తన స్వగ్రామమైన జల్లీ గ్రామంలో ఓటు వేయడానికి బుధవారం వచ్చింది. గురువారం జరిగిన లోకసభ ఎన్నికల్లో స్నేహితురాలు కవితకు తన తల్లి తొగరు విజయతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసినట్లు తెలిపింది. తన స్నేహితురాలి గెలుపు కోసం తన ఓటు ఉపయోగ పడటం సంతోషంగా ఉందని తెలిపారు. ఖండాంతరాలు దాటివచ్చి ఓటేసిన వెంకటేష్... పల్లెటూరులో జన్మించాడు, ఉన్నత విద్యను అభ్యసించాడు. ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లి విద్యాభ్యాసం అనంతరం కాలిపోర్నియాలో ఉద్యోగంలో స్ధిరపడ్డాడు. 10 ఏళ్లుగా అక్కడే ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఈనెల 10న స్వగ్రామం దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి వచ్చాడు. మొదటిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు వేసిన అనంతరం తన సంతోషం వ్యక్తం చేశాడు. ఎంత దూరంలో ఉన్నా పుట్టిన ఊరిలో ఓటు వేయడం చాలా ఆనందంగా ఉందని వెంకటేష్ తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం.. డాక్టర్ చేతన
మెడిసిన్ చదివి డాక్టర్ అయింది. పోలీసుగా మారి ప్రాక్టీస్ చేస్తోంది. స్టెతస్కోపు మీద ఒట్టేసి... ఖాకీకి సలాం చేసి... చెప్తున్నాం డాక్టర్ చేతన సమాజానికి వైద్యం చేస్తోంది. కోఠీ లోని మెటర్నిటీ హాస్పిటల్ నుంచి సుభావత్ విజయకు పుట్టిన ఆరు రోజుల పాపాయి ఈ నెల రెండవ తేదీన అపహరణకు గురైంది. సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతన మూడవ తేదీ సాయంత్రానికి ఆ పాపాయిని తెచ్చి తల్లి ఒడికి చేర్చింది! డాక్టర్ చేతన ఐపీఎస్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. నిజమే, హాస్పిటల్ నుంచి మాయమైన బిడ్డను గంటల్లో వెతికి తెచ్చిన అధికారి మరి. రాష్ట్రం దాటిన బిడ్డను సలక్షణంగా తెచ్చి తల్లిఒడిలో పెట్టిన పోలీస్ అధికారి ఆమె. రెండు తెలుగు రాష్ట్రాలూ ఈ అమ్మాయిని ప్రశంసల్లో ముంచెత్తుతుంటే ఆమె మాత్రం ‘నా ఉద్యోగాన్ని నేను చేశాను. ఇదంతా టీమ్ వర్క్’ అంటున్నారు. డాక్టర్‌గా ఓ ఏడాది ‘‘మెడిసిన్ చేసేటప్పుడు దేహం, ఆరోగ్యం, అనారోగ్యాలను చదివాను. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసిన ఏడాది కాలంలోనే సమాజాన్ని చదవడం సాధ్యమైంది. నా దగ్గరకు వచ్చిన పేషెంట్లలో ఎనీమియా, వరుస గర్భస్రావాలతో బాధపడే వాళ్లే ఎక్కువగా కనిపించారు. వాళ్లందరూ దాదాపుగా వరకట్న బాధితులే. కొందరు నేరుగా భర్త, అత్తమామల నుంచి వేధింపులకు గురవుతుంటే మరికొందరు పరోక్షంగా సూటిపోటి మాటలతో మౌనంగా వేదనను భరిస్తున్న వాళ్లే. డాక్టర్‌గా వాళ్ల దేహానికి వైద్యం చేసేదాన్ని, అంతకంటే ఎక్కువగా మరేదయినా చేయాలనిపించేది. కానీ, వారికి మానసిక ధైర్యాన్నివ్వడం వరకే సాధ్యమయ్యేది. ఆ మహిళల అనారోగ్యం వెనుక ఉన్నది అనారోగ్యకరమైన సమాజం. నిజానికి వైద్యం చేయాల్సింది సమాజానికి. మూల కారణానికి వైద్యం చేయాలంటే ఓ డాక్టర్‌కి సాధ్యం కాదు. సమాజంలో కరడు గట్టి ఉన్న ఈ రోగానికి వైద్యం చేయాలంటే చట్టంతోనే సాధ్యం అనిపించింది. అందుకే పోలీస్ అవ్వాలనుకున్నాను. ఐఆర్ఎస్ వచ్చింది! సివిల్స్ ప్రిపరేషన్లో తొలి ప్రయత్నంలో ఐఆర్ఎస్ వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమీషనర్‌గా ఓ ఏడాది చేశాను. రెవెన్యూ సర్వీసెస్‌లో పని చేయడం బాగానే ఉంటుంది. కానీ నా ప్రధాన ఉద్దేశం మహిళలు, వాళ్ల మీద దాడులు. వాటిని అరికట్టాలంటే ఐపీఎస్ అయి తీరాల్సిందే. రెండవ ప్రయత్నంలో అంటే.. 2013లో ఐపీఎస్ వచ్చింది. కానీ అప్పటికి మెటర్నిటీ లీవ్‌లో ఉన్నాను. రెండేళ్ల తర్వాత సర్వీస్‌లో చేరాను. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తొలి పోస్టింగ్ ఇదే. బిడ్డ అపహరణ ఘటన ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత హాస్పిటల్ నుంచి బిడ్డను అపహరించారని కంప్లయింట్ వచ్చింది. వెంటనే హాస్పిటల్కెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ చూశాం. నీలం రంగు చీర కట్టుకున్న ఒక మహిళ.. బిడ్డతో హాస్పిటల్ ఆవరణ దాటడం కనిపించింది. ‘నీలం రంగు చీరతో ఉన్న మహిళ, ఆరు రోజుల పాప...’ ఆ ఆధారంతో మా సెర్చ్ టీమ్‌లు పరుగులు తీశాయి.కొన్ని టీమ్‌లు నగరంలోని పబ్లిక్ ప్లేస్‌లు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లలో సీసీకెమెరా ఫుటేజ్ చూస్తూ వివరాలు నోట్ చేశాయి. ఆ మహిళ ఎంజిబిఎస్ నుంచి బీదర్ వెళ్లే బస్ ఎక్కిందనే సమాచారం రావడంతో బీదర్ పోలీస్‌కు సమాచారమిచ్చాం. వెంటనే మా టీమ్‌తో బీదర్‌కెళ్లాను. ఈ టాస్క్‌లో మొత్తం ఎనిమిది టీమ్‌లు పనిచేశాయి. మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకు పాపాయిని బీదర్‌లోని హాస్పిటల్లో గుర్తించాం. ఆ తర్వాత ఆ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నాం. ఎందుకు అపహరించింది?! పాపాయి కోసం వెతికేటప్పుడు ఒకటే ఆందోళన. ఎందుకోసం అపహరించిందో తెలియదు. క్షుద్ర పూజల కోసమైతే మేము ట్రేస్ చేసే లోపలే జరగరానిది జరిగిపోతుందేమోననే భయం. అవయవాల అపహరణ కూడా చాపకింద నీరులా ఉంది. అందుకే ప్రతి వాహనాన్నీ చెక్ చేశాం, చెత్త కుప్పలను కూడా వదలకుండా శోధించాం. అయితే మేము భయపడినట్లేమీ జరగలేదు. ఆమె పాపాయిని ఎత్తుకెళ్లిన కారణం గుండెల్ని కదిలించేదిగా ఉంది. ఆమెకు పిల్లలు లేరు. రెండుసార్లు అబార్షన్ కావడం, గర్భం వచ్చిన నాలుగు నెలలకే ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లడం, మళ్లీ గర్భం రాకపోవడంతో ఇక తనకు పిల్లలు పుట్టరనే అభిప్రాయానికి వచ్చింది. బహుశా పిల్లలు పుట్టని కారణంగా ఇంట్లో వివక్షను కూడా ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఆరు నెలల కిందట ఇంట్లో వాళ్లతో తనకు గర్భం వచ్చిందని చెప్పిందట. పొట్ట ఎత్తుగా చేసుకుంటూ... భర్తకు దూరంగా సోదరులు, సోదరి దగ్గర ఎక్కువ కాలం గడుపుతూ వచ్చింది. బిడ్డను అపహరించి తనకే పుట్టినట్లు బీదర్‌లోని తల్లిని, సోదరులను నమ్మించడానికి ప్రయత్నించింది. పాపాయిని చాలా ప్రేమగా చూసుకుంది కూడా. దుస్తులు కొన్నది, పాల సీసాలు, పాలు... ఇతర అవసరమైనవన్నీ కొన్నది. టైమ్‌కి పాలు పట్టి, తన ఒడిలోనే నిద్రపుచ్చింది. వరండాలో దీనంగా... ఆమె చదువుకున్న మహిళ. డీఎడ్ చేసి టీచర్‌గా ఉద్యోగం చేసింది. టెన్త్ క్లాస్‌లో ఉండగా బీదర్‌లోనే పెళ్లి జరిగింది. కొద్ది నెలల్లోనే భర్త పోవడంతో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో మళ్లీ పెళ్లయింది. పిల్లలు పుట్టకపోవడంతో బెంగ పెట్టుకుంది. చాలా రోజుల్నుంచి ఆమె రోజూ కోఠీ మెటర్నిటీ హాస్పిటల్‌కొచ్చి వరండాలో దిగాలుగా కూర్చుని ఉండేదని అక్కడి వాళ్లు ఇప్పుడు చెబుతున్నారు. పాపాయిని ఎత్తుకెళ్లిన సంగతి టీవీల్లో వస్తుండటంతో భయపడిపోయి హాస్పిటల్లో వదిలేసి వెళ్లిపోయింది. ఎందుకిలా చేశావని అడిగినప్పుడు ‘తప్పయిపోయింది’ అని తలదించుకుంది. ఆమె పరిస్థితి చూస్తే జాలేసింది. కానీ ఆమె చేసింది నేరమే. ఏ కారణంగా చేసినా తప్పు తప్పే. కాబట్టి విచారణ కొనసాగుతుంది. ఇదే తొలికేసు ఏసీపీగా చార్జ్ తీసుకున్న తర్వాత నేను డీల్ చేసిన తొలికేసు ఇదే. పాపాయిని క్షేమంగా తల్లి ఒడికి చేర్చడం గొప్ప అనుభూతి, అయితే ఈ విజయం, ఘనత అంతా నాదేనన్నట్లు మీడియా ప్రశంసిస్తుంటే కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఇది నా ఉద్యోగం, నా విధిని నేను నిర్వర్తించాను. ఇక రెండవది... ఇది నా ఒక్కదాని వల్ల వచ్చిన విజయం కాదు, సమష్టి కృషి. మా పోలీసులతోపాటు టెక్నాలజీకి కూడా సమభాగస్వామ్యం ఉంది. ‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు’ అని శ్రీశ్రీ సంధించిన ప్రశ్న కూడా గుర్తుకు వస్తోంది. తాజ్‌మహల్ సౌందర్యాన్ని ప్రశంసించడం కాదు, దాని నిర్మాణంలో చెమటోడ్చిన శ్రామికులకు వందనం చేయాలని నమ్ముతాను. ఈ పాపాయి టాస్క్ కూడా అంతే. మా టీమ్ ఎంత చురుగ్గా పని చేసిందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ పాపాయి అపహరణ కేసు. ఈ కేస్ నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషాన్నిచ్చిన మాట నిజమే. కానీ, చేతన ఘనత అన్నట్లు కాకూడదు. పాపాయిని రక్షించి తెచ్చాననే కృతజ్ఞతతో ఆ తల్లి బిడ్డకు నా పేరు పెట్టుకుంది. నిజమైన ఆనందం అది. ఆ క్షణంలో నాకు శ్రీశ్రీ ‘మరో ప్రపంచం’ కనిపించింది’’. అమ్మ స్ట్రిక్టు... నాన్న సాఫ్ట్! పుస్తకాలు చదవడం నా హాబీ. జిడ్డు కృష్ణమూర్తి తత్వాన్ని పూర్తిగా చదివాను. ప్రకృతిని ప్రేమించడం, మానవ సంబంధాలలోని సున్నితమైన, అందమైన బంధాన్ని ఆస్వాదించడం ఇష్టం. మా మీద నాన్న ప్రభావం ఎక్కువే కానీ, నిజానికి నన్ను, తమ్ముడిని పెంచడంలో పెద్ద పాత్ర అమ్మది. నాన్న ఎప్పుడూ బిజీగా ఉండేవారు. అమ్మ చాలా స్ట్రిక్టు. నాన్నది మృదుస్వభావం. మార్కులు తక్కువ వచ్చినప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టును చాటుగా నాన్నకు చూపించేవాళ్లం. నాన్న కూడా అమ్మకు తెలియకుండా సంతకం చేసి, గండం గట్టెక్కించేవాళ్లు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం అనే రోల్ అమ్మ తీసుకుంటే, వ్యక్తిత్వ వికాసంలో నాన్న రోల్ పెద్దది. సామాజికాంశాల పట్ల ఆసక్తి పెరగడానికి కారణం మా నాన్న పెంపకమే. ఆయన జర్నలిస్ట్ కావడంతో ఇంట్లో... నిత్యం నేర్చుకునే వాతావరణమే ఉండేది. ఆ ప్రభావంతోనే నేను పత్రికల్లో కాలమ్ రాయగలిగాను. ఆ వ్యాసాలను ‘అల’ పేరుతో సంకలనం వేశారు నాన్న. – డాక్టర్ చేతన మైలాబత్తుల, ఏసీపీ, సుల్తాన్‌బజార్, హైదరాబాద్ -
ఏసీబీ చేతనతో స్పెషల్ ఇంటర్వ్యూ
-
చేతన.. ఇక పోలీసు ‘పాఠం’!
సాక్షి, హైదరాబాద్: చిన్నారి చేతన కిడ్నాప్ ఉదంతాన్ని పోలీసు పాఠ్యాంశంగా చేర్చాలని నగర పోలీసు విభాగం ప్రతిపాదించింది. ఈ కేస్ స్టడీని తెలంగాణ పోలీసు అకాడమీ(టీఎస్పీఏ)తోపాటు నేషనల్ పోలీసు అకాడమీ(ఎన్పీఏ)కి పంపాలని నిర్ణయించారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి నుంచి చిన్నారిని నైన రాణి అనే మహిళ సోమవారం ఉదయం 11 గంటలకు కిడ్నాప్ చేయగా పోలీసులు రంగంలోకి దిగి 48 గంటల్లోగా కేసును ఛేదించి చిన్నారిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో జరిగిన ఈ ఆపరేషన్‌లో అధికారుల స్పందన, సమన్వయం తదితరాలతో ఈ పాఠ్యాంశం రూపొందనుంది. చిన్నారిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు, కీలక ఆధారాలు అందించిన సీసీ కెమెరాలు, దర్యాప్తు అధికారులు అనుసరించిన విధానం తదితరాలతో సమగ్ర నివేదికను రూపొందించనున్నారు. ఇందులో నిపుణుల సాయంతో మార్పులు, చేర్పులు చేయించి పాఠ్యాంశంగా మారుస్తారు. పోలీసుల స్పందనతో స్ఫూర్తి పొందిన చిన్నారి తల్లి విజయ తన కుమార్తెకు సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతన పేరు పెడుతున్నట్లు ప్రకటించడాన్నీ ఈ పాఠ్యాంశంలో చేర్చనున్నారు. చిన్నారి చేతన కేసు పోలీసుల పనితీరుకు మాత్రమే కాకుండా బాధితుల విషయంలో సత్వరంగా, సరైన సమయంలో స్పందించి ఫలితాలు సాధిస్తే పోలీసులపై ఏర్పడే అభిప్రాయానికీ నిదర్శనమని అధికారులు చెప్తున్నారు. దీన్ని టీఎస్‌పీఏలో ఓ కేస్ స్టడీగా ప్రవేశపెట్టాల్సిందిగా డీజీపీకి లేఖ రాయనున్నారు. ఆయన అనుమతితో టీఎస్‌పీఏతోపాటు జిల్లాల్లోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లలోనూ ప్రవేశపెట్టే దీన్ని శిక్షణ, మధ్యంతర శిక్షణల్లో ఉండే కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు అభ్యసిస్తారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసి అనుమతి పొందితే ఐపీఎస్ అధికారులు శిక్షణ తీసుకునే శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలోనూ చేతన కేసు పాఠ్యాంశంగా మారుతుంది. చిన్నారి ఆచూకీ కోసం హైదరాబాద్, బీదర్ పోలీసులు సమన్వయంతో పనిచేయడంతోపాటు ఉమ్మడిగా కార్డన్ సెర్చ్‌లు నిర్వహించిన విషయం విదితమే. 68 గంటల్లో అరెస్టు... 32 గంటల్లో బెయిల్ చిన్నారి చేతనను కిడ్నాప్ చేసిన నైన రాణికి నాంపల్లి న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. శిశువును కిడ్నాప్ చేసిన తర్వాత ఈమెను పట్టుకోవడానికి 68 గంటల సమయం పట్టింది. అయితే, అరెస్టు చేసిన 32 గంటల్లోనే నిందితురాలికి బెయిల్ లభించడం గమనార్హం. దీనిపై సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ పి.శివశంకర్‌రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘నైన రాణి శిశువును పెంచుకోవడానికి మాత్రమే కిడ్నాప్ చేసింది. ఈ విషయంతోపాటు ఉదంతం పూర్వాపరాలను న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాం. ఈ నేపథ్యంలోనే ఆమెకు బెయిల్ మంజూరైంది. ఈ కేసుకు సంబంధించి నేర నిరూపణలో కీలకమైన టెస్ట్ ఐడెంటిఫికేషన్(టీఐడీ) పరేడ్ నిర్వహించాల్సి ఉంది. దీనికోసం ఈమె బెయిల్ రద్దు చేయాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం’అని అన్నారు. -
పసికందును కిడ్నాప్ చేసిన మహిళ అరెస్ట్
-
చిన్నారి.. చేతన
సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి నుంచి కిడ్నాపైన తన బిడ్డను తిరిగి తన ఒడికి చేర్చడంలో కీలకపాత్ర పోషించిన ఏసీపీ చేతన పేరునే ఆ చిన్నారికి పెడుతున్నట్లు తల్లి సబావత్ విజయ ప్రకటించారు. తమకు దైర్యం చెప్పడానికి ఆస్పత్రికి వచ్చిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు ఈ విషయం తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ చిన్నారిని సైతం చేతన లాంటి అధికారిగా చేయాలని విజయ నుంచి మాట తీసుకున్నారు. బాలికల విద్యాశాతాన్ని పెంచడానికి ఇదో ఉత్తమ కేస్‌స్టడీగా మారాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం ఆస్పత్రికి వెళ్లిన అంజనీకుమార్ శిశువు తల్లికి పుష్పగుచ్ఛం అందించారు. బీదర్‌కు చెందిన మహిళగానే అనుమానం... చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ బీదర్‌వాసి అని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువును తీసుకొని ఎంజీబీఎస్ నుంచి బస్సులో వెళ్లిన ఆమె బీదర్ బస్టాండ్‌లో కాకుండా కాస్త ముందున్న నయాకమాన్ స్టాప్‌లో దిగింది. ఇలా కేవలం స్థానికులు మాత్రమే చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. సోమవారం సైతం విజయ బిడ్డ కంటే ముందు మరో ఇద్దరు చిన్నారుల్ని ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నించి విఫలమైనట్లు బయటపడింది. మీడియాలో హడావుడి, పోలీసుల గాలింపు నేపథ్యంలో భయపడిపోయి బుధవారం సాయంత్రం బీదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువును వదిలివెళ్లింది. పోలీసులు బీదర్‌లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారి కిడ్నాప్‌నకు గురైన సోమవారంరాత్రి డ్యూటీ అధికారిణిగా ఏసీపీ చేతన ఉన్నారు. దీంతో కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయానికి ఆపరేషన్ బీదర్‌కు మారడంతో డీసీపీ ఎం.రమేశ్ అనుమతి తీసుకుని అక్కడకు వెళ్లి పర్యవేక్షించారు. సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ పి.శివశంకర్‌రావు తన డ్రైవర్‌ను ఇచ్చి బీదర్‌కు అంబులెన్స్ పంపారు. ఏసీపీ చేతన గురువారం తెల్లవారుజామున చిన్నారిని తీసుకువచ్చి తల్లిఒడికి చేర్చారు. త్వరలో భద్రతాచర్యలకు సిఫారసులు.. ఆస్పత్రులు తీసుకోవాల్సిన భద్రతాచర్యల్ని నిర్దేశించడానికి అధ్యయనం చేస్తున్నట్లు కొత్వాల్ అంజనీకుమార్ తెలిపారు. ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేశ్, సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ చేతన వీటిపై రెండు, మూడు రోజుల్లో ఖరారు చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. చిన్నారికి తన పేరు పెట్టడం ఆనందంగా, గర్వంగా ఉందని చేతన అన్నారు. చిన్నారికి కామెర్ల లక్షణాలు కనిపించాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తామంటూ కుటుం బీకులు వైద్యుల్ని కోరినా కమిషనర్ వస్తున్నారంటూ వారు తరలించడానికి అంగీకరించలేదు. దీంతో చిన్నారి తండ్రి నారీ బయటకు వచ్చి పోలీసులతో పాటు మీడియాపై అసహనం ప్రదర్శిస్తూ చిన్నారి విషయం చెప్పారు. దీంతో స్పందించిన ఆస్పత్రి వర్గాలు చిన్నారిని బంధువుల సంరక్షణలో అంబులెన్స్‌లో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
తెరపైకి మరో వారసురాలు
టాలీవుడ్ లో మరో వారసురాలు వెండి తెరపైన కనిపించేందుకు రెడీ అవుతోంది. కమెడియన్, రచయిత ఉత్తేజ్ కుమార్తె చేతన హీరోయిన్ గా తెరంగ్రేటం చేస్తోంది. రెండో సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. టీనేజీ లవ్ స్టోరీ 'పిచ్చిగా నచ్చావ్', హర్రర్ మూవీ 'షీ'లో నటిస్తున్నట్టు చేతన తెలిపింది. బాలనటిగా పలు సినిమాల్లో ఆమె నటించింది. 'చిత్రం' సినిమాలో కుక్కపిల్ల కావాలని సందడి చేసింది చేతనే. 'బద్రీ', భద్రాచలం సినిమాల్లోనూ బాలనటిగా చేసింది. హీరోయిన్ కావాలని ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్నని చేతన తెలిపింది. ఆమె కూచిపూడి కూడా నేర్చుకుంది. 'నటిని కావాలనుకుంటున్నానని ఇంటర్మీడియట్ లో నాన్నను చెప్పా. ఆయన నో అని చెప్పలేదు కానీ ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంద'ని చెప్పినట్టు వెల్లడించింది. టాలీవుడ్ లో వారసురాళ్ల తెరగ్రేటం క్రమంగా పెరుగుతోంది. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా నటించింది. హీరో రాజశేఖర్ కుమార్తె శివాని కూడా వెండితెరపై కనిపించనుందని ప్రచారం జరుగుతోంది.