Baby kidnapped
-
రెండు గంటల్లో ఛేదించారు
చిన్నారి అపహరణకు గురైందని ఫిర్యాదు వచ్చిన వెంటనే విజయవాడ నగర పోలీసులు వేగంగా స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో నిందితుడి ఆచూకి తెలుసుకున్నారు. నిందితుడిని తమదైన శైలిలో ప్రశ్నించారు. రెండు నెలల ఆరు రోజుల చిన్నారి దేవికా వెంకట ధాత్రిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. సాక్షి, అమరావతి : చిన్నారి అపహరణకు గురైందని ఫిర్యాదు వచ్చిన వెంటనే విజయవాడ నగర పోలీసులు వేగంగా స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో నిందితుడి ఆచూకీ తెలుసుకున్నారు. నిందితుడిని తమదైన శైలిలో ప్రశ్నించారు. రెండు నెలల ఆరు రోజుల చిన్నారి దేవికా వెంకట ధాత్రిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులోని మాదు తిరుపతిరావు నగర్లో చల్లా అమర్నాథ్, చల్లా కమలకుమారి దంపతులు నివసిస్తున్నారు. అమర్నాథ్ గుంటూరులోని సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ప్లేస్మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జూలై 27న కమలకుమారి పాపకు జన్మనిచ్చింది. చిన్నారికి దేవికా వెంకట ధాత్రిగా పేరు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన కుమార్తెను తన పెద్దనాన్న కుమారుడైన కుడిపుడి అఖిల్‌కు అప్పగించి స్నానం చేయడానికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి పాప, అఖిల్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కలా గాలించారు. అయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో 5 గంటల సమయంలో పెనమలూరు పోలీసుస్టేషన్లో పాప కనిపించలేదని ఫిర్యాదు చేశారు. రెండు గంటల్లో కనిపెట్టారు.. విషయం తెలిసిన వెంటనే నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు డీసీపీ–1 హర్షవర్థన్ నేతృత్వంలో సెంట్రల్‌జోన్ ఏసీపీ నాగరాజురెడ్డి, పెనమలూరు సీఐ ఆధ్వర్యంలో నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించారు. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీల ఫుటేజీలను పరిశీలించగా.. యనమలకుదరు కొండవెనుక ఉన్న సాయిబాబా దేవాలయానికి చెందిన సీసీ టీవీ ఫుటేజీలో కుడిపుడి అఖిల్ ఒక బ్యాగు తీసుకుని వెళ్తున్నట్లుగా గుర్తించారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 7 గంటల సమయంలో పెనమలూరులో నిందితుడిని గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా కిడ్నాప్ వివరాలు వెల్లడించాడు. అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోగా.. తన బ్యాంకు అకౌంట్ ఉన్న డబ్బును సైతం తల్లి డ్రా చేసుకోనివవ్వడం లేదనే కారణంతో పాపను కిడ్నాప్ చేసినట్లు అంగీకరించాడు. బ్యాగ్‌లో పెట్టి.. పొలాల్లో వదిలేసి.. కుటుంబసభ్యులపై ఉన్న కోపంతో తన మేనకోడలిని కిడ్నాప్ చేసిన కుడిపుడి అఖిల్ పాపను ఒక బ్యాగ్‌లో దాచిపెట్టి సైకిల్‌పై తన తండ్రి కుడిపుడి ఏడుకొండలతో కలిసి పెదపులిపాక వైపు తీసికెళ్లాడు. సుమారు 6 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత పాపను బ్యాగ్‌లో నుంచి బయటకు తీసి సమీప పొలాల్లో వదిలేసి అక్కడి నుంచి వెనక్కి ఇంటికి వచ్చేశాడు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో అఖిల్ ఇంటికి తిరిగా రాగా, తండ్రి ఏడుకొండలు ఆచూకీ తెలియలేదు. దీంతో కమలకుమారి పాప గురించి ప్రశ్నించగా నాకు తెలియదని చెప్పడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు విచారించి పాపను విడిచిపెట్టిన ప్రాంతం వివరాలు వెల్లడించడంతో పోలీసులు వెంటనే పెదపులిపాక ప్రాంతానికి చేరుకుని పాపను రక్షించారు. పోలీసులు వెళ్లిన సమయానికి పాప ధాత్రి ఆడుకుంటూ కనిపించింది. దాదాపు రెండు గంటలపాటు ఒంటిరిగా ఉన్న చిన్నారిపై ఏదైనా జంతువుకానీ, కుక్కలు వంటికానీ దాడి చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే పాపను చికిత్స నిమిత్తం పాత ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. రెండు గంటల్లో చిన్నారి ఆచూకీని కనిపెట్టిన పోలీసులను కమిషనర్ అభినందించారు. -
బాలుడి కిడ్నాప్ సుఖాంతం
కామారెడ్డి క్రైం: ఆటోలో పడుకోబెట్టిన రెండేళ్ళ బాలుడు అకస్మాత్తుగా కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని 16 గంటల్లోనే చేదించారు. కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకుని బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతం అయింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్‌పాల్, కిరణ్‌పాల్ దంపతులు కొంత కాలం గా కామారెడ్డిలో నివాసం ఉంటూ వీక్లీ మార్కెట్ లోని రాజరాజేశ్వరీ ఆలయం వద్ద జ్యూస్ బండి నడిపిస్తున్నారు. వారికి హర్షిత్‌పాల్ అనే రెండేళ్ళ కుమారుడు ఉన్నాడు. రోజూ మాదిరిగానే గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జ్యూస్ బండి వద్ద పనులు చేసుకుంటుండగా హర్షిత్‌పాల్ నిద్రపోయాడు. తల్లిదండ్రులు బాలుడిని జ్యూస్ బండి వెనుక పార్కింగ్ చేసి ఉంచిన ఓ ఆటోలో పడుకోబెట్టారు. కొద్ది సేపటి తర్వాత చూస్తే బాలుడు కన్పించలేదు. చుట్టుపక్కల గాలించినా కన్పించకపోవడంతో ఆందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పట్టణ ఎస్హెచ్ఓ రామకృష్ణ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడిన పోలీసులు పట్టణంలో రాత్రంతా విస్తృతంగా గాలించారు. వీక్లీ మార్కెట్ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. పట్టించిన మూడో కన్ను.. కేసు ఛేదనలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోశించాయి. తల్లిదండ్రులు వ్యాపారం పనులు చేసుకుంటూ ఉండగా ఓ మహిళ బాలుడిని ఎత్తుకెళ్లినట్లు సీసీ పుటేజీల్లో కన్పించింది. సదరు మహిళ అతడిని ఎటువైపు తీసుకుని వెళ్లింది. మహిళా కిడ్నాపర్ ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించి జరిపారు. శుక్రవారం ఉదయం ఓ కల్లు దుకాణం వద్ద అనుమానాస్పదంగా ఓ మహిళ ఉందనే సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మహిళా కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సొమ్ము చేసుకునేందుకే.. బాలుడి కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి రావడం శుక్రవారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. మహిళా కిడ్నాపర్‌ను పట్టణంలోని బతుకమ్మకుంట కాలనీకి చెందిన దండ్ల గంగమ్మగా గుర్తించారు. ఆమె భర్తతో విడిపోయి కొంతకాలంగా ఒంటరిగా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. బాలు డిని ఎక్కడైనా విక్రయించి సొమ్ముచేసుకోవాలనే ఉద్దేశంతోనే కిడ్నాప్‌నకు ఒడిగట్టిందన్నారు. సదరు మహిళను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. కేసు ఛేదనలో 16 గంటలపాటు శ్రమించి బాలుడి ఆచూకీ కనుగొన్న ఎస్హెచ్ఓ రామకృష్ణ, ఎస్ఐ గోవింద్, ఏఎస్ఐ నరేందర్, సిబ్బంది రవి, సాయిబాబా, నీలేష్, పవన్, శ్రావన్, రాములును అభినందించారు. అంతేగాకుండా కేసు ఛేదనలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోశించాయన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎనిమిది రోజుల శిశువు అపహరణ
సంగారెడ్డి టౌన్: ఎనిమిది రోజుల శిశువును ఓ గుర్తు తెలియని మహిళ అపహరించిన ఘటన కలకలం సృష్టించింది. మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఎంసీహెచ్ (మాతా శిశు సంరక్షణ కేంద్రం)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి లోపల, బయట సీసీ కెమెరాలు, 24 గంటల పాటు సెక్యూరిటీ ఉన్నా శిశువును అపహరించారు. సంగారెడ్డి మండలం కల్పగూర్‌కి చెందిన హన్మోజిగారి మల్లేశం భార్య మాధవి గత నెల 29న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 4 రోజుల క్రితం శిశువుకు కామెర్లు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఉదయం 9 గంటలకు గుర్తు తెలియని ఓ మహిళ ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూలోకి ప్రవేశించింది. అక్కడున్న వనిత అనే ఆయా నిర్లక్ష్యంతో ఆ గుర్తు తెలియని మహిళను మల్లేశం కుటుంబసభ్యులని భావించి శిశువును ఆమెకు అప్పగించింది. అనంతరం శిశువును తమకు ఇవ్వలేదని ఆందోళన చెందిన మాధవి ఆయాను ప్రశ్నించగా తాము సరైన వ్యక్తికి అప్పగించామని వారు చెప్పారు. ఆ శిశువు తల్లిదండ్రుల పేర్లు మల్లేశం, మాధవి అని ఒకసారి, మీ శిశువు లోపల ఉంది ఇస్తున్నామని మరోసారి చెప్పి తాత్సారం చేసింది. గంట గడిచినా శిశువును అప్పగించకపోవడంతో అనుమానం వచ్చి ప్రశ్నించగా అసలు విష యం బయటకు వచ్చింది. గుర్తు తెలియని మహిళ శిశువును తీసుకొని బయటకు వెళ్లినట్లు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. శిశువు కిడ్నాప్ ఘటన తెలుసుకున్న మాధవి కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ పగలగొట్టారు. సంగారెడ్డి డీఎస్పీ పి.శ్రీధర్‌రెడ్డి, టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆస్పత్రి, మెటర్నిటీ వార్డులోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసు విషయమై ఆయా వనిత పాత్ర గురించి ఆరా తీస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
శిశువు కిడ్నాప్‌లో ట్విస్ట్
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. నార్నూర్ మండలం చోరపల్లి గ్రామానికి చెందిన దంపతులు దిరబసి గణేశ్, మమతకు పుట్టిన మగ శిశువును కిడ్పాప్ చేయగా పోలీసులు రెండు గంటల్లోనే కేసు ఛేదించి శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే రిమ్స్ నుంచి శిశువును అపహరించిన నిందితురాలు పుష్పలత తనకు పిల్లలు కావడం లేదని.. అందుకే తీసుకెళ్లినట్లు ఆ రోజు పోలీసులకు చెప్పింది. అయితే ఇప్పుడు అసలు విషయం బయటపడింది. నిందితురాలు పుష్పలతకు పిల్లలు కావడం లేదనేది అబద్దమని.. ఆమె అప్పటికే ఏడు నెలల గర్భవతి అని పోలీసుల విచారణలో తేలింది. మరీ శిశువును ఎందుకు ఎత్తుకెళ్లిందనే దానిపై ఆరా తీయగా అమ్ముకునేందుకే తీసుకెళ్తున్నట్లు చెప్పిందని పోలీసులు తెలిపారు. రూ.50 వేలకు విక్రయించేది రిమ్స్ నుంచి శిశువును కిడ్నాప్ చేసిన నిందితులు జీపులో నిర్మల్ వైపు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే పిల్లలు లేరన్న నిందితులు శిశువును ఇతర ప్రాంతాలకు ఎందుకు తీసుకెళ్తున్నారో అనే దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే నిందితులు పుష్పలత, నగేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేశారు. శిశువును ఇంటికి తీసుకెళ్లగుండా నిర్మల్ వైపు ఎందుకు తీసుకెళ్లారని ఆరా తీయడంతో అసలు విషయం చెప్పారు. నిర్మల్‌లో ఉన్న తమ మేనత్తకు పిల్లలు లేరని, వారికి శిశువును ఇచ్చేసి రూ.50 వేలు తీసుకుందామని నిర్ణయించినట్లు నిందితురాలు చెప్పిందని ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు. గతంలో వీరు రిమ్స్ ఆస్పత్రిలో పనిచేసిన అనుభవం ఉండడంతో శిశువును దత్తతకు తీసుకునేందుకు ఎవరైనా ఉంటే చెప్పండని, వారికి డబ్బులు కూడా ఇద్దామని మేనత్త చెప్పినట్లు వెల్లడించారు. కిడ్నాప్ చేసి తీసుకొస్తున్న విషయం వారి మేనత్తకు కూడా తెలియకపోవడం గమనార్హం. అక్కడికి వెళ్లిన తర్వాత డబ్బులు తీసుకొని ఏదో ఒకటి చెబుతామని వీరు భావించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. స్కానింగ్‌తో బయటపడ్డ వైనం.. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత నిందితులను వైద్య పరీక్షలు చేసి జిల్లా జైలుకు తరలిస్తారు. ఈ క్రమంలోనే సదరు నిందితురాలికి వైద్య పరీక్షలు, స్కానింగ్ చేయడంతో ఆమె గర్భవతిగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం జైలుకు తరలించారు. జైల్లో సైతం రక్త పరీక్షలు, తదితర పరీక్షలు చేయించి రిపోర్టులు తీయించారు. కాగా సదరు నిందితురాలు శుక్రవారం రాత్రి బ్లీడింగ్ అవుతుందని తెలయడంతో రిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు, స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులో శిశువు మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో అబార్షన్ చేసి శిశువును బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించి పంచనామా చేశారు. ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలోని ఎంఐసీయూ వార్డులో ఆమె చికిత్స పొందుతోంది. ఆమెకు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. విక్రయించేందుకే కిడ్నాప్ చేశారు రిమ్స్‌లో శిశువును కిడ్నాప్‌చేసిన నిందితులు మొదట్లో పిల్లలు లేరని చెప్పారు. కానీ పోలీసులు మరోకోణంలో విచారణ చేపట్టగా వారు శిశువును విక్రయించేందుకే అపహరించినట్లు తేలింది. ఆమె తరపు బంధువులకు రూ.50 వేలకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది. ముందుగా చెప్పినట్లు పిల్లలు కావడం లేదన్న నిందితురాలు అప్పటికే ప్రెగ్నెంట్ ఉన్నట్లు తేలింది. శుక్రవారం కడుపులో శిశువు మృతి చెందడంతో వైద్యులు అబర్షన్ కూడా చేశారు. – నర్సింహారెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
పసికందును కిడ్నాప్ చేసిన మహిళ అరెస్ట్
-
చిన్నారి.. చేతన
సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి నుంచి కిడ్నాపైన తన బిడ్డను తిరిగి తన ఒడికి చేర్చడంలో కీలకపాత్ర పోషించిన ఏసీపీ చేతన పేరునే ఆ చిన్నారికి పెడుతున్నట్లు తల్లి సబావత్ విజయ ప్రకటించారు. తమకు దైర్యం చెప్పడానికి ఆస్పత్రికి వచ్చిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు ఈ విషయం తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ చిన్నారిని సైతం చేతన లాంటి అధికారిగా చేయాలని విజయ నుంచి మాట తీసుకున్నారు. బాలికల విద్యాశాతాన్ని పెంచడానికి ఇదో ఉత్తమ కేస్‌స్టడీగా మారాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం ఆస్పత్రికి వెళ్లిన అంజనీకుమార్ శిశువు తల్లికి పుష్పగుచ్ఛం అందించారు. బీదర్‌కు చెందిన మహిళగానే అనుమానం... చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ బీదర్‌వాసి అని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువును తీసుకొని ఎంజీబీఎస్ నుంచి బస్సులో వెళ్లిన ఆమె బీదర్ బస్టాండ్‌లో కాకుండా కాస్త ముందున్న నయాకమాన్ స్టాప్‌లో దిగింది. ఇలా కేవలం స్థానికులు మాత్రమే చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. సోమవారం సైతం విజయ బిడ్డ కంటే ముందు మరో ఇద్దరు చిన్నారుల్ని ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నించి విఫలమైనట్లు బయటపడింది. మీడియాలో హడావుడి, పోలీసుల గాలింపు నేపథ్యంలో భయపడిపోయి బుధవారం సాయంత్రం బీదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువును వదిలివెళ్లింది. పోలీసులు బీదర్‌లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారి కిడ్నాప్‌నకు గురైన సోమవారంరాత్రి డ్యూటీ అధికారిణిగా ఏసీపీ చేతన ఉన్నారు. దీంతో కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయానికి ఆపరేషన్ బీదర్‌కు మారడంతో డీసీపీ ఎం.రమేశ్ అనుమతి తీసుకుని అక్కడకు వెళ్లి పర్యవేక్షించారు. సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ పి.శివశంకర్‌రావు తన డ్రైవర్‌ను ఇచ్చి బీదర్‌కు అంబులెన్స్ పంపారు. ఏసీపీ చేతన గురువారం తెల్లవారుజామున చిన్నారిని తీసుకువచ్చి తల్లిఒడికి చేర్చారు. త్వరలో భద్రతాచర్యలకు సిఫారసులు.. ఆస్పత్రులు తీసుకోవాల్సిన భద్రతాచర్యల్ని నిర్దేశించడానికి అధ్యయనం చేస్తున్నట్లు కొత్వాల్ అంజనీకుమార్ తెలిపారు. ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేశ్, సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ చేతన వీటిపై రెండు, మూడు రోజుల్లో ఖరారు చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. చిన్నారికి తన పేరు పెట్టడం ఆనందంగా, గర్వంగా ఉందని చేతన అన్నారు. చిన్నారికి కామెర్ల లక్షణాలు కనిపించాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తామంటూ కుటుం బీకులు వైద్యుల్ని కోరినా కమిషనర్ వస్తున్నారంటూ వారు తరలించడానికి అంగీకరించలేదు. దీంతో చిన్నారి తండ్రి నారీ బయటకు వచ్చి పోలీసులతో పాటు మీడియాపై అసహనం ప్రదర్శిస్తూ చిన్నారి విషయం చెప్పారు. దీంతో స్పందించిన ఆస్పత్రి వర్గాలు చిన్నారిని బంధువుల సంరక్షణలో అంబులెన్స్‌లో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
కాకికాడలో శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతం
సాక్షి, కాకినాడ : మూడు రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన శిశువు ఉదంతం సుఖాంతమైంది. అపహరణకు గురైన బుజ్జాయి ఆచూకీని పోలీసులు గుర్తించారు. శిశువును అపహరించిన మహిళను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆ శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా మూడు రోజుల క్రితం ముఖానికి ముసుగు ధరించి వచ్చిన ఓ మహిళ ... ప్రసూతి ఆస్పతి వార్డులో ఉన్న గంటా లక్ష్మి అనే మహిళ అనే బాలింత నుంచి ఒక్కరోజు వయస్సు ఉన్న ఆడశిశువును వ్యాక్సిన్ కోసమని నమ్మబలికి వెంట తీసుకు వెళ్లింది. చిన్నారి అమ్మమ్మ వెళ్లినా.. ఆమె కళ్లుగప్పి..శిశువును ఆగంతకురాలు అపహరించింది. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా పోలీసులు ఐ.పోలవరం మండలం ఎర్రగరువు గ్రామానికి చెందిన పండు రమణ అనే అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుండి శిశివును తీసుకుని తల్లి లక్ష్మీకి అందజేశారు. నిందితురాలు గతంలో కాకినాడలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేసిందని...అయితే ఆరు నెలల క్రిందట ఆమెకు అబార్షన్ కావడంతో పిల్లలపై మమకారంతో కిడ్నాప్‌కు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. -
ఐదు నెలల చిన్నారి కిడ్నాప్
రంగారెడ్డి, శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : రక్తం పంచుకు పుట్టిన ఆ చిన్నారి తల్లిదండ్రులకు భారమైంది.. పుట్టిన 10 రోజులకే పరాయి మహిళ ఒడికి చేరింది.. అక్కడి నుంచి మరో తల్లి ఒడికి.. ఈ క్రమంలోనే ఓ మహిళ ఆ చిన్నారిని తీసుకొని ఓ వ్యక్తితో కలిసి పరారైంది.. రెండు రోజులుగా పోలీసులు చిన్నారి జాడ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మహేశ్వరం మండలం నాగారం పంచాయతీ అనుబంధ గ్రామం పెద్దతండాకు చెందిన కేతావత్ మోహన్, జ్యోతి దంపతులకు మే 24న కూతురు పుట్టింది. కూలి పని చేసుకునే ఈ దంపతులకు అప్పటికే ఓ కూతురు ఉండగా.. రెండో సారి పుట్టిన కూతురును పోషించే స్తోమత, ఆసక్తి లేకుండా పోయాయి. ఈ క్రమంలో జ్యోతి తండ్రి హన్మ కూరగాయలు అమ్మడానికి శంషాబాద్ మార్కెట్‌కు వచ్చే తరుణంలో అక్కడ కూరగాయాల వ్యాపారం చేసే చారి నగర్ వాసి రాణితో పరిచయం ఏర్పడింది. తన కూతురు జ్యోతికి పుట్టిన చిన్నారిని ఎవరైనా పెంచుకుంటే ఇచ్చేస్తామని చెప్పాడు. దీంతో పది రోజులకు ఆ చిన్నారిని రాణికి ఇచ్చేశారు. ఇదిలా ఉండగా.. పట్టణంలోని కాపుగడ్డ బస్తీలో నివాసముండే రాణి అమ్మగారి ఇంటి పక్కన పద్మ అనే మహిళ అమ్మగారు ఇల్లు ఉంది. మొయినాబాద్ మండలం అమ్డాపూర్‌లో నివాసముండే పద్మకు పిల్లలు లేరు. దీంతో ఈ చిన్నారిని పెంచుకుంటానని చెప్పడంతో రాణి ఆ పాపను వారికి ఇచ్చేసింది. కాపుగడ్డలోనే తల్లిగారింటి వద్ద ఉంటూ నెల రోజుల పాటు పద్మ ఆ చిన్నారి ఆలనా పాలనా చూసుకుంది. అయితే పద్మ ఆరోగ్యం, మానసిక ప్రవర్తన బాగా లేకపోవడంతో చిన్నారిని సాకడానికి వీలుకాదని నెల కిందట రాణికి ఇచ్చేశారు. అçప్పటి నుంచి రాణి వద్దనే ఉంటున్న చిన్నారికి షైని అనే పేరు పెట్టి బాగోగులు చూస్తుంది. దసరా పండగ సందర్భంగా రాణి చిన్నారిని తీసుకుని వారం కిందట సిద్దంతిలోని తన అక్క విజయం ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో నందిగామ మండలం మేకగూడలో ఉండే పద్మ చెల్లెలు హంసకు రాణితో ఉన్న పరిచయంతో సెప్టెంబరు 29న సిద్దంతిలోని విజయం ఇంటికి వచ్చింది. పాపకు పండగ కోసం కొత్త దుస్తులు ఇప్పిస్తానని చెప్పగా.. విజయ తన కూతురు హైనాను తోడుగా ఇచ్చి స్కూటీపై పంపించింది. కొద్ది దూరం వెళ్లగానే వర్షం పడుతుండడంతో.. ఇక్కడ రోడ్డుపై అన్ని గుంతలు ఉన్నాయి.. స్కూటీపై వెళ్లడం కష్టం కదా.. నేను పాపను ఎత్తుకుని వస్తాను.. నీవు వెళ్లి షాపు వద్ద నిలబడు అని హంస చెప్పడంతో హైనా వీరిని వదిలేసి షాపు వద్దకు వెళ్లింది. ఎంతకీ హంస షాపు వద్దకు రాకపోవడంతో ఇంటికి వచ్చి విషయం చెప్పింది. వెంటనే వారు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగలు, నగదు మాయం.. చిన్నారితో పరారైన హంస తన అత్తగారింట్లో నుంచి 25 తులాల బంగారు నగలు, రూ.25వేల నగదును తీసుకొన్ని వెళ్లిందని ఆమె భర్త అంజయ్య చెబుతున్నాడు. తన కూతురు పెళ్లి కోసం భూమి అమ్మి నగలు కొన్నామని, దసరా బోనస్‌గా వచ్చిన డబ్బులను ఇంట్లోని అల్మారాలో భద్రపర్చానని చెప్పాడు. తనకు తెలియకుండా భార్య ఇంట్లో నుంచి నగలు, నగదు తీసుకుని వెళ్లిపోయిందని అంజయ్య పోలీసులకు వివరించాడు. మరో వైపు బుద్వేల్‌కు చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తితో కలిసి చిన్నారిని తీసుకుని హంస వెళ్లిపోయినట్లు తెలిసింది. ఫోన్లు స్విచ్ఆఫ్.. చిన్నారిని తీసుకెళ్లిన హంస, చంద్రకాంత్‌ల సెల్ఫోన్లు స్విచ్ఆఫ్ అయిపోయాయి. దీంతో పోలీసులకు వీరి ఆచూకీ కనిపెట్టడం సవాలుగా మారింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని విచారించి కేసు పురోగతి సాధించడానికి పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. -
తల్లికి మత్తు మందు ఇచ్చి పాప కిడ్నాప్
బీబీనగర్: నల్లగొండ జిల్లాలో ఇద్దరు మహిళా కి'లేడీ'లు ఆర్టీసీ బస్సులో చోరీకి పాల్పడటంతో పాటు ఓ పాపను కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ నుంచి భువనగిరికి వెళుతున్న ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి ఆమె దగ్గరున్న నగల బ్యాగును, ఆమె కుమార్తెను అపహరించుకుపోయారు. దీనికి సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు.. హైదరాబాద్‌లోని కొత్తపేటలో నివాసం ఉండే సంతోష(23) వినాయక చవితి సందర్భంగా తన కుమార్తెతో కలసి బుధవారం నల్లగొండ జిల్లా ఆత్మకూరులోని పుట్టింటికి బయలుదేరింది. ఉప్పల్‌లో భువనగిరికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఊరికి వెళుతుండడంతో భద్రత కోసం 8 తులాల బంగారు ఆభరణాలను ఓ బ్యాగులో పెట్టుకుని తన వెంట తీసుకెళ్తోంది. బస్సులో వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు సంతోష కుమార్తెను తమ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు గానీ, బీబీనగర్‌లో సంతోషకు తెలివి వచ్చింది. చూసేసరికి చేతిలో బ్యాగు లేదు, వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు, తన కుమార్తె కనిపించలేదు. బస్సు దిగి బాధితురాలు బీబీనగర్ పోలీసులకు మధ్యాహ్నం సమయంలో ఫిర్యాదు చేశారు. తనకు ఎవరో మత్తు మందు చల్లి బంగారు నగలు, తన కుమార్తెతో ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొంది. మత్తు పూర్తిగా వదలకపోవడంతో ఆమె గందరగోళ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలా తెలియాల్సి ఉంది. -
చార్మినార్ వద్ద చిన్నారి కిడ్నాప్...పోలీసుల వేట
హైదరాబాద్ : పాతబస్తీ చార్మినార్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక బుధవారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైంది. హైకోర్టు ఆరో గేట్ సమీపంలో టీకొట్టు నడుపుకుంటున్న విష్ణు కుమార్తె మోనిక(2)ను ఆగంతకుడు అపహరించుకుని పోయాడు. ఆ విషయాన్ని ఆలస్యంగా గమనించిన విష్ణు... పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజిలను పరిశీలించి... నిందితుడిని పోలీసులు గుర్తించారు. కిడ్నాపైన చిన్నారి మోనికను రక్షించేందుకు పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. -
పసికందు కిడ్నాప్, మహిళల అరెస్ట్
-
పసికందు కిడ్నాప్, మహిళల అరెస్ట్
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఓ పసికందును కిడ్నాప్ చేసి ఇద్దరు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. స్థానిక జయ నర్సింగ్‌హోమ్‌లో వారం రోజుల పసికందును ఇద్దరు మహిళలు అపహరించుకు వెళ్లారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించటంతో వారు రంగంలోకి దిగారు. పోలీసుల అప్రమత్తతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని, పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు. -
ఆప్తురాలిగా వచ్చి.. శిశువు కిడ్నాప్
గాంధీ ఆస్పత్రి/తెనాలి రూరల్, న్యూస్‌లైన్: గాంధీ ఆస్పత్రిలో ఒక రోజు వయస్సు న్న శిశువు అపహరణకు గురయ్యాడు. రంగంలోకి దిగిన నార్త్‌జోన్ పోలీసులు సమయస్ఫూర్తి తో వ్యవహరించి ఏడు గంటల్లోనే కేసును ఛేదిం చారు. తెనాలి పోలీసుల సహకారంతో శిశువును రక్షించడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ ఇన్స్పెక్టర్ బి.అంజయ్య కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన మనోహర్(37), చిత్తూరు జిల్లా పీలేరుకు చెంది న సుమిత్ర (28) ఐదేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకొని, బోరబండ శ్రీరాంనగర్‌లో ఉంటున్నా రు. గర్భవతి అయిన సుమిత్రను ప్రసవం కోసం శనివారం ఆస్పత్రిలో చేర్చగా, ఉదయం 11.36 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చిం ది. కొద్దిసేపటికి వైద్యు లు తల్లీబిడ్డల్ని పోస్ట్ ఆపరేటివ్ వార్డు యూనిట్-5కు తరలించారు. ఆప్తురాలిగా వచ్చి.. అదును చూసి కిడ్నాప్ బాలింతైన సుమిత్రకు సపర్యలు చేసేందుకు మహిళలు లేకపోవడం, మనోహర్‌ను వార్డులోకి రానీయక పోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ స్థితిలో భార్యను చూసిన మనోహర్ లేబర్‌వార్డు వద్ద రోదిస్తూ కూర్చున్నారు. అటుగా వచ్చిన ఓ మహిళ ‘అన్నా ఎందుకు ఏడుస్తున్నావు’ అంటూ ప్రశ్నించింది. విషయం చెప్పడంతో ‘నేనున్నాను’ అంటూ ఓదార్చి అతని చేతిలోని మందులు తీసుకుని సుమిత్ర వద్దకు వెళ్లిన ఆ మహిళ.. తనపేరు మరియమ్మ అలియాస్ కీర్తి (30) అని, మనోహర్ పంపించాడని పరిచయం చేసుకుంది. పూర్తి నమ్మకం కలిగేందుకు కొన్ని సపర్యలు కూడా చేసింది. వార్డులో కలియతిరుగుతూ హడావుడి చేసింది. శనివారం రాత్రంతా సుమిత్ర, శిశువులతో కలిసి ఉన్న ఆమె.. ఆదివారం తెల్లవారుజామున శిశువును తీసుకుని వైద్యుడికి చూపించి తీసుకువస్తానంటూ వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో సుమిత్ర విషయం భర్తకు చెప్పింది. ఆస్పత్రి మొత్తం గాలించినా ఫలితం లేకపోవడంతో మనోహర్ అక్కడి పోలీసు ఔట్‌పోస్టు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. వారి సాయంతో 8.30 గంటలకు చిలకలగూడ ఠాణాకు చేరుకుని ఇన్స్పెక్టర్ అంజయ్యను కలిశారు. సమయస్ఫూర్తితో.. మనోహర్ నుంచి నిందితురాలి వివరాలను సేకరించిన పోలీసులు.. ఇది కచ్చితంగా బయటి వారి పనేనని నిర్ధారణకు వచ్చారు. కిడ్నాప్ తర్వాత నగరం నుంచి పారిపోతారని అంచనాకు వచ్చిన పోలీసులు నార్త్‌జోన్ డీసీపీ జయలక్ష్మికి విషయం తెలిపారు. ఆమె ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు పంపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై వీరబాబు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను పరిశీలించగా, కీలక ఆధారాలు లభించాయి. ఉదయం 6.19 గంటలకు ఓ మహిళ శిశువును ఎత్తుకొని స్టేషన్లోకి ప్రవేశించగా, వెనుక మరో వ్యక్తి టికెట్లతో వచ్చాడు. శిశువుతో ఉన్న మహిళను మనోహర్ గుర్తించాడు. వారిద్దరు 6.27కు రెండో నెంబర్ ప్లాట్‌ఫాం పైకి వచ్చినట్లు రికార్డు అయింది. అ ప్లాట్‌ఫామ్ నుంచి 7.10 గంటలకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వెళ్లడంతో నిందితులు అదే ఎక్కి ఉంటారని అనుమానించారు. తక్షణమే స్పందించిన తెనాలి డీఎస్పీ.. రైలు తెనాలి మీదుగా వెళ్తోందని గుర్తించిన చిల కలగూడ పోలీసులు తెనాలి డీఎస్పీ వై.తులసీరామ్ప్రసాద్ను సంప్రదించి, విషయం వివరిం చారు. గతంలో నగరంలో సుదీర్ఘ కాలం పని చేసిన ప్రసాద్ తక్షణమే స్పందించి, తెనాలి త్రీ టౌన్‌తో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీలను అప్రమత్తం చేసి మొత్తం 30 మందిని ప్లాట్‌ఫాంకు ఇరువైపులా మోహరించారు. మధ్యాహ్నం 1.30కు రైలు తెనాలికి చేరుకోగానే అనువణువూ తనిఖీ చేశారు. డీ-1 బోగీలో ఉన్న నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని శిశువును రెస్క్యూ చేశారు. నిందితులైన కత్తిమండ్ల మేరీ (23), పంబా నవీన్ (18)లను త్రీ టౌన్ ఠాణాకు, శిశువును ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితులది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుగా తేలింది. నవీన్... మేరీ అక్క కుమారుడు. వీరు గతంలోనూ ఇలాంటి నేరాలు చేసినట్లు సమాచారం. అస్వస్థతకు గురైన శిశువును మెరుగైన వైద్యమందించేందుకు గుంటూ రు జిల్లా ఆస్పత్రికి తరలించాలని వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించా రు. 1.9 కిలోల బరువున్న శిశువును అంబులెన్స్‌లో తేవడం ప్రమాదకరమని, తల్లినే గుంటూ రు తరలించాలని భావించారు. అయితే బాలిం తకు రక్తస్రావం ఎక్కువ కావడంతో సోమవా రం గుంటూరు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం బయల్దేరి వెళ్లింది. కాగా, మేరీ రెండ్రోజులుగా ఆస్పత్రి పరిసరాల్లో తిరుగుతూ శిశువును విక్రయిస్తారా? అంటూ సెక్యూరిటీ సిబ్బందిని వాకబు చేసినట్లు తెలిసింది. వారు అక్కడి నుంచి వెళ్లగొట్టగా, ఆప్తురాలిగా నటించి బాబుతో ఉడాయించినట్లు సమాచారం.