బీబీనగర్: నల్లగొండ జిల్లాలో ఇద్దరు మహిళా కి'లేడీ'లు ఆర్టీసీ బస్సులో చోరీకి పాల్పడటంతో పాటు ఓ పాపను కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ నుంచి భువనగిరికి వెళుతున్న ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి ఆమె దగ్గరున్న నగల బ్యాగును, ఆమె కుమార్తెను అపహరించుకుపోయారు. దీనికి సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు.. హైదరాబాద్‌లోని కొత్తపేటలో నివాసం ఉండే సంతోష(23) వినాయక చవితి సందర్భంగా తన కుమార్తెతో కలసి బుధవారం నల్లగొండ జిల్లా ఆత్మకూరులోని పుట్టింటికి బయలుదేరింది. ఉప్పల్‌లో భువనగిరికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఊరికి వెళుతుండడంతో భద్రత కోసం 8 తులాల బంగారు ఆభరణాలను ఓ బ్యాగులో పెట్టుకుని తన వెంట తీసుకెళ్తోంది.
బస్సులో వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు సంతోష కుమార్తెను తమ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు గానీ, బీబీనగర్‌లో సంతోషకు తెలివి వచ్చింది. చూసేసరికి చేతిలో బ్యాగు లేదు, వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు, తన కుమార్తె కనిపించలేదు. బస్సు దిగి బాధితురాలు బీబీనగర్ పోలీసులకు మధ్యాహ్నం సమయంలో ఫిర్యాదు చేశారు. తనకు ఎవరో మత్తు మందు చల్లి బంగారు నగలు, తన కుమార్తెతో ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొంది. మత్తు పూర్తిగా వదలకపోవడంతో ఆమె గందరగోళ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలా తెలియాల్సి ఉంది.
తల్లికి మత్తు మందు ఇచ్చి పాప కిడ్నాప్
Published Wed, Sep 16 2015 3:22 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement
Advertisement