chloroform
-
హిప్పో సబ్బుల మాటున ‘మత్తు’ రవాణా
నిర్మల్: నిర్మల్ జిల్లాలో నిషేధిత మత్తు పదార్థం క్లోరోఫామ్ (సీహెచ్)ను రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులుభారీ ఎత్తున పట్టుకున్నారు. ఎవరికీ అను మానం రాకుండా హిప్పో డిటర్జెంట్ పేరిట గుజరాత్ లోని ఓ రసాయనాల ఫ్యాక్ట రీ నుంచి హైదరాబాద్‌కు అక్కడ్నుంచి జిల్లాలకు సర ఫరా చేస్తున్నట్లుగా సమాచారం అందడంతో ఆమేరకు అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. గుజరాత్‌లోని వాపిలో ఉన్న శ్రీ కెమికల్స్ ఫ్యాక్టరీ నుంచి హైదరాబాద్‌కు, అక్కడ్నుంచి నిర్మల్‌కు నవత ట్రాన్స్‌పోర్టు వాహనంలో హిప్పో డిటర్జెంట్ పేరిట 20 బ్యాగుల్లో 560 కిలోల క్లోరోఫామ్‌ను రవాణా చేశారు. వీటిని తీసుకునేందుకు శనివారం నవత కార్యాలయానికి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం ధర్మోరకు చెందిన అరుణ్గౌడ్ వచ్చారు. అప్పటికే అక్కడి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు అతడిని పట్టుకున్నారు. కల్లులో కలిపేందుకు క్లోరోఫామ్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని దాదాపు 50 గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. క్లోరోఫామ్ కిలో రూ.వెయ్యి నుంచి రూ.ఐదువేల వరకూ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితుడు అరుణ్‌గౌడ్‌ను కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. గతంలో ఇదే కేసులో రెండుసార్లు అరుణ్ గౌడ్ పోలీసులకు పట్టుబడటం గమనార్హం. -
సీన్ రివర్స్, అయినా కూడా కోవిడ్ టీకా డ్రామా, ఆపై
మీర్‌పేట: కోవిడ్ టీకా పేరిట ఓ యువతి వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి 8 తులాల బంగారు ఆభరణాలను అపహరించి కొత్తరకం మోసానికి పాల్పడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లెలగూడ లలితానగర్ రోడ్ నం.1కు చెందిన కుంతాల లక్ష్మణ్ (80), కస్తూరి (70) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బెంగళూరులో, చిన్న కుమారుడు దుబాయ్‌లో స్థిరపడడంతో ఇద్దరే ఒంటరిగా ఉంటున్నారు. లక్ష్మణ్ విద్యుత్ శాఖలో అకౌంటెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. వికారాబాద్‌కు చెందిన విజయ్, అనూష (21)లు లక్ష్మణ్ పక్కింట్లో అద్దెకు ఉంటున్నారు. విజయ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా అనూష మందమల్లమ్మ సమీపంలోని విశ్వాస్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసి మానేసింది. ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్ 4వ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో వృద్ధ దంపతులతో ఆప్యాయతగా మాటలు కలిపి పరిచయం పెంచుకోవడంతో వారు అనూషపై నమ్మకం పెంచుకున్నారు. మూడు నెలల క్రితం అనూష ఇంటిని ఖాళీ చేసి అదే కాలనీలోని మరో ఇంట్లో అద్దెకు దిగారు. పాత పరిచయంతో కస్తూరి ఒంటిపై ఉన్న ఆభరణాలపై కన్నేసిన అనూష పథకం ప్రకారం శుక్రవారం వృద్ధ దంపతుల వద్దకు వచ్చి తాను గర్భవతినని, ప్రస్తుతం 8వ నెలని, తల్లిగారింటికి వెళ్తున్నానని ఆప్యాయతగా మాట్లాడి మత్తు మందు కలిపిన పాయసం ఇవ్వగా వారు తినలేదు. సీన్ రివర్స్ కావడంతో మరుసటి రోజు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు అనూష మరలా వచ్చి తాను ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నానని, కోవిడ్–19టీకా వేస్తానని మరో డ్రామాకు తెరలేపగా వృద్ధ దంపతులు దీనికీ నిరాకరించారు. బలవంతంగా వారికి ‘మిడోజాలం’అనే మత్తు మందును కోవిడ్–19టీకాగా నమ్మించి వేయగా వారు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే కస్తూరి ఒంటిపై ఉన్న బంగారు గాజులు, చెవి కమ్మ లు, మాటీలు, రెండు ఉంగరాలు, పుస్తెలతాడును తీసుకుని అక్కడినుంచి జారుకుంది. దాదాపు రెండున్నర గంటల తరువాత తేరుకున్న లక్ష్మణ్ బంగా రు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్రైం ఎస్ఐ మారయ్య చాకచక్యంగా వ్యవహరించి స్థానికులు, సీసీపుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి రెండు గంటల్లో అనూషను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుంచి బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. అనూషపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. చదవండి: ఎస్సారెస్పీ కాలువలోకి కారు.. ముగ్గురు మృతి చదవండి: పులి విహారం.. టూరిస్టు గైడ్లుగా మహిళలు -
మత్తులో నుంచి తేరుకోని ‘సంపర్క్ క్రాంతి’ బాధితులు
కాజీపేట రూరల్ : సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఘటనపై రైల్వే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. యశ్వంత్‌పూర్ నుంచి హజరత్‌నిజాముద్దీన్ వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ఆరుగురి ప్రయాణికులకు దుండగులు మత్తు మందు కలిపిన తినుబండారాలు ఇచ్చి నిలువు దోపిడి చేయడం జరిగింది. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే పోలీస్ అధికారులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బెంగళూర్ నుంచి సోమవారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఇక్కడికి వ చ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఆరుగురు ప్రయాణికు ల పూర్తి వివరాలు, వారి చికిత్స విధా నం, వారి వివరాలను స్థా నిక రైల్వే పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స ంపర్క్క్రాంతి ఘటనపై దుండగులను పట్టుకునేందుకు అన్ని రై ల్వే జోన్లలో రైల్వే పోలీస్‌లను అప్రమత్తం చేసినట్లు వివరి ంచారు. ఈ ఘటనపై కాజీపేట జీ ఆర్పి పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేసుకుని.. కేసును బెంగళూర్ రైల్వేపోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇంకా తేరుకోని ఆ ఆరుగురు.. సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు ఇంకా మత్తులో నుంచి తేరుకోలేదని రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు. ఒకరు మత్తులో నుంచి తేరుకొని కొన్ని మాటలు మా ట్లాడినట్లు తెలిపారు. అతడి వద్ద ఉన్న రూ.4 వేలు దోచుకున్నారని.. మాత్రమే తెలిపినట్లు వెల్లడించారు. వారు మత్తులో నుంచి తేరుకుంటేనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. -
కల్లు దుకాణంపై ఎక్సైజ్ అధికారుల దాడి
మెదక్‌జోన్: కొల్చారం మండల కేంద్రంలోని కల్లు దుకాణంపై బుధవారం పోలీసులు దాడి చేసి 24 కిలోల క్లోరోఫాంను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. కొల్చారం లో క్లోరోఫాం విక్రయిస్తున్నట్లు అధికారులకు విశ్వసనీయ సమాచారం అధికారులకు అందింది. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు బుధవారం కల్లు దుకాణంపై దాడి చేశారు. ఇందులో కల్లులో కలిపే క్లోరోల్ హైడ్రేడ్ అనే మత్తు పదార్థం 24 కిలోలు లభించింది. ఈ దాడిలో నిందితులుగా శ్రీధర్ గౌడ్, శివకుమార్లను అదుపులోని తీసుకుని విచారించారు. వారు దుర్గాప్రసాద్, నారాగౌడ్‌లు తమకు క్లోరోఫాం విక్రయించినట్లు పేర్కొన్నారని అధికారులు తెలిపారు. -
హవ్వా.. చైనా జనాలకు చీమకుట్టినట్లైనా లేదు
బీజింగ్: మానవత్వం భారతదేశంలో రానురాను తగ్గిపోతుందని గగ్గోలుపడిపోతుంటాంకానీ చైనాతో పోల్చుకుంటే మాత్రం మనమే నయం అనిపిస్తుందేమో. అవును.. చైనాలో మానవత్వం ఎప్పుడో మంటగలిచిపోయిందని ఈ విషయం తెలుసుకుంటే అర్థమవుతుంది. చైనాలో సాధారణంగా చిన్నపిల్లల కిడ్నాప్‌లు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ విషయం ఎంతో ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అసలు ప్రజలకు ఇలాంటి అంశాలపై ఎంతమేరకు ఆందోళన ఉంటుందో, ఎలా తమ బాధ్యతను నిర్వర్తిస్తారో తెలుసుకునేందుకు కొందరు యువకులు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఒక చిన్నపిల్లాడిని బాగా రద్దీ ఉన్న ప్రాంతంలో నిల్చోబెట్టి అందరూ చూస్తుండగా క్లోరో ఫామ్ ముక్కుకు పెట్టి ఎత్తుకెళ్లిపోతున్నట్లుగా ప్రవర్తించారు. ఇలా పార్క్‌లలో, రెస్టారెంట్లలో, వీధుల్లో, కళాశాల వద్ద పరిపరి విధాలుగా కిడ్నాప్ చేస్తున్నట్లుగా నటించారు. కానీ, ఇదంతా చూస్తున్న ఆ చుట్టుపక్కలవారు కనీసం ఆ కిడ్నాపర్‌ను అడ్డుకోలేదు కదా... కనీసం ఆందోళన కూడా పడలేదు. మాకే సంబంధం లేదన్నట్లుగా కనీసం చీమకుట్టినట్లయినా లేకుండా కనిపించారు. ఏ ఒక్కరూ అతడిని గల్లా పట్టుకొని అడుగుతారేమోనని ఆశగా చూసిన అంతా బాధ్యతా రహితంగానే కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. -
తల్లికి మత్తు మందు ఇచ్చి పాప కిడ్నాప్
బీబీనగర్: నల్లగొండ జిల్లాలో ఇద్దరు మహిళా కి'లేడీ'లు ఆర్టీసీ బస్సులో చోరీకి పాల్పడటంతో పాటు ఓ పాపను కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ నుంచి భువనగిరికి వెళుతున్న ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి ఆమె దగ్గరున్న నగల బ్యాగును, ఆమె కుమార్తెను అపహరించుకుపోయారు. దీనికి సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు.. హైదరాబాద్‌లోని కొత్తపేటలో నివాసం ఉండే సంతోష(23) వినాయక చవితి సందర్భంగా తన కుమార్తెతో కలసి బుధవారం నల్లగొండ జిల్లా ఆత్మకూరులోని పుట్టింటికి బయలుదేరింది. ఉప్పల్‌లో భువనగిరికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఊరికి వెళుతుండడంతో భద్రత కోసం 8 తులాల బంగారు ఆభరణాలను ఓ బ్యాగులో పెట్టుకుని తన వెంట తీసుకెళ్తోంది. బస్సులో వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు సంతోష కుమార్తెను తమ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు గానీ, బీబీనగర్‌లో సంతోషకు తెలివి వచ్చింది. చూసేసరికి చేతిలో బ్యాగు లేదు, వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు, తన కుమార్తె కనిపించలేదు. బస్సు దిగి బాధితురాలు బీబీనగర్ పోలీసులకు మధ్యాహ్నం సమయంలో ఫిర్యాదు చేశారు. తనకు ఎవరో మత్తు మందు చల్లి బంగారు నగలు, తన కుమార్తెతో ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొంది. మత్తు పూర్తిగా వదలకపోవడంతో ఆమె గందరగోళ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలా తెలియాల్సి ఉంది.