కల్లు దుకాణంపై ఎక్సైజ్‌ అధికారుల దాడి  | 24 Kgs Chloroform Captured | Sakshi
Sakshi News home page

కల్లు దుకాణంపై ఎక్సైజ్‌ అధికారుల దాడి 

Published Thu, Mar 29 2018 11:07 AM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM

24 Kgs Chloroform Captured - Sakshi

మెదక్‌జోన్‌: కొల్చారం మండల కేంద్రంలోని కల్లు దుకాణంపై బుధవారం పోలీసులు దాడి చేసి 24 కిలోల క్లోరోఫాంను స్వాధీనం చేసుకున్నారు.  ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. కొల్చారం లో క్లోరోఫాం విక్రయిస్తున్నట్లు  అధికారులకు విశ్వసనీయ సమాచారం అధికారులకు  అందింది.    సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ అధికారులు బుధవారం కల్లు దుకాణంపై దాడి చేశారు. ఇందులో కల్లులో కలిపే క్లోరోల్‌ హైడ్రేడ్‌ అనే మత్తు పదార్థం 24 కిలోలు లభించింది. ఈ దాడిలో నిందితులుగా  శ్రీధర్‌ గౌడ్, శివకుమార్‌లను అదుపులోని తీసుకుని విచారించారు. వారు  దుర్గాప్రసాద్, నారాగౌడ్‌లు తమకు క్లోరోఫాం విక్రయించినట్లు పేర్కొన్నారని అధికారులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement