Kallu compound
-
కల్లు దుకాణంపై ఎక్సైజ్ అధికారుల దాడి
మెదక్‌జోన్: కొల్చారం మండల కేంద్రంలోని కల్లు దుకాణంపై బుధవారం పోలీసులు దాడి చేసి 24 కిలోల క్లోరోఫాంను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. కొల్చారం లో క్లోరోఫాం విక్రయిస్తున్నట్లు అధికారులకు విశ్వసనీయ సమాచారం అధికారులకు అందింది. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు బుధవారం కల్లు దుకాణంపై దాడి చేశారు. ఇందులో కల్లులో కలిపే క్లోరోల్ హైడ్రేడ్ అనే మత్తు పదార్థం 24 కిలోలు లభించింది. ఈ దాడిలో నిందితులుగా శ్రీధర్ గౌడ్, శివకుమార్లను అదుపులోని తీసుకుని విచారించారు. వారు దుర్గాప్రసాద్, నారాగౌడ్‌లు తమకు క్లోరోఫాం విక్రయించినట్లు పేర్కొన్నారని అధికారులు తెలిపారు. -
కల్లు కాంపౌండ్‌లో ఎస్ఐ మృతి
హైదరాబాద్: కల్లు కాంపౌండ్‌లో ఎస్ఐ మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాయదుర్గం సీఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండీడ్ మండలం బొట్లగడ్డ తండాకు చెందిన వి.రాములు(53) సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు.రాజేంద్రనగర్ బుద్వేల్లోని పోలీస్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న రాములు మంగళవారం ఉదయం కార్యాలయానికి వెళ్లి.. 10 గంటలకు అనుమతి తీసుకొని బయటకు వచ్చాడు. మధ్యాహ్నం రాయదుర్గం కల్లు కాంపౌండ్ ముందు ఓ వ్యక్తి చనిపోయాడని స్థానికులు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతిచెందిన వ్యక్తి ఎస్ఐ రాములుగా గుర్తించారు. అధికారులకు సమాచారం అందించి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రాములుకు భార్య, కుమార్తె ఉన్నారు. అయితే కల్లు కాంపౌండ్ బయట రాములు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తుండగా.. స్థానికులు మాత్రం రాములు కాంపౌండ్లోనే చనిపోయాడని అంటున్నారు. కల్లు తాగుతూ నేలకొరిగాడని.. అది గమనించిన కాంపౌండ్ సిబ్బంది రాములును బయట వదిలేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. -
ప్రతాపం చూపిన సికింద్రాబాద్ మహిళలు!
సికింద్రాబాద్: నగరంలోని మహిళలు తమ ప్రతాపం చూపారు. వెంగళరావు నగర్‌లోని కల్లు కాంపౌండ్‌పై దాడి చేశారు. ఈ రోజే ఇక్కడ కల్లు కాంపౌండ్ ప్రారంభించారు. ప్రారంభించిన కొద్దిసేపటికే మహిళలు కాంపౌండ్‌పై దాడి చేశారు. కల్లు సీసాలను ధ్వంసం చేశారు. తమ బస్తీలో కల్లుకాంపౌండ్ వద్దని ఆందోళనకు దిగారు. మళ్లీ కల్లుకాంపౌండ్ తెరిచి తమ జీవితాలతో ఆడుకోవద్దని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భర్తలు, పిల్లలు కల్తీ కల్లుకు బానిసలై జీవితాలను ఛిద్రం చేసుకుంటారని వారు భయాందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని మూడు కల్లు దుకాణాలను మూసివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలిసి పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. **