Exice Officers
-
ముందస్తు మద్యం
సాక్షి, అమరావతి బ్యూరో : సాధారణంగా ఎండాకాలంలో బీరుకు గిరాకీ ఉంటుంది. ఆ సమయంలో బీరు తయారీ సంస్థలు, డిపోలు దుకాణదారులకు సమృద్ధిగా సరఫరా చేయలేరు. ఈ డిమాండ్‌ను గుర్తించిన కొందరు వ్యాపారులు గతంలో అనధికారికంగా అధిక ధరలకు అమ్మిన సంఘటనలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మద్యం దుకాణదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో బీరు అమ్మకాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. డిపోలు, తయారీ సంస్థలు.. బీరు అమ్మకాలపై ఆయా నెలల్లో రాయితీలు ఇస్తుంటాయి. ఈ ఏడాది కూడా ఈ రాయితీలు ఇచ్చాయి. దీంతో అమ్మకాలు లేకున్నా భారీస్థాయిలో 3.02 లక్షల కేసుల బీరును ఫిబ్రవరి నెలలో మద్యం దుకాణదారులు కొనుగోలు చేశారు. దీంతో ప్రస్తుతం డిపోల్లో బీరు నిల్వలు అడుగంటాయి. బ్రాందీ, విస్కీ తదితర రకాల అమ్మకాలు కూడా పెరిగాయి. బ్రాందీ, విస్కీ కొంటేనే బీర్.. బీరు కావాలంటూ దుకాణదారుల నుంచి డిమాండ్ రావడంతో డిపోలు కొత్త నిబంధనలను తెరమీదకు తెచ్చినట్లు సమాచారం. ఇతర రకాలు కొనుగోలు చేస్తేనే బీరు ఇస్తామనడంతో మద్యం దుకాణదారుల బ్రాందీ, విస్కీ కేసులను కొనుగోలు చేశారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో 2.91 లక్షల కేసుల లిక్కర్‌ను కొనుగోలు చేయగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 3.57 లక్షల కేసులు కొనుగోళ్లు జరిగాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 23 శాతం అధికంగా ఉండటం గమనార్హం. అలాగే బీర్లు అయితే గతేడాది ఫిబ్రవరిలో 1.79 లక్షల కేసుల కొనుగోలు చేయగా.. ఈ ఏడాది ఏకంగా 68 శాతం పెరిగి 3.02 లక్షల కేసులు కొనుగోలు చేయడం జరిగింది. ఫిబ్రవరిలో మద్యం కొనుగోళ్లు ఇలా.. నెల/ఏడాది మద్యం (ఐఎంఎల్) బీర్లు 02/2018 2,19,065 1,79,794 02/2019 3,57,520 3,02,065 బెల్టు షాపులదే హవా.. జిల్లాలో మద్యం దుకాణాలు 339, బార్ అండ్ రెస్టారెంట్లు 141, స్టార్ హోటళ్లు 18 ఉన్నాయి.మద్యం దుకాణాల్లో అమ్మే ప్రతి సీసాపై సమగ్ర వివరాలు ఉంటాయి. ముందస్తుగా భారీ స్థాయిలో కొనుగోళ్లు చేసి నిల్వ చేసిన మద్యం తర్వాత నెలలో అమ్మితే ఆబ్కారీశాఖ తనిఖీల్లో దొరికిపోయే అవకాశం ఉంటుంది. దీనిని గుర్తించి బెల్టు షాపుల్లో అమ్ముతున్నారు. కృష్ణా జిల్లా పరిధిలో చాలా మద్యం దుకాణాలకు అనుసంధానంగా బెల్టు షాపులు ఉన్నాయి. వీటిని అనుమతి పొందిన మద్యం దుకాణదారులే అనధికారికంగా నిర్వహిస్తున్నారు. వీటిల్లో ధర అధికంగా ఉండటంతోపాటు గడువు తీరిన, అదనపు పన్ను కట్టని మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా పరిధిలో ఆబ్కారీశాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో గొలుసు దుకాణాలపై నిఘా పెట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.. దుకాణాలు, బార్లు ప్రతి నెలా లక్ష్యానికి మించి జరిపే అమ్మకాలపై అదనంగా 20శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. అదనపు పన్ను కట్టి జరిపే అమ్మకాలపైనా మద్యం దుకాణదారులకు భారీ స్థాయిలోనే లాభం వస్తుంది. దీనికి సంతృప్తి చెందకుండా దుకాణదారులు ఇతర మార్గాల్లోను ఆదాయం ఆర్జించాలని చూస్తున్నారు. అదనపు పన్ను భారం నుంచి తప్పించుకునేందుకు అమ్మకాలు లేని నెలల్లో సైతం భారీస్థాయిలో కొనుగోళ్లు జరిపి.. మద్యం నిల్వలను పెట్టుకుంటున్నారు. ఆయా నెలల్లో 20 శాతం అదనపు పన్ను లేకుండా ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమ్మకాలపై నిఘా ఉంది.. జిల్లాలో చాలామంది దుకాణదారులు, బారుల యాజమాన్యాలు బీరును భారీస్థాయిలో కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. దుకాణాలు చేసే క్రయ, విక్రయాలపై దృష్టిపెట్టాం. ఏ దుకాణదారుడు ఎంత కొనుగోలు చేస్తున్నాడు? దానిని ఎక్కడ నిల్వ ఉంచుతున్నాడు? రోజువారీ ఎంత అమ్మకాలు చేస్తున్నాడు? తదితర సమాచారంపై ఆకస్మిక దాడులు చేస్తాం. కొనుగోలు అమ్మకాల్లో వ్యత్యాసాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం. బెల్టుషాపులపై నిఘా పెడతాం. –మురళీధర్, డీసీ, కృష్ణా జిల్లా -
కల్లు దుకాణంపై ఎక్సైజ్ అధికారుల దాడి
మెదక్‌జోన్: కొల్చారం మండల కేంద్రంలోని కల్లు దుకాణంపై బుధవారం పోలీసులు దాడి చేసి 24 కిలోల క్లోరోఫాంను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. కొల్చారం లో క్లోరోఫాం విక్రయిస్తున్నట్లు అధికారులకు విశ్వసనీయ సమాచారం అధికారులకు అందింది. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు బుధవారం కల్లు దుకాణంపై దాడి చేశారు. ఇందులో కల్లులో కలిపే క్లోరోల్ హైడ్రేడ్ అనే మత్తు పదార్థం 24 కిలోలు లభించింది. ఈ దాడిలో నిందితులుగా శ్రీధర్ గౌడ్, శివకుమార్లను అదుపులోని తీసుకుని విచారించారు. వారు దుర్గాప్రసాద్, నారాగౌడ్‌లు తమకు క్లోరోఫాం విక్రయించినట్లు పేర్కొన్నారని అధికారులు తెలిపారు. -
పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లు!
-
కోస్తా నుంచి గంజాయి అక్రమ రవాణా
ప్రొద్దుటూరు క్రైం: జిల్లాలో గంజాయి మాఫియా రోజు రోజుకూ చాప కింద నీరులా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు గంజాయి ధర చాలా తక్కువగా ఉండటంతో ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. జిల్లా నుంచి అరబ్ దేశాలకు కూడా అక్రమ రవాణా జరుగుతుండటంతో వీటి ధర ఒక్కసారిగా నాలుగింతలు పెరిగింది. గతంలో కోస్తాలో కిలో గంజాయి రూ.2 వేలకు తీసుకొని వచ్చి ఇక్కడ రూ. 3 వేలకు విక్రయించేవారు. ఇప్పుడు కిలో సుమారు 8 వేల వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఒక సారి 20 కిలోల లోడ్ తెప్పిస్తే వ్యాపారులకు రూ.1 లక్షకు పైగా ఆదాయం వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తక్కువ పెట్టుబyì తో భారీ ఆదాయం వస్తుండటంతో ఈ వ్యాపారం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. జిల్లాలోని కడపతోపాటు ప్రధాన పట్టణాలు మొదలు, గ్రామాల వరకు వ్యాపారం జోరుగా జరుగుతోంది. జిల్లాలో నలుగురైదుగురు ప్రధాన వ్యాపారులతోపాటు 60 మంది దాకా అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాకు సరఫరా కోస్తా జిల్లాల నుంచి కడప జిల్లాకు నిత్యం గంజాయిని తరలిస్తున్నారు. పట్టపగలే లారీల ద్వారా మూటెలను తీసుకొస్తున్నారు. కోస్తాలోని తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి దిగుమతి అవుతోంది. ఇటీవల ఇక్కడి వ్యాపారులు తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరానికి చెందిన వ్యక్తి ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు. అతని అకౌంట్లో డబ్బు వేసిన మరుక్షణమే గంజాయిని లారీల ద్వారా ఇక్కడికి పంపిస్తునట్లు సమాచారం. మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల వ్యాపారులు నంద్యాల జాతీయ రహదారిలోని ఇడమడక సమీపంలో మూటెలను దించుకుంటున్నారు. రెండు రోజులకు ఒక మారు తెప్పిస్తున్నారు. జిల్లా సరిహద్దులోని ఇడమడక నుంచి మోటార్ బైక్‌ల్లో ఆయా వ్యాపారులకు తరలిస్తున్నారు. కాగా జిల్లా నుంచి కర్నూలు, అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతాలకు గంజాయి పెద్ద ఎత్తున తరలుతున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతంలో సుమారు 12 మంది వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఎక్సైజ్ రికార్డుల్లో ఉన్న వారు కూడా ఉన్నారు. ప్రొద్దుటూరుతోపాటు మైదుకూరు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కడప, రాజంపేట, జమ్మలమడుగు, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో గంజాయి మాఫియా పాగా వేసింది. నిద్రపోతున్న నిఘా వ్యవస్థ గంజాయి వ్యాపారం చేస్తున్న వారందరూ దాదాపుగా కేసుల్లో ఉన్న వారే. వీరి కదలికలు ఎక్సైజ్ అధికారులకు తెలియంది కాదు. కోస్తా నుంచి తెప్పించిన గంజాయిని ఎక్కడ నిల్వ చేస్తారనే విషయం కూడా వారికి తెలిసే ఉంటుంది. ఎక్సైజ్ పోలీసులు వీరిని పట్టించుకోలేదో లేక పూర్తిగా వదిలేశారో గానీ పాత నేరగాళ్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు, స్క్వాడ్ సిబ్బంది మద్యం వ్యాపారాలు పెంచడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే గంజాయి వ్యాపారం జోరుగా జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రొద్దుటూరులో అయితే చిన్న కాగితపు పొట్లాల్లో ఉంచి రూ.50, రూ.100లకు బహిరంగంగా విక్రయిస్తున్నారు. శనివారమైతే ప్రొద్దుటూరులో గంజాయి ఓపెన్ మార్కెట్లో దొరుకుతుంది. కొన్ని కేసులు.. గతేడాది డిసెంబర్లో సాయికుటీర్ రోడ్డులో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి 60 కిలలో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో ముద్దనూరుకు చెందిన ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 17 కిలోల గంజాయి, మోటర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం చాపాడు మండలంలోని సిద్దారెడ్డిపల్లెలో ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి జిల్లాలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. నిఘా పెట్టాం.. గంజాయి అక్రమ రవాణాపై నిఘా ఉంచాం. ప్రధాన రహదారుల్లో నిత్యం తనిఖీలు చేస్తున్నాం. జిల్లా సరిహద్దుల వద్ద కూడా మా సిబ్బంది నిఘా ఉంచారు. పాత నేరగాళ్ల కదలికలపై దృష్టి సారించాం. – ఫణీంద్ర, ఎక్సైజ్ సీఐ