ప్రసవించిన మూడురోజులకే పరీక్షకు.. | Went to write the exam only three days after the delivery | Sakshi
Sakshi News home page

ప్రసవించిన మూడురోజులకే పరీక్షకు..

Published Thu, Jun 1 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

ప్రసవించిన మూడురోజులకే పరీక్షకు..

ప్రసవించిన మూడురోజులకే పరీక్షకు..

హన్మకొండ: ప్రసవించిన మూడురోజులకే ఓ మహిళ గురుకుల టీచర్‌ పోస్టుల రాత పరీక్షకు హాజరయ్యింది. మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లికి చెందిన మల్లికంటి వరలక్ష్మి గురుకుల టీచర్‌ పోస్టుల రాత పరీక్షకు ప్రిపేర్‌ అయింది. పరీక్షకు మూడు రోజుల ముందే వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని మెటర్నిటీ ఆస్పత్రిలో ప్రసవించింది.

ప్రసవించి మూడు రోజులే అయినా పరీక్ష రాయాలనే పట్టుదలతో అంబులెన్స్‌లో హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల పరీక్ష కేంద్రానికి వెళ్లింది. వరలక్ష్మికి ప్రత్యేకంగా సీటు కేటాయించగా పరీక్ష రాసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement