
హన్మకొండలో చోటాభీమ్
5.3 కిలోల బరువుతో జన్మించిన శిశువు
హన్మకొండ చౌరస్తా: హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఓ తల్లి 5.3 కిలోల పండంటి పాపకు జన్మనిచ్చింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కె.మంజులకు వైద్యులు సోమవారం ఆపరేషన్ ద్వారా ప్రసవం చేశారు. ఆమెకు 5.3 కిలోల బరువుతో శిశువు జన్మించింది. పాప ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు. మంజులకు ఇది మూడో కాన్పని, ఇదివరకు ఇద్దరు కుమారులు ఉన్నారని ఆమె బంధువులు తెలిపారు.