
సుల్తాన్‌బజార్: సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి ఫిర్యాదుతో గన్‌ఫౌండ్రీ డివిజన్ కార్పొరేటర్ సురేఖ, ఆమె భర్త ఓంప్రకాష్ బీశ్వలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ పద్మ వివరాల ప్రకారం.. బుధవారం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి కార్పొరేటర్ సురేఖ, ఆమె భర్త ఓంప్రకాష్ బీశ్వలతో పాటు మరికొంత మంది బీజేపీ నాయకులు డాక్టర్ రాజ్యలక్ష్మి చాంబర్‌కు వచ్చి దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేయడంతో భార్యాభర్తతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. కాగా సురేఖ సైతం సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మిపై ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment