
అప్పు తీర్చమన్నందుకు కత్తితో దాడి..
హైదరాబాద్ : అప్పు తీర్చమన్నందుకు ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నయాబజార్ స్కూలు వద్ద అన్వర్ అనే వ్యక్తి తన మిత్రుడిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికులు బాధితుడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన వద్ద తీసుకున్న అప్పును తీర్చకుండా అన్వర్ తప్పించుకుంటున్నాడని, గట్టిగా అడిగినందుకు దాడి చేశాడని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.