Sultanbazar
-
HYD: వేలాది భక్తుల నడుమ సాగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర
సాక్షి, హైదరాబాద్: ఆకాష్‌పురి మందిరం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది భక్తుల నడుమ శ్రీరాముడి శోభాయాత్ర సాగుతుంది. 1500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీతారామ్‌బాగ్ నుంచి సుల్తాన్‌బజార్ వరకు 6.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో సాగునున్న శోభాయాత్రను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. శోభాయాత్ర ప్రాంతాల్లో ఆక్టోపస్, రిజర్వ్ పోలీస్ మోహరించారు. సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశామని సౌత్ వెస్ట్ డీసీపీ కిరణ్ ఖారే తెలిపారు. చదవండి: శ్రీరాముడి శోభాయాత్ర.. ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు ఇవే.. -
వీహెచ్‌పీ నేత బాలస్వామికి బెదిరింపు కాల్స్.. ఈస్ట్‌జోన్ డీసీపీకి ఫిర్యాదు
సుల్తాన్‌బజార్: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత బాలస్వామికి ఆదివారం బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన ఈస్ట్‌జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాలస్వామి మా ట్లాడుతూ బజరంగ్దళ్ నిరసన కార్యక్రమాలను నిలిపి వేయాలని విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ అయిన తనకు ఆదివారం అర్ధరాత్రి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడంతో పాటు డీసీపీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడాన్ని వారు సవాలు చేస్తున్నారన్నారు. రకరకాల పేర్లతో ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాలను వెంటనే రద్దుచేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చ రించినట్లు బాలస్వామి వెల్లడించారు. వీహెచ్‌పీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ను కొందరు మార్పిడి చేసి వైరల్ చేశారన్నారు. అందులో వివాదాస్పద వ్యాఖ్యలు జోడించారని ఆరోపించారు. తమ ఫిర్యాదుపై డీసీపీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. -
కార్పొరేటర్ దంపతులపై కేసు నమోదు
సుల్తాన్‌బజార్: సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి ఫిర్యాదుతో గన్‌ఫౌండ్రీ డివిజన్ కార్పొరేటర్ సురేఖ, ఆమె భర్త ఓంప్రకాష్ బీశ్వలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ పద్మ వివరాల ప్రకారం.. బుధవారం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి కార్పొరేటర్ సురేఖ, ఆమె భర్త ఓంప్రకాష్ బీశ్వలతో పాటు మరికొంత మంది బీజేపీ నాయకులు డాక్టర్ రాజ్యలక్ష్మి చాంబర్‌కు వచ్చి దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేయడంతో భార్యాభర్తతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. కాగా సురేఖ సైతం సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మిపై ఫిర్యాదు చేశారు. (చదవండి: బాలికతో అసభ్య ప్రవర్తన కేసులో ఎమ్మెల్యే కుమారుడు?) -
అప్పు తీర్చమన్నందుకు కత్తితో దాడి..
హైదరాబాద్ : అప్పు తీర్చమన్నందుకు ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నయాబజార్ స్కూలు వద్ద అన్వర్ అనే వ్యక్తి తన మిత్రుడిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు బాధితుడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన వద్ద తీసుకున్న అప్పును తీర్చకుండా అన్వర్ తప్పించుకుంటున్నాడని, గట్టిగా అడిగినందుకు దాడి చేశాడని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బంధువు కత్తి దాడిలో మహిళ మృతి
హైదరాబాద్: పాతకక్షలతో మహిళను హత్య చేసిన సంఘటన నగరంలోని సుల్తాన్‌బజార్ పరిధిలోని లక్ష్మినారాయణ టెంపుల్ రంగ్‌మహల్ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన సోనిబాయ్(35) ఉదయం ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో ఆమె దూరపు బంధువు విచక్షణారహితంగా కత్తితో ఆమెపై దాడి చేసింది. ఇది గమనించిన సోనిబాయ్ భర్త ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. ఆ మహిళ సోనిబాయ్ భర్తపై కూడా కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో సోనిబాయ్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జీనాయహా..
క్రమశిక్షణ, సామాన్య జీవన విధానానికి ప్రాధాన్యం ఇచ్చే జైన్లు 400 ఏళ్ల క్రితమే నగరంలో స్థిరపడ్డారు. హైదరాబాద్ నగరం తమ జీవన విధానానికి ఎంతో అనుకూలంగా ఉందంటున్నారు. దేశంలోని ఏ మారుమూల నుంచి ఇక్కడికి వచ్చినా.. అక్కున చేర్చుకునే భాగ్యనగరం అంటే తమకెంతో ఇష్టమంటున్నారు ఇక్కడి జైన్లు. కన్నతల్లి, సొంత ఊరును ఎంతలా అభిమానిస్తామో.. జీవన మార్గాన్ని చూపిన హైదరాబాద్‌ను కూడా అంతే ప్రేమిస్తున్నామని చెబుతున్నారు. ‘హమ్ లోగ్ హైదరాబాదీ’ అని అంటున్నారు. ‘జీయో.. ఔర్ జీనే దో..’ అనే జైన్లు ఇక్కడి ప్రజలతో మమేకమై తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో జైన్ల జీవన విధానం ప్రత్యేకమైనది. జీవహింస మహా పాపమనే సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మే జైన్లు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆడంబరాలకు దూరంగా ఉంటారు. స్వేచ్ఛను గౌరవిస్తారు. గో రక్షణలో తమ కర్తవ్యం చాటుకుంటున్న జైన్లు.. అదే గోవులను బంధించి సేవ చేయడాన్ని మాత్రం అంగీకరించరు. నవ్కార్ మహామంత్ర జపం చేసే వీరు.. అహింసా పరమో ధర్మః అనే మహావీరుడి సూక్తులను త్రికరణ శుద్ధిగా పాటిస్తారు. నాలుగు శతాబ్దాల కిందట భాగ్యనగరం తలుపు తట్టిన జైన్లు.. ఇక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం నగరంలో వీరి జనాభా 2 లక్షల నుంచి 3 లక్షల వరకూ ఉంటుంది. ఉత్తరాది విడిది విడిచి.. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన జైన్లు ఉత్తరాది విడిచి బతుకును వెతుక్కుంటూ భాగ్యనగరికి చేరుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ఫైనాన్స్, జువెలరీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, వస్త్ర వ్యాపారం, మెడికల్, శానిటరీ, మార్బుల్ తదితర వ్యాపారాల్లో సత్తా చాటుతున్నారు. వీరి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం వచ్చారు. నీరు, విద్యుత్ పొదుపుగా వాడుకునే జైన్లు అల్లం, వెల్లుల్లి, ఉల్లి, ఆలూ, వంకాయలను అసలు వినియోగించరు. జైన్ గురువులు.. జైన్లలో శ్వేతాంబర్ సంఘ్, దిగంబరీ సంఘ్ అనే గురువులు ఉంటారు. వీరు శ్వేత వస్త్రాలు ధరిస్తారు. దిగంబరీ సంఘ్ గురువులు ఒంటి మీద ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉంటారు. మూర్తి పూజక్ (భగవాన్ మహావీర్, పార్శ్యనాథ్ విగ్రహాల పూజలు చేసేవారు), అమూర్తి పూజక్ (విగ్రహారాధన లేని వారు) జైన్లు ఉంటారు. భగవాన్ మహావీర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు ఇక్కడి జైన్లు. అక్షయ తృతీయ రోజు ఉదయం చెరకు రసం తాగి సూర్యాస్తమయం వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. నివాస ప్రాంతాలు.. నగరంలోని సిప్లిగంజ్, కబూతర్ ఖానా, శాలిబండ, అలియాబాద్, నూర్ఖాన్ బజార్, ఇసామియా బజార్, సుల్తాన్‌బజార్, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, పాట్ మార్కెట్, మెట్టుగూడ, బొల్లారం, మల్కాజిగిరి,తిరుమలగిరి, బేగంబజార్, ఆగాపురా, కాచిగూడ, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో జైన్లు నివాసముంటున్నారు. వీరంతా సంఘాలుగా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జైన్ సేవా సంఘ్, తేరాపంత్ మహాసభ, తేరాపంత్ యువ పరిషత్, తేరాపంత్ మహిళా మండల్, ఉపకార్ సేవా సమితి, శ్రీ జైన్ యువ మండల్, శ్రీ జైన్ మహిళా మండల్, శ్రీ వర్ధమాన్ స్థానక్ వాసి, శ్రీ జైన్ మందిర్ మార్గీ, శ్రీ దిగంబరీ జైన్ వంటి అసోసియేషన్లు జైన్ల అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచే కార్యక్రమాలు చేపడుతున్నాయి. పిల్లి రాంచందర్ జాతీయ సెలవుగా ప్రకటించాలి.. మహావీర్ జయంతి సందర్భంగా జాతీయ సెలవు దినాన్ని ప్రకటిం చాలి. ప్రపంచ వ్యాప్తంగా మహావీర్ జయంతిని వైభవంగా నిర్వహిస్తారు. జైన్ గురువుల సందేశాన్ని ప్రభుత్వ ప్రచారంగా నిర్వహించాలి. జైన్లు అధికంగా నివసించే ప్రాంతాల్లో జైన్ గురువులు బస చేయడానికి ప్రత్యేక కమ్యూనిటీ హాల్లు నిర్మించాలి. - ప్రమోద్ జైన్, ఉపకార్ సేవా సమితి వ్యవస్థాకులు, జైన్ సేవా సంఘ్ ప్రతినిధి. -
78 ఎఫ్‌ఓబీలు, సబ్‌వేలు
జీహెచ్ఎంసీకి ‘ట్రాఫిక్’ ప్రతిపాదనలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు/ సబ్‌వేల ఏర్పాటుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ.. అవసరమైన ప్రాంతాలను సూచిస్తూ ప్రతిపాదనలు పంపాలని ట్రాఫిక్ పోలీసులను కోరింది. 78 ప్రాంతాల్లో పాదచారులకు ఇబ్బందులున్నట్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు సదరు జాబితాను జీహెచ్ ఎంసీకి అందజేశారు. దీనిపై అధ్యయనానికి జీహెచ్ఎంసీ త్వరలో టెండరు పిలవనుంది. కన్సల్టెంట్ల నివేదికకనుగుణంగా వీటిని ఏర్పాటు చేస్తారు. ఎక్కడెక్కడంటే.. సంగీత్, బోయిన్పల్లి, తాడ్‌బండ్, ప్యారడైజ్, తాడ్బన్, బోయిన్పల్లి, టోలిచౌకి (టెంపుల్), నానల్‌నగర్ జంక్షన్లు, రేతిఫైలి బస్టాప్, చిత్రదర్గ, శ్రీకార్ ఉపకార్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ చౌరస్తా, చిక్కడపల్లి పిల్లల పార్కు, అబిడ్స్ జీపీఓ, చర్మాస్, హిమాయత్‌నగర్ వీధినెంబరు 9, వీధినెంబరు 6, లిబర్టీ, లక్డీకాపూల్ లక్కీ హోటల్-అయోధ్య జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్డునెం. 45, బంజరాహిల్స్ రోడ్డునెంబరు 1/12, ఎంజే మార్కెట్, కోఠి ఆంధ్రాబ్యాంక్, సుల్తాన్‌బజార్ గాంధీ జ్ఞానమందిర్, ఐఎస్ సదన్, సైబర్ గేట్‌వే, కూకట్పల్లి బస్టాప్, కేపీహెచ్‌బీ బస్టాప్, మియాపూర్, విప్రో సర్కిల్, మాదాపూర్ వీఆర్ నగర్, చందానగర్, నిజాంపేట, మూసాపేట, నర్సాపూర్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్ రింగ్రోడ్డుకిరువైపులా, సరూర్‌నగర్ సాయిబాబా గుడి, అష్టలక్ష్మి ఆలయం, బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్, జీవీకేమాల్ రోడ్‌నెం 1, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజా, ట్యాంక్‌బండ్‌పై రెండు చోట్ల, బాలానగర్ జంక్షన్, సరోజిని కంటి ఆస్పత్రి, షాదాన్ కాలేజి, ఎంజీబీఎస్, కొండాపూర్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్, బీహెచ్ఈఎల్ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఉప్పల్ బస్టాప్, ఉప్పల్, ఉప్పల్ రింగురోడ్డు, వనస్థలిపురం ఎన్జీఓ కాలనీ, హయత్‌నగర్ బస్టాప్, బీఎన్ రెడ్డి నగర్, సాగర్ రింగ్‌రోడ్డు, జేబీఎస్, విక్రంపురి, తిరుమలగిరి చౌరస్తా, అల్వాల్ బస్టాప్, వెంకటాపురం బస్టాప్, సుచిత్ర సర్కిల్, కొంపలి సినీప్లానెట్, కండ్లకోయ, మేడ్చల్ బస్టాప్, నిమ్స్ గేట్ (బంజారాహిల్స్ రోడ్డు నెం.1), రైల్‌నిలయం.