గీత స్మరణం | today k j yesudas birthday | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Fri, Jan 10 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM

గీత స్మరణం

గీత స్మరణం

నేడు కె.జె.ఏసుదాస్ పుట్టినరోజు
 
 పల్లవి :
 నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా     (2)
 చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా
 కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
 మార్గం చూపే దీపం కాదా ధైర్యం    ॥
 
 చరణం : 1
 
 జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం
 దేహానికైనా గాయం ఈ మందుతోను మాయం
 విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం
 అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం
 స్త్రీల తనువులోనే శీలమున్నదంటే
 పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే
 ఇల్లాళ్ల దేహాలలో శీలమే ఉండదనా
 భర్తన్న వాడెవ్వడూ పురుషుడే కాదు అనా
 శీలం అంటే గుణం అనే అర్థం    ॥
 
 చరణం : 2
 
 గురివింద ఈ సమాజం పరనింద దాని నైజం
 తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం
 తన కళ్ల ముందు ఘోరం కాదనదు పిరికి లోకం
 అన్యాయమన్న నీపై మోపింది పాప భారం
 పడతి పరువు కాచే చేవలేని సంఘం
 సిగ్గు పడకపోగా నవ్వుతోంది చిత్రం
 ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి
 అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్లది
 అంతేగాని నీలో లేదే దోషం    
 ॥
 
 చిత్రం : పెళ్లి చేసుకుందాం (1997), రచన : సిరివెన్నెల
 సంగీతం : కోటి. గానం : కె.జె.ఏసుదాస్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement