టీఆర్ఎస్ నేతల బాహాబాహి | Fight Between TRS Activists MLC Graduate Election Meeting In Koti | Sakshi
Sakshi News home page

హోంమంత్రి సమక్షంలో టీఆర్ఎస్ నేతల బాహాబాహి

Published Sun, Oct 4 2020 5:16 PM | Last Updated on Sun, Oct 4 2020 6:14 PM

Fight Between TRS Activists MLC Graduate Election Meeting In Koti - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాంకోఠిలోని రూబీ గార్డెన్స్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం రసాభాసగా మారింది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ సమక్షంలోనే టీఆర్‌ఎస్‌ నాయకులు బాహాబాహికి దిగడం చర్చనీయాంశంగా మారింది.

అసలు విషయంలోకి వెళితే.. రూబీ గార్డెన్స్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సమావేశానికి హోంమంత్రి మహమూద్‌ అలీ, గోషామహల్‌ నియోజకవర్గ నాయకులు  పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే సమావేశం సందర్భంగా తనను వేదికపైకి ఎందుకు పిలవలేదంటూ సమావేశానికి హాజరైన ఉద్యమకారుడు ఆర్వి మహేందర్‌ కుమార్‌ నిలదీశాడు. దాంతో పక్కనే ఉన్న మరో వ్యక్తి అడ్డుచెప్పబోతే ఒకరిని ఒకరు తోసు‍కుంటూ హోంమంత్రి సమక్షంలోనే కొట్టుకున్నారు. దీంతో సమావేశం నిలిపివేసిన హోంమంత్రి మహమూద్‌ అలీ గొడవపడుతున్న నాయకుల దగ్గరకు వెళ్లి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement