
సాయి ధన్సిక, విమలారామన్, గణేష్ వెంకట్‌రామన్, అమిత్ తివారీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘అంతిమ తీర్పు’. అభిరాం దర్శకత్వంలో సిద్ధి వినాయక డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘టిప్పా టిప్పా..టిప్ప.. టిప్పర్ లారీ నా ఒళ్లే.. రప్ప..రప్ప.. రప్ప వత్తే యాక్సిడేంటేలే’ అంటూ సాగే పాటను సాంగ్ ఇటీవల విడుదల చేశారు. కోటి సంగీతం అందించారు.
(చదవండి: ఒకప్పటిలా కాదు.. హీరోయిన్స్ అంటే వాటికే పరిమితం కాదు)
కాసర్ల శ్యామ్ రచించిన పాట ఇది. మంగ్లీ ఆలపించారు. అమిత్‌తివారీ, స్నేహా గుప్తా ఆ పాటలో ఆడాపాడారు. ఈశ్వర్ పెంటి ఈ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. మంగ్లీ హస్కీ వాయిస్‌తో పాడిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘చక్కని కథాంశంతో రూపొందిన చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. మంగ్లీ ఆలపించిన పాటకు మంచి స్పందల లభిస్తోంది. త్వరలోనే లో సెకెండ్ లిరికల్ సాంగ్, టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment